మిత్రులారా మీకు ఇదే శుభోదయం,
సాధారణంగా దీపావళితోనే శీతకాల సమావేశాలు మొదలవుతాయి. కానీ, భూతాపం మరియు జల వాయు పరివర్తన ప్రభావం కారణంగా శీతలత్వం యొక్క ప్రాబల్యం ఇంకా మన అనుభవం లోకి రావడం లేదు.
ఏమైనప్పటికీ, మన శీతకాల సమావేశాలు ఆరంభమవుతున్నాయి. మరి 2017 లో మొదలై, 2018 లోనూ కొనసాగనున్న ఈ శీతకాల సమావేశాలు విశాల ప్రభావం చూపగల పలు ముఖ్యమైన ప్రభుత్వ సంబంధ అంశాలు పార్లమెంటు ముందుకు తీసుకురాగలమన్న విశ్వాసం నాకుంది.
ఈ సందర్భంగా మంచి వాదనలు.. అవి కూడాను సకారాత్మకమైన వాదోపవాదాలు.. కొత్త కొత్త సూచనలతో కూడిన చర్చలు సాగాలి; అలా జరిగినప్పుడే, దేశ ప్రయోజనం కోసం పార్లమెంటు సమయాన్ని సముచిత రీతిన వినియోగించినట్లు కాగలదు.
నిన్న కూడా మేం ఒక ‘అఖిలపక్ష సమావేశా’న్ని నిర్వహించుకొన్నాం. అందులో భాగంగా- దేశాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి విధంగా- పార్లమెంటు సమావేశాలను సరైన రీతిలో వినియోగించుకోవాలన్న ఉమ్మడి గళం వినవచ్చింది.
సభ కనుక ఒక సకారాత్మకమైన ధోరణిలో పనిచేస్తే- దేశానికి లాభం చేకూరుతుందని, ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని, మరియు సామాన్య ప్రజానీకం యొక్క ఆశలు, ఆకాంక్షలు నెరవేరడం కోసం ఒక కొత్త విశ్వాసం ఏర్పడుతుందన్న- భావన కూడా నాలో వ్యక్తమవుతూ ఉంది. మీకందరికీ అనేక ధన్యవాదాలు.
The Winter Session of Parliament is starting and I am confident that it will be productive session. I hope there is constructive debate and we come up with innovative solutions to our nation's problems: PM @narendramodi speaks at the start of the Winter Session of Parliament
— PMO India (@PMOIndia) December 15, 2017
May this Parliament Session contribute to the nation's growth: PM @narendramodi at the start of the Winter Session of Parliament
— PMO India (@PMOIndia) December 15, 2017
At yesterday's all-party meeting, we all were clear that we need to take the country ahead and this session should be used positively to achieve that: PM @narendramodi at the start of the Winter Session of Parliament
— PMO India (@PMOIndia) December 15, 2017