Our constant endeavour is to ensure affordable healthcare to every Indian: PM
To ensure the poor get access to affordable medicines, the Pradhan Mantri Bhartiya Janaushadhi Pariyojna has been launched: PM
The Government of India has reduced prices of stents substantially. This is helping the poor and the middle class the most: PM
Swachh Bharat Mission is playing a central role in creating a healthy India: PM

ప్ర‌ధాన మంత్రి భారతీయ జ‌న్ ఔష‌ధి ప‌రియోజ‌న మ‌రియు ఇత‌ర కేంద్ర ప్ర‌భుత్వ ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌థ‌కాల‌కు దేశవ్యాప్తంగా ఉన్న‌టువంటి ల‌బ్దిదారుల‌తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలకు చెందిన వివిధ ల‌బ్దిదారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌ధాన మంత్రి జ‌రుపుతున్న ముఖాముఖి స‌మావేశాల ప‌రంప‌ర‌ లో ఇది అయిదో స‌మావేశం.

ఆరోగ్య సంర‌క్ష‌ణ మ‌రియ వెల్‌నెస్ ల యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి వివ‌రిస్తూ, అన్ని విజ‌యాల‌కు మ‌రియు స‌మృద్ధి కి ఆరోగ్య‌మే మూలం అన్నారు. భార‌త‌దేశం లోని 125 కోట్ల మంది పౌరులు ఆరోగ్యంగా ఉన్న‌ప్పుడే భార‌త‌దేశం ఘ‌న‌మైంది, ఆరోగ్య‌వంత‌మైందీ కాగ‌ల‌గుతుంది అని ఆయ‌న అన్నారు.

ల‌బ్దిదారుల‌తో శ్రీ మోదీ మాట్లాడుతూ, అనారోగ్యం అనేది కుటుంబాల పై ఆర్థికంగా పెను భారాన్ని మోప‌డ‌ం మాత్రమే కాకుండా మ‌న సామాజిక‌, ఆర్థిక రంగాల‌ను కూడా ప్ర‌భావితం చేస్తుంద‌న్నారు. ఈ కార‌ణంగా, ప్ర‌తి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క పౌరురాలికి త‌క్కువ ఖ‌ర్చుతో ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ అందేట‌ట్లు చూడడానికి ప్ర‌భుత్వం పాటుప‌డుతోంద‌ని ఆయ‌న చెప్పారు. ‘ప్ర‌ధాన మంత్రి భారతీయ జ‌న్ ఔష‌ధి ప‌రియోజ‌న‌’ను ఈ ఉద్దేశం తోనే ప్రారంభించడం జరిగిందని, ఈ పథకం ద్వారా పేద‌లు, దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి, ఇంకా మ‌ధ్య‌త‌ర‌గతి వ‌ర్గాలు త‌క్కువ ఖ‌ర్చు తో కూడిన ఔష‌ధాల‌ను పొందగలుగుతార‌ని, మ‌రి వారి ఆర్థిక భారం సైతం త‌గ్గుతుంద‌ని ఆయ‌న తెలిపారు.

దేశం అంత‌టా 3600 ల‌కు పైగా జ‌న్ ఔష‌ధి కేంద్రాల‌ను ప్ర‌భుత్వం తెరచింద‌ని, వీటిలో 700 ల‌కు పైగా జినెరిక్ మందులు త‌క్కువ ఖ‌ర్చులో ల‌భ్యం అవుతున్నాయ‌ని వెల్ల‌డించారు. మార్కెట్ ధ‌ర క‌న్నా 50 నుండి 90 శాతం త‌క్కువ‌ ధరకే జ‌న్ ఔష‌ధి కేంద్రాల‌లో మందులు దొరుకుతాయని ప్ర‌ధాన మంత్రి అన్నారు. అంతేకాక స‌మీప భ‌విష్య‌త్తు లో జ‌న్ ఔష‌ధి కేంద్రాల సంఖ్య 5000 కు పైబ‌డుతుంద‌ని ఆయ‌న చెప్పారు.

హెల్త్ స్టెంట్ లను గురించి ప్ర‌ధాన మంత్రి చెబుతూ, వీటిని కొనుగోలు చేయ‌డానికి పౌరులు ఇంత క్రితం వారి యొక్క ఆస్తి ని విక్ర‌యించ‌డ‌మో లేదా త‌న‌ఖా పెట్ట‌డ‌మో చేసే వారు అన్నారు. పేదల‌కు మ‌రియు మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి సహాయకారిగా ఉండేందుకు స్టెంట్ ల ధ‌ర‌ల‌ను ప్రభుత్వం గణనీయంగా త‌గ్గించి వేసింద‌ని కూడా ఆయన వివ‌రించారు. హార్ట్ స్టెంట్ ల ధ‌ర‌ సుమారు 2 ల‌క్ష‌ల రూపాయ‌ల స్థాయి నుండి 29000 రూపాయ‌ల‌కు త‌గ్గిపోయింది.

