నేను 2019వ సంవత్సరం అక్టోబర్ 29వ తేదీ నాడు కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా కు ఒక రోజు ఆధికారిక సందర్శన నిమిత్తం వెళ్తున్నాను. రియాద్ లో జరుగుతున్న మూడో ఫ్యూచర్ ఇన్వెస్ట్ మెంట్ ఇనీశియేటివ్ ఫోరమ్ తాలూకు సర్వ సభ్య సదస్సు కు హాజరు కావాలంటూ సౌదీ అరేబియా రాజు శ్రీ సల్ మాన్ బిన్ అబ్దులజీజ్ అల్-సౌద్ ఆహ్వానించిన మీదట ఈ సందర్శన సాగుతున్నది.
నేను రియాద్ ను సందర్శించే కాలం లో, సౌదీ అరేబియా రాజు తో ద్వైపాక్షిక చర్చల లో పాలు పంచుకొంటాను. ఉభయ పక్షాల ప్రయోజనాలు ముడివడి ఉన్నటువంటి ప్రాంతీయ అంశాల పైన మరియు ప్రపంచ అంశాల పైన, అలాగే ద్వైపాక్షిక సహకారాని కి సంబంధించిన పలు అంశాల పైన సౌదీ అరేబియా యువరాజు శ్రీ మొహమ్మద్ బిన్ సల్ మాన్ ను కూడా నేను కలుసుకొని ఆయన తో చర్చలు జరుపుతాను.
సౌదీ అరేబియా మరియు భారతదేశం చాలా కాలం గా సన్నిహితమైనటువంటి మరియు మైత్రిపూర్వకమైనటువంటి సంబంధాల ను నెరపుతూ వస్తున్నాయి. భారతదేశం యొక్క శక్తి అవసరాల ను తీర్చడం లో సౌదీ అరేబియా అతి పెద్ద మరియు విశ్వసనీయమైన సరఫరాదారు దేశాల లో ఒకటి గా ఉన్నది.
యువరాజు 2019వ సంవత్సరం ఫిబ్రవరి లో న్యూ ఢిల్లీ ని సందర్శించిన సందర్భం లో భారతదేశం లోని ప్రాధాన్య రంగాల లో 100 బిలియన్ యుఎస్ డాలర్ కు మించిన పెట్టుబడుల పట్ల వచన బద్ధత ను వ్యక్తం చేశారు.
సౌదీ అరేబియా తో ద్వైపాక్షిక సహకారాని కి ఉద్దేశించిన ఇతర ముఖ్యమైన రంగాల లో రక్షణ, భద్రత, వ్యాపారం, సంస్కృతి, విద్య, ఇంకా ప్రజల కు ప్రజల కు మధ్య సంబంధాలు ఉన్నాయి.
నా పర్యటన కాలం లో, వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటు కు కుదరగల ఒప్పందం ఇండియా-సౌదీ అరేబియా స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ ను ఒక నూతన స్థాయి కి ఉన్నతీకరించ గలుగుతుంది.
ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనీశియేటివ్ ఫోరమ్ లో పాల్గొని, భారతదేశం 2024వ సంవత్సరం కల్లా 5 ట్రిలియన్ డాలర్ విలువ కలిగిన ఆర్థిక వ్యవస్థ గా ఆవిర్భవించేందుకు కదం తొక్కుతున్న సందర్భం లో, గ్లోబల్ ఇన్వెస్టర్ లకు భారత్ లో పెట్టుబడి మరియు వ్యాపార అవకాశాలు పెరుగుతూ వస్తున్నాయన్న అంశాన్ని గురించి నేను ఉపన్యాసించనున్నాను.