ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధరిత్రి దినం సందర్భంగా ఈ కింది సందేశాన్ని ఇచ్చారు:
‘‘ధరిత్రి దినం అనేది భూమాత కు కృతజ్ఞత తెలియజేసే రోజు. మన భూగ్రహాన్ని పరిశుభ్రంగాను, పచ్చదనంతోను నిండి ఉండేటట్లుగా చూసుకొంటామనే మన దృఢ సంకల్పాన్ని పునరుద్ఘాటించే రోజు కూడా.
ఈ ధరణిని మనం వృక్షజాలంతో, జంతుజాలంతో, పక్షుల సంతతితో కలిసి పంచుకొంటున్నాం కదా; మరి వీటన్నింటితోను సామరస్యపూర్వకంగా జీవించడమే మన కర్తవ్యం కావాలి. మన భావి తరాల వారి కోసం మనం ఈ పనిని చేయగలగాలి.
ఈ సంవత్సరపు ఇతివృత్తమైన ‘‘పర్యావరణపరమైన మరియు శీతోష్ణస్థితి సంబంధమైన సాక్షరత’’ ప్రకృతిని, ప్రాకృతిక వనరులను పరిరక్షించడానికి తగిన జాగృతిని ఏర్పరచడంలో తోడ్పడుతుందనే నేను ఆశిస్తున్నాను.’’
#EarthDay is a day of gratitude to Mother Earth & a day to reiterate our firm resolve to keep our planet clean & green.
— Narendra Modi (@narendramodi) April 22, 2017
It is our duty to live in harmony with the plants, animals & birds we share the Earth with. We owe this to our future generations. #EarthDay
— Narendra Modi (@narendramodi) April 22, 2017
I hope this year’s theme of 'Environmental & Climate Literacy’ helps create awareness on protecting nature & natural resources. #EarthDay
— Narendra Modi (@narendramodi) April 22, 2017