ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అబు ధాబీ క్రౌన్ ప్రిన్స్ మరియు యుఎఇ సాయుధ బలగాల డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ మాన్య శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్-నాహ్ యాన్ తో టెలిఫోన్ లో సంభాషించారు.
రెండు దేశాల మధ్య సర్వతోముఖ సహకారం బలాన్ని పుంజుకుంటుండడం పట్ల నేత లు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా పెంపొందించుకోవాలన్న వచన బద్ధత ను వారు పునరుద్ఘాటించారు.
ఈ నెల లోనే అబు ధాబీ లో ఒఐసి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల సమితి ని ఉద్దేవించి ప్రసంగించేందుకు గౌరవ అతిథి గా పాలుపంచుకోవాలంటూ భారతదేశాన్ని ఆహ్వానించినందుకు క్రౌన్ ప్రిన్స్ కు ప్రధాన మంత్రి ఈ సందర్భం గా ధన్యవాదాలు తెలియజేశారు. శాంతి మరియు పురోగతి ల తాలూకు ఉమ్మడి లక్ష్యాల ను సాధించడం లో ఈ చరిత్రాత్మక ప్రాతినిధ్యం తోడ్పడగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.