ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో జరిగిన గవర్నర్ల సమావేశం ముగింపు సదస్సులో మాట్లాడారు.
సమావేశం సందర్భంగా వేరు వేరు సూచనలు ఇచ్చినందుకుగాను గవర్నర్లకు ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
భారతదేశంలో ఆలోచనలకు, వనరులకు మరియు సామర్ధ్యాలకు లోటు లేదని, అయితే ప్రభుత్వ లోపం కారణంగా కొన్ని రాష్ట్రాలు మరియు ప్రాంతాలు వెనుకబడ్డాయని ప్రధాన మంత్రి అన్నారు. పేదల మేలు కోసం ప్రవేశపెట్టబడిన వివిధ ప్రభుత్వ పథకాలు సుపరిపాలన కొనసాగుతున్న ప్రాంతాలలో మెరుగైన రీతిలో అమలవుతున్నట్లు ఆయన చెప్పారు. ‘మిషన్ ఇంద్రధనుష్’ వంటి పథకాలను ఉదాహరిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు మరింత సమర్ధంగా అమలు అయ్యేటట్లు గవర్నర్లు చూడగలుగుతారని ఆయన పేర్కొన్నారు.
భారతదేశ సమైక్యతను, సమగ్రతను పటిష్టపరచడం కోసం ‘ఏక్ భారత్, శేష్ఠ భారత్’, ఇంకా ‘రన్ ఫర్ యూనిటీ’ ల వంటి కార్యక్రమాలలో పాలుపంచుకోవలసింలదిగా గవర్నర్లకు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.