ఇరవై ఒకటో వరల్డ్ సస్ టేనబుల్ డెవలప్ మెంట్ సమిట్ లో మీతో కలసి పాల్గొంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మొదట గుజరాత్ లో మరియు ప్రస్తుతం జాతీయ స్థాయి లో, నేను 20 సంవత్సరాల పదవీ కాలం లో ఉండగా, పర్యావరణం మరియు నిరంతర అభివృద్ధి అనేవి నా దృష్టి లో కీలకమైన శ్రద్ధ అవసర పడిన రంగాలు గా ఉంటూ వచ్చాయి.
మిత్రులారా, ఈ భూ గ్రహం బలహీనమైంది అని ప్రజలు అనుకొంటున్నట్టు మనం విన్నాం. అయితే, ఈ ధరణి బలహీనమైనది ఏమీ కాదు. అంతకంటే మనమే బలహీనమైనటువంటి వారం. ఈ ధరిత్రి పట్ల మరియు ప్రకృతి పట్ల మన నిబద్ధతలు కూడా బలహీనమైనవి గా ఉన్నాయి. 1972వ సంవత్సరం లో స్టాక్ హోమ్ సమావేశం జరిగినప్పటి నుంచే గడచిన 50 కి పైగా సంవత్సరాల లో ఎన్నో విషయాల ను మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఈ దిశ లో చాలా తక్కువ పనులే చేయడమైంది. అయితే భారతదేశం లో, మేము ఏదయితే చెప్పామో దానిని చేసి చూపించాం.
పేద ప్రజల కు అందరికీ శక్తి లభ్యత సమానం గా ఉండేటట్లు చూడటం అనేది మా పర్యావరణ విధానాని కి ఒక మూల స్తంభం గా ఉంది. ఉజ్జ్వల యోజన ద్వారా 90 మిలియన్ కు పైగా కుటుంబాల కు వంటగది కోసం స్వచ్ఛమైన ఇంధనాన్ని అందుబాటులో కి తీసుకు రావడం జరిగింది. ‘పిఎమ్-కుసుమ్’ పథకం లో భాగం గా మేము నవీకరణ యోగ్య శక్తి ని రైతుల వద్ద కు తీసుకు పోయాం. సౌర ఫలకాల ను ఏర్పాటు చేసుకోవలసింది గా, వాటిని ఉపయోగించవలసింది గా, మరి మిగులు విద్యుత్తు ను గ్రిడ్ కు విక్రయించవలసింది గా రైతుల ను మేము ప్రోత్సహిస్తున్నాం. స్టాండ్అలోన్ సోలర్ పంపుల తోపాటు గా ప్రస్తుతం ఉన్నటువంటి పంపుల ను సోలరైజ్ చేసే ప్రయాస లను పెంచడం జరుగుతోంది. ‘రసాయనాల కు తావు ఉండనటువంటి ప్రాకృతిక సేద్యం’ పై శ్రద్ధ వహించడం ద్వారా కూడాను స్థిరత్వాన్ని, సమానత్వాన్ని ప్రోత్సహించడం లో తోడ్పాటు లభిస్తుంది.
మిత్రులారా, మా ఎల్ఇడి బల్బు ల వితరణ పథకం ఏడు సంవత్సరాల కు పైగా అమలవుతున్నది. దీని ద్వారా ప్రతి సంవత్సరం 220 బిలియన్ యూనిట్ లకు పైగా విద్యుచ్ఛక్తి ని ఆదా చేయడం లో మరియు 180 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల ను తగ్గించడం లో తోడ్పాటు అందింది. మేము నేశనల్ హైడ్రోజన్ మిశన్ ను ఏర్పాటు చేయగలమని ప్రకటించాము. మన భవిష్యత్తు కు శక్తి ని ఇచ్చేటటువంటి ఒక ఉత్తేజదాయకమైన సాంకేతిక విజ్ఞానం అయిన గ్రీన్ హైడ్రోజన్ ను వినియోగించుకోవడం ఈ మిశన్ యొక్క లక్ష్యం గా ఉంది. గ్రీన్ హైడ్రోజన్ తాలూకు సామర్థ్యాల ను ప్రాప్తింపచేసుకోవడం కోసం ఆచరణసాధ్యమైనటువంటి ఉపాయాల తో ముందుకు రావలసింది గా టిఇఆర్ఐ వంటి విద్య సంబంధి మరియు పరిశోధన ప్రధానమైన సంస్థల ను నేను ప్రోత్సహిస్తాను.
