పాలస్తీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంకా ఓమాన్ లకు బయలుదేరే ముందు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేసిన ప్రకటన పాఠం ఈ కింది విధంగా ఉంది.
“ఫిబ్రవరి 9వ తేదీ నుండి 12 వ తేదీ వరకు పాలస్తీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంకా ఓమాన్ లలో నేను ద్వైపాక్షిక పర్యటనలను చేపట్టబోతున్నాను.
2015వ సంవత్సరం తరువాతి కాలంలో గల్ఫ్ మరియు పశ్చిమ ఆసియా ప్రాంతాలలో అయిదో సారి పర్యటించనుండడం నాకు సంతోషాన్నిస్తోంది. మన విదేశీ సంబంధాలలో ఈ ప్రాంతానికి ఒక కీలకమైన ప్రాధాన్యం ఉంది. ఇక్కడి దేశాలతో మనం చైతన్యశీలమైన బహుళ పార్శ్వికమైన అనుబంధాన్ని కలిగివున్నాం.
నా పర్యటన ఫిబ్రవరి 10 తేదీ నాడు జోర్డాన్ మీదుగా ప్రయాణించి, పాలస్తీనా కు చేరుకోవడంతో మొదలవుతుంది. మార్గమధ్యంలో బస కల్పిస్తున్నందుకుజోర్డాన్ రాజు శ్రీ రెండో అబ్దుల్లా కు నేను కృతజ్ఞుడినై ఉంటాను. ఆయనను ఫిబ్రవరి 9వ తేదీన అమ్మాన్ లో కలుసుకోవడం కోసం నేను ఎదురుచూస్తున్నాను.
ఇది భారతదేశం నుండి పాలస్తీనా ను సందర్శిస్తున్న మొట్టమొదటి ప్రధాన మంత్రి పర్యటన కాబోతోంది. అధ్యక్షులు శ్రీ మొహమూద్ అబ్బాస్ తో జరుపబోయే చర్చల కోసం, అలాగే పాలస్తీనా అభివృద్ధి మరియు పాలస్తీనా ప్రజలకు మన మద్దతును పునరుద్ఘాటించడం కోసం నేను నిరీక్షిస్తున్నాను.
ఫిబ్రవరి 10వ, 11వ తేదీలలో నేను యుఎఇ లో పర్యటిస్తాను. 2015 ఆగస్టు లో పర్యటించిన అనంతరం మరోసారి నేను అక్కడకు వెళ్తున్నాను. యుఎఇ ఒక విలువైన వ్యూహాత్మక భాగస్వామి. యుఎఇ తో ఆర్థిక వ్యవస్థ, శక్తి, ఉన్నత సాంకేతిక విజ్ఞానం, ఇంకా భద్రత లతో సహా ప్రధాన రంగాలన్నింటిలో మనం శర వేగంగా దూసుకుపోతున్నటువంటి సహకారాన్ని పొందుతున్నాం. ఈ రంగాలలో మన పురోగతిని గురించి, ఇంకా ఉపాధ్యక్షులు, యుఎఇ ప్రధాని మరియు దుబయ్ పాలకుడు శ్రీ షేక్ మొహమ్మద్ బిన్ రశీద్ అల్ మక్తూమ్ తోను, అబూ ధాబి యువ రాజు శ్రీ షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్ యాన్ తోను నేను జరపబోయే సమావేశాల కోసం వేచి వున్నాను.
యుఎఇ నాయకత్వం ఆహ్వానించిన మీదట, దుబయ్ లో వరల్డ్ గవర్నమెంట్ సమిట్ 6వ సంచికను ఉద్దేశించి నేను ప్రసంగించనున్నాను. భారతదేశం ఈ శిఖర సమ్మేళనంలో గౌరవ అతిథి దేశంగా పాలుపంచుకోనుంది.
అదే రోజున నేను దుబాయి లో యుఎఇ, అరబ్ ప్రాంతాల సిఇఒ లతో భారతదేశంలోని విస్తృత ఆర్థిక అవకాశాల గురించి, వ్యాపార సమన్వయాన్ని పెంపొందించుకొనేందుకు గాను కలిసికట్టుగా మరేయే చర్యలు చేపట్టాలో అనే దానిని గురించి చర్చలు జరపనున్నాను.
ఓమాన్ మనం శ్రేష్ఠమైన సంబంధాలను కలిగి ఉన్న మరొక సన్నిహిత సముద్ర ప్రాంత పొరుగు దేశంగా ఉంది. నేను ఓమాన్ సుల్తాన్ తో, ఇతర కీలక నాయకులతో చర్చలు జరుపుతాను. ఓమాన్ కు చెందిన ప్రముఖ వ్యాపార రంగ ప్రముఖులతో నేను భేటీ అవుతాను. భారతదేశంతో బలమైన ఆర్థిక, వ్యాపార సంబంధాలను అభివృద్ధి పరచుకోవడం అనే అంశం పై వారితో చర్చలు జరుపుతాను.
ఫిబ్రవరి 11వ, 12వ తేదీలలో నేను ప్రధాన మంత్రిగా అక్కడ నా తొలి పర్యటనను చేపట్టనుండడం పట్ల ఆనందిస్తున్నాను. భారతదేశం మరియు ఓమాన్ వర్ధిల్లుతున్నటు వంటి సంబంధాలను కలిగివున్నాయి. ఈ సంబంధాలు శతాబ్దాల తరబడి ఇరు ప్రాంతాల ప్రజల మధ్య చోటుచేసుకొంటున్న రాక పోక లతో వేళ్లూనుకొన్నాయి.
