ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేపాల్ కు బయలుదేరి వెళ్ళే ముందు విడుదల చేసిన ప్రకటన పాఠం ఈ కింది విధంగా ఉంది.
“ఆగస్టు 30-31 వ తేదీల్లో బిఐఎమ్ఎస్‌టిఇసి నాలుగో శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడం కోసం కాఠ్ మాండూ కు వెళ్తున్నాను.
శిఖర సమ్మేళనం లో నా యొక్క ప్రాతినిధ్యం మన ఇరుగు పొరుగు దేశాలకు భారతదేశం ఇస్తున్నటువంటి అత్యున్నత ప్రాధాన్యానికి మరియు ఆగ్నేయ ఆసియా లో గల ఇతర దేశాల తో మన సంబంధాలను గాఢతరంగా కొనసాగించాలనే మన నిబద్ధత కు ప్రతీక గా నిలుస్తుంది.
ఈ శిఖర సమ్మేళనం లో భాగంగా మన ప్రాంతీయ సహకారాన్ని మరింత సుసంపన్నం చేసుకొనేందుకు, మన వ్యాపార సంబంధాలను పెంపొందించుకొనేందుకు, బంగాళాఖాతం ప్రాంతం లో శాంతి ని, సమృద్ధి ని వర్ధిల్లజేసేందుకు బిఐఎమ్ఎస్‌టిఇసి యొక్క నేతలందరితో నేను చర్చలు జరపబోతున్నాను.
“బంగాళాఖాతం ప్రాంతం లో శాంతి సమృద్ధి, స్థిరత్వం దిశగా కృషి” అనేది ఇతివృత్తం గా నిర్వహించనున్న ఈ శిఖర సమ్మేళనం మన ఉమ్మడి ఆకాంక్షలకు మరియు సవాళ్ళకు ఒక సమష్టి ప్రతిస్పందన ను వ్యక్తం చేసేందుకు అవకాశాన్ని కల్పించగలదు.
బిఐఎమ్ఎస్‌టిఇసి లో భాగంగా నమోదు చేసిన పురోగతి ని బిఐఎమ్ఎస్‌టిఇసి నాలుగో శిఖర సమ్మేళనం మరింత ఏకీకృత పరచగలదని, అలాగే ఒక శాంతియుతమైన, సమృద్ధమైన బంగాళాఖాతం ప్రాంతాన్ని ఆవిష్కరించే క్రమానికి రూపురేఖలను దిద్దుతుందని నేను విశ్వసిస్తున్నాను.
బిఐఎమ్ఎస్‌టిఇసి శిఖర సమ్మేళనం కాలం లో బాంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, శ్రీ లంక ఇంకా థాయీలాండ్ ల నేతలతో చర్చించే అవకాశం నాకు దక్కబోతోంది.
నేపాల్ ప్రధాని రైట్ ఆనరబుల్ శ్రీ కె.పి.శర్మ ఓలీ తో భేటీ కావడం కోసం, మరి ఆ సందర్భంగా ఇంతకు ముందు 2018 మే నెల లో నేను నేపాల్ ను సందర్శించినప్పటి నుండి మన ద్వైపాక్షిక సంబంధాలలో నమోదైన పురోగతి ని సమీక్షించడం కోసం నేను నిరీక్షిస్తున్నాను.
పశుపతినాథ్ దేవాలయం ఆవరణ లో నేపాల్ భారత్ మైత్రి ధర్మశాల ను ప్రారంభించే గౌరవం, ప్రత్యేక అధికారం ప్రధాని శ్రీ ఒలీ తో పాటు నాకు లభించనున్నాయి.”
Will be in Kathmandu on 30th and 31st August to take part in the 4th BIMSTEC Summit. The Summit focuses on the theme ‘Towards a Peaceful, Prosperous and Sustainable Bay of Bengal Region.’ Will be interacting with various world leaders during the Summit. https://t.co/ycGzDG85GN
— Narendra Modi (@narendramodi) August 29, 2018
I look forward to meeting PM KP Sharma Oli and reviewing the progress we have made in India-Nepal bilateral relations. PM Oli and I will also inaugurate the Nepal-Bharat Maitri Dharamshala at the Pashupatinath Temple Complex.
— Narendra Modi (@narendramodi) August 29, 2018