మిత్రులారా, భారతదేశం భారీ వైవిధ్యం నిండినటువంటి దేశం. ప్రపంచం లోని 2.4 శాతం భూ విస్తీర్ణాన్ని కలిగిన భారతదేశం ప్రపంచ ప్రాణికోటి లో సుమారు గా 8 శాతం ప్రాణి కోటి కి ఆవాసం గా ఉంది. ఈ జీవావరణ ను రక్షించడం మా కర్తవ్యం గా ఉంది. మేము మా రక్షిత ప్రాంతాల నెట్ వర్క్ ను పటిష్ట పరుస్తున్నాం. మా ప్రయాసల ను ఐ.యు.సి.ఎన్ గుర్తించింది. హరియాణా లోని ఆరావళి బయోడైవర్సిటీ పార్కు ను, అది చక్క గా సంరక్షిస్తున్నటువంటి జీవ వైవిధ్యాని కి గాను, ఒక ఒ.ఇ.సి.ఎమ్ ప్రదేశం గా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా, భారతదేశం లో మరో రెండు చిత్తడి భూములు కూడా ఇటీవలే రామ్ సర్ ప్రదేశాలు అనే గుర్తింపునకు నోచుకోవడం నాకు సంతోషాన్ని కలగజేసింది. భారతదేశం లో ప్రస్తుత్తం ఒక మిలియన్ హెక్టేర్ లకు పైగా విస్తరించినటువంటి 49 రామ్ సర్ ప్రదేశాలు ఉన్నాయి. పంటలు పండని భూమి ని తిరిగి సారవంతం గా మార్చడం అనేది మా ప్రధాన శ్రద్ధయుక్త రంగాల లో ఒక రంగం గా ఉంది. 2015వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మేము 11.5 మిలియన్ హెక్టేర్ లకు పైగా భూముల ను తిరిగి పంటలకు యోగ్యమైనవి గా తీర్చిదిద్దాం. ‘బాన్ చాలెంజ్’ లో భాగం గా ల్యాండ్ డీగ్రేడేశన్ న్యూట్రాలిటీ తాలూకు జాతీయ వచన బద్ధత ను నెరవేర్చే దిశ లో మేము ముందుకు సాగిపోతున్నాం. యు.ఎన్.ఎఫ్.సి.సి.సి లో భాగం గా మేము చేసినటువంటి వాగ్దానాల ను అన్నిటి ని నెరవేర్చాలి అనే అంశం లో మాకు దృఢ నమ్మకం ఉంది. మేము గ్లాస్ గో లో జరిగిన సిఒపి -26 లో మా యొక్క మహత్త్వాకాంక్షల ను ప్రపంచం ముంగిట ఆవిష్కరించాం.
మిత్రులారా, జలవాయు సంబంధి న్యాయం ద్వారానే పర్యావరణ పరమైన స్థిరత్వాన్ని దక్కించుకోవచ్చు అనే మాటల తో మీరు ఏకీభవిస్తారు అని నా దృఢమైన విశ్వాసం మరి దీని ని నేను నమ్ముతున్నాను కూడాను. భారతదేశం లో ప్రజల శక్తి సంబంధి అవసరాలు రాబోయే ఇరవై సంవత్సరాల లో దాదాపు గా రెట్టింపు అయిపోయే అవకాశం ఉంది. ఈ శక్తి ని ఇవ్వకపోవడం అంటే అది లక్షల కొద్దీ ప్రజల ను వారి జీవన హక్కు ను హరించడం వంటిదే అవుతుంది. జలవాయు కార్యాలకు సంబంధించినంత వరకు సఫలమైన కార్యాచరణల కు తగినంత ఆర్థిక సహాయం కూడా అవసర పడుతుంది. దీనికి గాను ఆర్థిక సహాయం మరియు సాంకేతిక విజ్ఞానం బదిలీ అంశాలపై అభివృద్ధి చెందిన దేశాలు అవి ఇచ్చిన వాగ్దానాల ను నెరవేర్చవలసిన అవసరం ఎంతయినా ఉంది.
మిత్రులారా, ఇక్కడ స్థిరత్వం అంటే అందుకోసం గ్లోబల్ కామన్స్ కోసం సమన్వయ భరిత కార్యాచరణ ను చేపట్టవలసిన అవసరం ఉంది అన్న మాట. మన ప్రయాస లు ఈ పరస్పర ఆశ్రితవాదాని కి గుర్తింపు ను ఇచ్చాయి. ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ మాధ్యమం ద్వారా మన లక్ష్యం గా పెట్టుకొన్నది ఏమిటి అంటే అది ‘వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్’ అనేదే. మనం ఎల్ల వేళ ల ప్రతి ఒక్క ప్రాంతాని కి స్వచ్ఛ శక్తి యొక్క లభ్యత కు పూచీ పడే దిశ లో పాటుపడవలసి ఉంది. ఇదే భారతదేశం యొక్క విలువ ల ప్రకారం ‘‘సంపూర్ణ ప్రపంచం’’ తాలూకు దృష్టి కోణం గా ఉన్నది.
