కతర్ అమీర్ శ్రీ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు.
‘‘కతర్ అమీర్ మాన్య శ్రీ @TamimBinHamad తో ఈ రోజు న చక్కని సంభాషణ చోటు చేసుకొంది. కోవిడ్-19 కి వ్యతిరేకం గా భారతదేశం చేస్తున్న యుద్ధం లో సాయపడుతామంటూ, భారతదేశానికి సంఘీభావాన్ని వ్యక్తం చేసినందుకుగాను కతర్ అమీర్ గారి కి నేను ధన్యవాదాలు వ్యక్తం చేశాను. అలాగే కతర్ లో భారతీయ సముదాయానికి సమకూర్చుతున్న సంరక్షణ పట్ల మన కృతజ్ఞత ను కూడా తెలియజేశాను’’ అని శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Had a good conversation with His Highness @TamimBinHamad, Amir of Qatar today. I thanked His Highness for the solidarity and offer of support in India's fight against COVID-19. I also conveyed our gratitude for the care being provided to the Indian community in Qatar.
— Narendra Modi (@narendramodi) April 27, 2021