ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ మాల్కమ్ టర్న్ బుల్ కు టెలిఫోన్ చేసి, దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
భారతీయ మూలాలు కలిగిన ఒక వ్యక్తి శ్రీ మన్ మీత్ అలీశేర్ ఆస్ట్రేలియా లో ఇటీవల దారుణ హత్యకు గురి అయిన ఉదంతంపై భారతదేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం అయిన సంగతిని కూడా ప్రధాన మంత్రి.. ఆస్ట్రేలియా ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు.
ఈ హత్యపై ప్రధాని శ్రీ టర్న్ బుల్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ విషయంలో దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించారు.
2017 సంవత్సరంలో భారతదేశానికి రావలసిందంటూ ప్రధాని టర్న్ బుల్ ను ప్రధాన మంత్రి శ్రీ మోదీ మరొక్క మారు ఆహ్వానించారు.
PM speaks to Australian PM Turnbull to convey Diwali greetings, expresses concern over killing of Manmeet Alisher https://t.co/HKJA2n5jFq
— Vikas Swarup (@MEAIndia) October 30, 2016