మిత్రులారా, కొయలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (సి.డి.ఆర్.ఐ) ధ్యేయం ఏమిటి అంటే అది తరచు గా ప్రాకృతిక వైపరీత్యాల అపాయాన్ని ఎదుర్కొనే ప్రాంతాల లో బలమైన మౌలిక సదుపాయాల ను నిర్మించడం అనేదే. సిఒపి-26 నేపథ్యం లో, మనం ‘‘ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫార్ రిజిలియంట్ ఐలండ్ స్టేట్స్’’ పేరు తో ఒక కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం. ఐలండ్ డెవలపింగ్ స్టేట్స్ అత్యంత దుర్బలమైనవి మరి ఈ కారణం గా వాటిని అత్యవసర పరిరక్షించవలసిన అవసరం ఉంది.
మిత్రులారా, ఈ రెండు కార్యక్రమా లకు తోడు ఇప్పుడు మనం ‘ఎల్ఐఎఫ్ఇ’ (లైఫ్) ని జోడించాం. ఎల్ఐఎఫ్ఇ - అంటే లైఫ్ స్టైల్ ఫార్ ఇన్ వైరన్ మెంట్ కు సంక్షిప్త రూపం అన్నమాట. లైఫ్ అనే మాట కు మన ధరిత్రి ని మెరుగు పరచాలన్న ఉద్దేశ్యం తో జీవనశైలి సంబంధి ఎంపికల ను అందుబాటులోకి తీసుకురావడం అనే అర్థం వస్తుంది. ఎల్ఐఎఫ్ఇ అంటే అది ప్రపంచ వ్యాప్తం గా సమాన ఆలోచనల ను కలిగివుండే వారి కూటమి; ఇది స్థిరత్వం కలిగిన జీవన శైలి ని ప్రోత్సహిస్తుంది. వారిని నేను 3-పిస్ అని అంటాను. ఇక్కడ 3-పి స్ అంటే ప్రో ప్లానెట్ పీపల్ అని. ఈ 3-పిస్ ప్రో ప్లానెట్ పీపల్ తాలూకు ప్రపంచ స్థాయి ఉద్యమం ఎల్ఐఎఫ్ఇ కై ఒక కూటమి అని చెప్పాలి. ఈ మూడు గ్లోబల్ కొయలిశన్ లు గ్లోబల్ కామన్స్ ను మెరుగు పరచడం కోసం పర్యావరణం పరం గా మనం చేపట్టే ప్రయత్నాల కు ఒక పునాది ని రూపొందిస్తాయి.
మిత్రులారా, మా సంప్రదాయాలు మరియు మా సంస్కృతి.. ఇవే నా ప్రేరణ కు మూలాలు గా ఉన్నాయి. ప్రజలు మరియు ఈ భూమి యొక్క స్వస్థత ఏ విధం గా అయితే ఒకదాని తో మరి ఒకటి ముడిపడి ఉన్నాయో అనే విషయాన్ని గురించి నేను 2021వ సంవత్సరం లో వివరించాను. భారతీయులు సదా ప్రకృతి తో సద్భావన ను ఏర్పరచుకొని నడుచుకొంటున్నారు. మా సంస్కృతి, ఆచారాలు, రోజువారీ పాటించే పద్ధతులు, అసంఖ్యాకమైనటువంటి పంటకోత ఉత్సవాలు ప్రకృతి తో మాకు గల బలమైన బంధాన్ని పట్టి చూపుతున్నాయి. రిడ్యూస్, రియూస్, రిసైకిల్, రికవర్, రి-డిజైన్, ఇంకా రి మేన్యుఫాక్చరింగ్ భారతదేశం యొక్క సాంస్కృతిక లోకాచారాల లో భాగం గా ఉంటూ వచ్చాయి. భారతదేశం జలవాయు అనుకూల విధానాల కోసం మరియు జలవాయు అనుకూల పద్ధతుల కోసం నడుం బిగిస్తూనే ఉంటుంది. మేం ఇదివరకు కూడా ను ఇదే పని ని చేస్తూ వచ్చాం.
ఈ మాటల తో, మరి ఈ పవిత్ర సంకల్పం తో టిఇఆర్ఐ కి, ఇంకా ఈ శిఖర సమ్మేళనం లో పాలుపంచుకొంటున్న ప్రపంచ వ్యాప్త భాగస్వాములు అందరి కి నేను నా శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను.
మీకు ధన్యవాదాలు,
మీకు చాలా చాలా ధన్యవాదాలు.