ఫిబ్రవరి 11వ తేదీ నాటి సాయంత్రం, నేను ఓమాన్ సుల్తాన్ తో భేటీ అవుతాను. అలాగే, డిప్యూటీ ప్రైం మినిస్టర్ ఫర్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ శ్రీ సయ్యిద్ ఫహద్ బిన్ మహమూద్ అల్ సయద్ తో, డిప్యూటీ ప్రైం మినిస్టర్ ఫర్ ఇంటర్ నేశనల్ రిలేశన్స్ అండ్ కోఆపరేశన్ అఫైర్స్ శ్రీ సయ్యిద్ అసాద్ బిన్ తారీఖ్ అల్ సయద్ తో సమావేశమవుతాను. ద్వైపాక్షిక సహకారంతో పాటు సాంప్రదాయకంగా పటిష్టంగా ఉన్న మన సంబంధాలను మరింతగా పెంపొందించుకొనేందుకు చేపట్టవలసిన చర్యలను కూడా మేం సమీక్షిస్తాం.
ఫిబ్రవరి 12వ తేదీన, నేను అమాన్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశమై, భారతదేశంతో బలవత్తరమైన ఆర్థిక మరియు వ్యాపార సంబంధాలను అభివృద్ధి పరచుకోవడం అనే అంశంపై వారితో చర్చిస్తాను.
అమాన్ లో, యుఎఇ లో పెద్ద సంఖ్యలో నివసిస్తున్న ప్రవాసీ భారతీయుల సముదాయంతో భేటీ అయ్యే అవకాశం నాకు దక్కనుంది. వారు ఆయా దేశాలను తమ నివాసంగా మలచుకొన్నారు. గల్ఫ్ ప్రాంతంలో 9 మిలియన్ మందికి పైగా భారతీయులు మనుగడ సాగిస్తూ, విధులను నిర్వహిస్తున్నారు. వారిలో ముడింట ఒకటో వంతు మంది ఒక్క యుఎఇ లోనే మనుగడ సాగిస్తున్నారు. ఓమాన్ లో అయితే, వారు అతి పెద్ద నిర్వాసితుల సముదాయంగా ఏర్పడ్డారు.
ప్రవాసీ భారతీయుల సముదాయం భారతదేశానికి, గల్ఫ్ ప్రాంత దేశాలకు మధ్య నిర్మాణమైనటువంటి ఒక స్నేహ సేతువు. వారు తమ ఆతిథేయి దేశాల పురోగతిలో, సమృద్ధి లలో క్రియాశీల భాగస్తులుగా కూడా ఉంటున్నారు.
పశ్చిమ ఆసియా మరియు గల్ఫ్ ప్రాంతంలో పర్యటించడం ద్వారా భారతదేశం యొక్క అంతకంతకు వర్ధిల్లుతున్న మరియు ముఖ్యమైన సంబంధాలను దృఢతరం చేయడం కోసం నేను ఎదురుచూస్తూ ఉన్నాను”.
I will be undertaking bilateral visits to Palestine, United Arab Emirates and Oman from 9th to 12th February. The Gulf and West Asian region is a key priority in our external engagement. We enjoy vibrant multi-dimensional ties with the countries there.
— Narendra Modi (@narendramodi) February 8, 2018
The Palestine visit will begin on 10th February after transiting through Jordan. I am grateful to His Majesty King Abdullah II of Jordan for facilitating the transit and look forward to meeting him in Amman on 9th February.
— Narendra Modi (@narendramodi) February 8, 2018
Looking forward to my discussions with President Mahmoud Abbas and reaffirming our support for the Palestinian people and the development of Palestine. https://t.co/Kq3smWsJp9
— Narendra Modi (@narendramodi) February 8, 2018
In UAE, I will hold talks with His Highness Sheikh Mohammed bin Rashid Al Maktoum, the Vice President and Prime Minister of UAE and Ruler of Dubai, and His Highness Sheikh Mohamed bin Zayed Al Nahyan, Crown Prince of Abu Dhabi. @HHShkMohd @MohamedBinZayed
— Narendra Modi (@narendramodi) February 8, 2018
At the invitation of the leadership of the UAE, I will be addressing the 6th edition of the @WorldGovSummit in Dubai, where India is the Guest Country of Honour. https://t.co/Kq3smWsJp9
— Narendra Modi (@narendramodi) February 8, 2018
There will be interactions with leading UAE and Arab CEOs in Dubai on the vast economic opportunities in India and what more can be done together to increase business collaboration.
— Narendra Modi (@narendramodi) February 8, 2018
Oman is a close maritime neighbour with whom we enjoy excellent relations. I will hold talks with His Majesty the Sultan of Oman and other leaders. There shall be interactions with businesspersons of Oman on developing stronger economic links with India. https://t.co/GRqMmshHCt
— Narendra Modi (@narendramodi) February 8, 2018
In both Oman and the UAE, I will have the opportunity to meet the large Indian diasporas that have made those countries their home. The Indian diaspora is a bridge of friendship between India and the Gulf countries. https://t.co/KUBK736sjz
— Narendra Modi (@narendramodi) February 8, 2018