Quoteభారత్‌లో గడచిన 10 ఏళ్లలో 3 మిలియన్‌ హెక్టార్ల అదనపు అటవీకరణ; దేశ వైశాల్యంలో దాదాపు నాలుగోవంతు వరకూ పెరిగిన అడవుల విస్తీర్ణం: ప్రధానమంత్రి;
Quoteభూసార క్షీణత తటస్థీకరణపై జాతీయ లక్ష్యానికి చేరువగా భారత్‌: ప్రధానమంత్రి;
Quote2030 నాటికి భూసారం క్షీణించిన 26 మిలియన్‌ హెక్టార్ల భూమి పునరుద్ధరణ.. తద్వారా 2.5-3 బిలియన్‌ టన్నుల బొగ్గుపులుసు వాయువుకు సమానమైన ఉద్గారాల శోషణ లక్ష్యం సాధనకు కృషి;
Quoteభూసార క్షీణత సమస్యల పరిష్కారంలో శాస్త్రీయ విధానాలను ప్రోత్సహించేందుకు భారతదేశంలో నైపుణ్య కేంద్రం ఏర్పాటు;
Quoteభవిష్యత్తరాలకు ఆరోగ్యకర భూగోళాన్ని అందించడం మనందరి పవిత్ర కర్తవ్యం: ప్రధానమంత్రి

గౌరవనీయులైన జనరల్ అసెంబ్లీ అధ్యక్షులవారికీ,   

గౌరవనీయులైన సోదర సోదరీమణులకూ, 

నమస్కారం. 

ఈ ఉన్నత స్థాయి సదస్సు ను ఏర్పాటు చేసిన జనరల్స అసెంబ్లీ అధ్యక్షుల వారికి నా కృతజ్ఞతలు.

అన్ని జీవులకు, జీవనోపాధికి తోడ్పడటానికి భూమి ప్రాథమిక నిర్మాణ సాధనంగా ఉంది.   పర్యావరణ సమాజంలో జీవుల వారసత్వం అంతర్-అనుసంధాన వ్యవస్థగా పనిచేస్తుందని మనమందరం అర్థం చేసుకున్నాము. విచారకరమైన విషయం ఏమిటంటే, భూమి క్షీణత నేడు ప్రపంచంలో మూడింట రెండు వంతుల మందిని ప్రభావితం చేస్తోంది.  దీన్ని అదుపు చేయకుండా వదిలేస్తే, అది మన సమాజం, ఆర్థిక వ్యవస్థ, ఆహార భద్రత, ఆరోగ్యం, రక్షణతో పాటు, జీవన ప్రమాణాల పునాదులను సైతం నాశనం చేస్తుంది.  అందువల్ల, భూమి మరియు దాని వనరులపై విపరీతమైన ఒత్తిడి ని తగ్గించాలి. స్పష్టంగా చెప్పాలంటే, మన ముందు చాలా పని ఉంది. అయినా మనం చేయవచ్చు. మనమంతా కలిసి ఈ పని చేయవచ్చు.

గౌరవనీయులైన అధ్యక్షా, 

భారతదేశంలో, మేము ఎల్లప్పుడూ భూమికి ప్రాముఖ్యత ఇచ్చాము. పవిత్ర భూమిని, మా మాతృమూర్తిగా భావించాము.  భూసార క్షీణత సమస్యలను, అంతర్జాతీయ వేదికలపై ఎత్తి చూపడానికి భారతదేశం ముందడుగు వేసింది.  భూమిపై మెరుగైన ప్రవేశం మరియు సారథిగా ఉండాలని 2019 సంవత్సరంలో ఢిల్లీ డిక్లరేషన్ పిలుపునిచ్చింది. లింగ-సున్నితమైన పరివర్తన ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చింది.  భారతదేశంలో, గత 10 సంవత్సరాల్లో, సుమారు 3 మిలియన్ హెక్టార్ల అటవీ విస్తీర్ణం జోడించబడింది.  దీని వల్ల మొత్తం అటవీ విస్తీర్ణం, దేశ మొత్తం విస్తీర్ణంలో నాలుగవ వంతు కు పెరిగింది. 

