కొరియా అధ్యక్షుడు మూన్ జే -ఇన్ ఆహ్వానం మేరకు నేను రిపబ్లిక్ ఆఫ్ కొరియా సందర్శిస్తున్నాను. రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు ఇది నా రెండవ పర్యటన. అధ్యక్షుడు మూన్‌తో ఇది నా రెండవ శిఖరాగ్ర సమావేశం.
గత సంవత్సరం జూలై లో కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్, ఫస్ట్ లేడీ శ్రీమతి కిమ్ జుంగ్-సూక్‌లు భారత్ పర్యటనకు వచ్చినపుడు వారికి స్వాగతం పలకడం ఆనందంగా భావిస్తున్నాను. రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు నా పర్యటన , ఇరు దేశాల మధ్య సంబంధాలకు మేం ఇరువురం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది.
రిపబ్లిక్ ఆఫ్ కొరియాను విలువైన మిత్రుడిగా మేం భావిస్తాం. ఈ దేశంతో మాకు ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. సహ ప్రజాస్వామ్య దేశంగా ఇండియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా (ఆర్.ఒ.కె)లు ఉమ్మడి విఉలువలు, ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి ఉమ్మడి దార్శనికత కలిగి ఉన్నాయి. సహ మార్కెట్ ఆర్థిక వ్యవస్థలుగా మా అవసరాలు, మా బలాలు పరస్పర పూరకాలు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా మన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి , మన స్టార్టప్ ఇండియా, క్లీన్ ఇండియా వంటి కార్యక్రమాలకు ప్రధాన భాగస్వామి. శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన రంగంలో మా సహకారం ప్రోత్సాహకరంగా ఉంది. మా పరిశోధనలు మౌలిక శాస్త్ర విజ్ఞాన రంగం నుంచి ఆధునిక శాస్త్ర విజ్ఞాన రంగం వరకు విస్తరించి ఉన్నాయి.
మా ప్రజలకు , ప్రజలకు మధ్య సంబంధాలు, రాకపోకలు ఎల్లప్పుడూ మా స్నేహ సంబంధాలకు పునాదిగా ఉంటూ వస్తున్నాయి. గత నవంబర్‌లో అయోధ్యలో జరిగిన దీపోత్సవ్‌కు ఫస్ట్‌లేడీని ప్రత్యేక ప్రతినిధిగా పంపాలని అధ్యక్షుడు మూన్ నిర్ణయించడం మాకు ఎంతో సంతోషం కలిగించింది.
మన యాక్ట్ ఈస్ట్ పాలసీ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా వారి నూతన దక్షిణాది దేశాల విధానాల మధ్య సామరస్యం, ఉభయ దేశాల మధ్య సంబంధాలు నానాటికీ మరింత బలపడడానికి , సంబంధాలలో కొత్తదనానికి కారణం.
ఉభయ దేశాలూ కలసి పనిచేయడానికి , మా సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోవడానికి గట్టి సంకల్పంతో ఉనప్నాం..ఈ సంబంధాలను భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రజలకోసం భాగస్వామ్యం, సుసంపన్నత, శాంతి దిశగా ముందుకు తీసుకుపోతాం..
ఈ పర్యటన సందర్భంగా , కొరియా అధ్యక్షుడు మూన్ తోపాటు నేను వాణిజ్యవేత్తలను, భారత ప్రజల ను వివిధ జీవన రంగాలలోని ప్రజలను కలుసుకుంటాను.
ఈ పర్యటన ఈ ప్రధాన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను.