ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐసిటి ఆధారితమైన మల్టి- మోడల్ ప్లాట్ ఫార్మ్ ఫర్ ప్రొ- యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’) మాధ్యమం ద్వారా జరిగినటువంటి పదమూడో ముఖాముఖి సమావేశానికి ఈ రోజు న అధ్యక్షత వహించారు.
కేంద్ర ప్రభుత్వం యొక్క నూతన పదవీకాలం లో జరిగిన ఒకటో ‘ప్రగతి’ సమావేశం కూడా ఇదే.
మునుపటి పదవీకాలం లో 29 సార్లు ‘ప్రగతి’ సమావేశాలు జరుగ గా, మొత్తం 12 లక్షల కోట్ల రూపాయల కు పైగా పెట్టుబడి తో కూడిన 257 పథకాల ను కలుపుకొని సమీక్ష ను నిర్వహించడమైంది. 47 కార్యక్రమాలు/పథకాల ను సమీక్షించారు. 17 రంగాల లో 21 విషయాల ను కూడా సమీక్షకు చేపట్టి తద్వారా ప్రజా సమస్యల ను పరిష్కరించడం జరిగింది.
పిఎం ఆవాస్ యోజన (అర్బన్)కు సంబంధించిన సమస్య ల పరిష్కారం లో పురోగతి ని ప్రధాన మంత్రి ఈ రోజు న సమీక్షించారు. 2022వ సంవత్సరం కల్లా ఏ కుటుంబం ఇల్లు లేకుండా ఉండిపోకూడదన్నది కేంద్ర ప్రభుత్వ సంకల్పమని ఆయన నొక్కి పలికారు. మరి ఈ లక్ష్య సాధన దిశ గా శ్రద్ధాళువులై కృషి చేయాలని, ఎదురయ్యే ఆటంకాలన్నింటి నీ తొలగించాలని అధికారుల కు ప్రధాన మంత్రి ఉద్బోధించారు. ఆర్థిక సేవల విభాగాని కి సంబంధించిన ప్రజల ఫిర్యాదుల పరిష్కారాన్ని కూడా ప్రధాన మంత్రి ఇదే విధం గా సమీక్షించారు.
ఆయుష్మాన్ భారత్ ఏ విధం గా అమలవుతోందీ ప్రధాన మంత్రి కూలంకషం గా సమీక్షించారు. ఇంతవరకు ఈ పథకం లో 16 వేలకు పైగా ఆసుపత్రులు చేరాయని, దాదాపుగా 35 లక్షల మంది లబ్దిదారులు వైద్యశాల ప్రవేశాల ను పొందారని అధికారులు ఆయన దృష్టి కి తీసుకు వచ్చారు. ఉత్తమమైన ప్రయోగ పద్ధతుల ను రూపొందించడం లో, అలాగే, ఈ పథకం లో మరిన్ని మెరుగుల ను సూచించడం లో సహాయాన్ని అందించగలిగే విధం గా రాష్ట్రాల తో చర్చించాలని ప్రధాన మంత్రి సూచించారు. ప్రత్యేకించి ఆకాంక్షాభరిత జిల్లాల లో ఈ పథకం యొక్క సకారాత్మక ప్రభావం పైన, ప్రయోజనాల పైన ఒక అధ్యయనాన్ని నిర్వహించాలని ఆయన చెప్పారు. ఈ పథకం లో దుర్వినియోగాన్ని మరియు అక్కడక్కడా ఏవైనా మోసాలు చోటు చేసుకొంటే వాటిని నిరోధించడాని కి ఏయే చర్యలను తీసుకుంటున్నారో ఆయన అడిగి తెలుసుకొన్నారు.
సుగమ్య భారత్ అభియాన్ లో పురోగతి ని ప్రధాన మంత్రి సమీక్షిస్తూ, బహిరంగ ప్రదేశాల లో దివ్యాంగులు సదుపాయాల అందుబాటు పరంగా ఎదుర్కొంటున్న సమస్యల ను గురించి వారి వద్ద నుండి అభిప్రాయాల ను సేకరించేందుకు ఒక యంత్రాంగాన్ని రూపొందించడం లో సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. దివ్యాంగుల కు అందుబాటు ను ప్రోత్సహించడం కోసం పరిష్కారాల ను అన్వేషించడం లో ప్రజల భాగస్వామ్యం మరియు సంవేదన శీలత ఇప్పటికన్నా మరింత పెరగాలని ఆయన అన్నారు.
జల శక్తి యొక్క ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, జల సంరక్షణ దిశ గా, ప్రత్యేకించి వర్తమాన వర్ష రుతువు లో గరిష్ఠ కృషి చేయవలసింది గా రాష్ట్రాల కు పిలుపునిచ్చారు.
రైల్వే మరియు రహదారి రంగాల లో ఎనిమిది ముఖ్యమైన మౌలిక సదుపాయాల పథకాల లో పురోగతి ని ప్రధాన మంత్రి సమీక్షించారు. ఈ పథకాలు బిహార్, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్ మరియు గుజరాత్ లతో పాటు, అనేక రాష్ట్రాల లో అమలవుతున్నాయి.
.