మోకాలి మార్పిడి ధ‌ర‌ల‌ను ప్ర‌భుత్వం 60 నుండి 70 శాతం మేర త‌గ్గించింద‌ని ముఖాముఖిలో భాగంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తెలిపారు. దీనితో వీటి ధ‌ర 2.5 ల‌క్ష‌ల రూపాయ‌ల నుండి 70000 – 80000 కు దిగివ‌చ్చింది. భార‌త‌దేశంలో ప్ర‌తి ఏటా సుమారు ఒక లక్ష నుండి ఒక‌టిన్న‌ర ల‌క్ష‌ల మోకాలి శ‌స్త్ర చికిత్స‌లు జ‌రుగుతున్నాయని అంచ‌నా వేయడమైంది. ఈ లెక్కన, మోకాలి మార్పిడి ధ‌ర‌ల‌లో త‌గ్గింపు ప్ర‌జ‌ల‌కు సుమారు 1500 కోట్ల రూపాయ‌ల వరకు ఆదా కు దారి తీసింది.

ప్ర‌ధాన మంత్రి రాష్ట్రీయ డ‌యేలిసిస్ ప్రోగ్రామ్ ద్వారా 500 కు పైగా జిల్లాల‌లో 2.25 ల‌క్ష‌ల మంది రోగుల‌కు 22 ల‌క్ష‌ల‌కు పైగా డ‌యేలిసిస్ సెష‌న్ లను ప్ర‌భుత్వం నిర్వ‌హించింది. 528 జిల్లాల‌లో 3.15 కోట్ల మందికి పైగా బాల‌ల‌కు మ‌రియు 80 ల‌క్ష‌ల మంది గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఇంద్ర‌ధ‌నుష్ కార్యక్రమంలో భాగంగా టీకా మందు ఇవ్వ‌డం జ‌రిగింది. మ‌రిన్ని ప‌డ‌క‌లు, మ‌రిన్ని ఆసుప‌త్రులు, ఇంకా మ‌రింత మంది వైద్యుల ల‌భ్య‌త‌ కోసం ప్ర‌భుత్వం 92 వైద్య క‌ళాశాల‌ల‌ను తెరవడంతో పాటు ఎమ్‌బిబిఎస్‌ సీట్ల‌ను 15000 మేర‌కు పెంచింది.

ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ ఖర్చును త‌గ్గించడం మరియు దానిని అందుబాటు స్థాయికి తీసుకు రావడం కోసం ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని ప్రభుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ‘ఆయుష్మాన్ భార‌త్’ లో భాగంగా 10 కోట్ల కుటుంబాల‌కు 5 ల‌క్ష‌ల రూపాయ‌ల వరకు ఆరోగ్య బీమా ర‌క్ష‌ణ‌ను అంద‌జేయ‌డం జ‌రుగుతుంది.

స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్ గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఈ ప‌థ‌కం ఒక ఆరోగ్యవంత‌మైన భార‌త‌దేశాన్ని నిర్మించ‌డంలో కీల‌క‌ భూమికను పోషిస్తోంద‌ని పేర్కొన్నారు. స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్ కార‌ణంగా ప్ర‌స్తుతం భార‌త‌దేశంలో బ‌హిరంగ ప్ర‌దేశాల‌లో మ‌ల‌ మూత్రాదుల విస‌ర్జ‌న‌కు తావు లేన‌టువంటి గ్రామాలు 3.5 ల‌క్ష‌లకు చేరుకొన్నాయి. పారిశుధ్య ర‌క్ష‌ణ 38 శాతం మేర పెరిగింది.

ల‌బ్దిదారులు ప్ర‌ధాన మంత్రితో మాట్లాడుతూ, మందుల ఖ‌ర్చులను ‘ప్ర‌ధాన మంత్రి భారతీయ జ‌న్ ఔష‌ధి పరియోజ‌న’ ఏ విధంగా త‌గ్గించిందీ, ఆ ఖ‌ర్చును తాము భ‌రించ‌గ‌లిగే స్థాయికి తీసుకువ‌చ్చిందీ వివ‌రించారు. హార్ట్ స్టెంట్ మ‌రియు మోకాలి మార్పిడి శ‌స్త్ర చికిత్స‌ల ధరలు తగ్గిపోయినందువల్ల వారి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పు వ‌చ్చిందో కూడా ల‌బ్దిదారులు చాటి చెప్పారు.

యోగాభ్యాసాన్ని చేపట్టవ‌ల‌సిందిగాను, యోగా ను జీవ‌న శైలిలో ఓ భాగంగా చేసుకోవడం ద్వారా ఒక స్వాస్థ్య దేశ నిర్మాణం లో వారి వంతు స‌హాయ ప‌డవలసిందిగాను ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి ఈ సందర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Oman, India’s Gulf 'n' West Asia Gateway

Media Coverage

Oman, India’s Gulf 'n' West Asia Gateway
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing of renowned writer Vinod Kumar Shukla ji
December 23, 2025

The Prime Minister, Shri Narendra Modi has condoled passing of renowned writer and Jnanpith Awardee Vinod Kumar Shukla ji. Shri Modi stated that he will always be remembered for his invaluable contribution to the world of Hindi literature.

The Prime Minister posted on X:

"ज्ञानपीठ पुरस्कार से सम्मानित प्रख्यात लेखक विनोद कुमार शुक्ल जी के निधन से अत्यंत दुख हुआ है। हिन्दी साहित्य जगत में अपने अमूल्य योगदान के लिए वे हमेशा स्मरणीय रहेंगे। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति।"