భూమి క్షీణతను తటస్థ స్థాయిలో ఉంచాలన్న మా జాతీయ నిబద్ధతను సాధించడానికి మేము కృషి చేస్తున్నాము.   26 మిలియన్ హెక్టార్ల మేర క్షీణించిన భూమిని, 2030 నాటికి పునరుద్ధరించడానికి కూడా మేము కృషి చేస్తున్నాము. ఇది 2.5 నుండి 3 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ సమానమైన కార్బన్  డయాక్సైడ్ ను వాతావరణం నుండి గ్రహించే అదనపు సామర్ధ్యాన్ని సాధించాలన్న భారతదేశ నిబద్ధతకు దోహదం చేస్తుంది.

భూమిని పునరుద్ధరించడం ద్వారా, భూసారం వృద్ధితో పాటు, భూమి ఉత్పాదకత, ఆహార భద్రత, మెరుగైన జీవనోపాధి వంటి  మంచి పనులు ఒకదాని వెంట ఒకటిగా సాకారమౌతాయని మేము నమ్ముతున్నాము.  భారతదేశం లోని చాలా ప్రాంతాల్లో, మేము కొన్ని నూతన విధానాలను అవలంబించాము.  కేవలం ఒక ఉదాహరణ చెప్పాలంటే, గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్‌ లోని బన్నీ ప్రాంతంలో భూమి బాగా క్షీణించింది. అక్కడ వర్షపాతం కూడా చాలా తక్కువ.  ఆ ప్రాంతంలో, గడ్డి భూములను అభివృద్ధి చేయడం ద్వారా భూమి పునరుద్ధరణ జరిగింది, ఇది భూమి క్షీణతను తటస్థంగా ఉంచడానికి సహాయపడింది.  ఇది పశుసంవర్ధకతను ప్రోత్సహించడం ద్వారా పశుగ్రాస కార్యకలాపాలకు మరియు జీవనోపాధికి మద్దతు ఇస్తుంది.  అదే స్ఫూర్తితో, దేశీయ పద్ధతులను ప్రోత్సహించేటప్పుడు భూమి పునరుద్ధరణకు సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించాలి.

గౌరవనీయులైన అధ్యక్షా, 

భూమి క్షీణత అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రత్యేక సవాలుగా నిలిచింది.  దక్షిణ-దక్షిణ సహకార స్ఫూర్తితో, భూ పునరుద్ధరణ వ్యూహాలను అభివృద్ధి చేయడానికి తోటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారతదేశం సహాయం చేస్తోంది.  భూమి క్షీణత సమస్యల పై శాస్త్రీయ విధానాన్ని ప్రోత్సహించడానికి భారతదేశంలో ఒక "సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను ఏర్పాటు చేయనున్నారు. 

గౌరవనీయులైన అధ్యక్షా, 

మానవ కార్యకలాపాల వల్ల భూమికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం మానవజాతి సమిష్టి బాధ్యత.  మన భవిష్యత్ తరాల కోసం, ఈ గ్రహాన్ని, ఆరోగ్యకరంగా ఉంచడం  మన పవిత్రమైన కర్తవ్యం.  వారి కోసం, అలాగే మన కోసం కూడా, ఈ ఉన్నత-స్థాయి సదస్సు లో ఉత్పాదక చర్చల కోసం నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మీకు ధ్యన్యవాదములు. 

మీకు అనేక ధన్యవాదములు.

  • krishangopal sharma Bjp January 14, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • krishangopal sharma Bjp January 14, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 14, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • MLA Devyani Pharande February 17, 2024

    जय श्रीराम
  • G.shankar Srivastav June 17, 2022

    जय श्री राम
  • शिवकुमार गुप्ता February 10, 2022

    जय भारत
  • शिवकुमार गुप्ता February 10, 2022

    जय हिंद
  • शिवकुमार गुप्ता February 10, 2022

    जय श्री सीताराम
  • शिवकुमार गुप्ता February 10, 2022

    जय श्री राम
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
'They will not be spared': PM Modi vows action against those behind Pahalgam terror attack

Media Coverage

'They will not be spared': PM Modi vows action against those behind Pahalgam terror attack
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 23 ఏప్రిల్ 2025
April 23, 2025

Empowering Bharat: PM Modi's Policies Drive Inclusion and Prosperity