శంఘయి కోఆపరేశన్ ఆర్గనైజేశన్ (ఎస్‌సిఒ) దేశాధినేతల మండలి సమావేశాని కి హాజరు కావడం కోసం 2019వ సంవత్సరం జూన్ 13-14 తేదీల లో నేను కిర్గిజ్ రిపబ్లిక్ లోని బిశ్కెక్ ను సందర్శించనున్నాను.
ఈ ప్రాంతం లో బహుముఖీనమైన, రాజకీయపరమైన, భద్రత పరమైన, ఆర్థిక పరమైన మరియు ప్రజల మధ్య అన్యోన్యమైన సంబంధాల ను ప్రోత్సహించడం లో మేము ఎస్‌సిఒ కు ప్రత్యేక ప్రాముఖ్యాన్ని కట్టబెడుతున్నాము.
రెండు సంవత్సరాల క్రితం ఎస్‌సిఒ లో భారతదేశాని కి పూర్తి స్థాయి సభ్యత్వం దక్కినప్పటి నుండి ఎస్‌సిఒ కు చెందిన వేరు వేరు చర్చా వేదికల లో భారత్ చురుకు గా పాలుపంచుకొంటూ వచ్చింది. గడచిన ఒక సంవత్సర కాలం గా కిర్గిజ్ రిపబ్లిక్ యొక్క అధ్యక్ష పదవీ బాధ్యతల నిర్వహణ లో మనం పూర్తి సహకారాన్ని అందించాము.
ప్రపంచం లో భద్రత స్థితిగతులు, బహుళ పార్శ్విక ఆర్థిక సహకారం, ఆయా దేశాల ప్రజల మధ్య రాక పోక లు మరియు ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగినటువంటి, అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగినటువంటి సమయోచిత అంశాలు ఈ శిఖర సమ్మేళనం లో చర్చకు వస్తాయని ఆశించడమైంది.
కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఆహ్వానించిన మీదట, ఎస్‌సిఒ శిఖర సమ్మేళనం ముగిసిన అనంతరం, 2019వ సంవత్సరం జూన్ 14వ తేదీ నాడు నేను కిర్గిజ్ రిపబ్లిక్ లో ఆధికారిక ద్వైపాక్షిక పర్యటన ను చేపట్టనున్నాను.
భారతదేశం, ఇంకా కిర్గిజ్ రిపబ్లిక్ లు చరిత్రాత్మకమైనటువంటి మరియు నాగరికత పరమైనటువంటి లంకెల ను కలిగి ఉండటం తో పాటు సాంప్రదాయికం గా ఆత్మీయమైన మరియు స్నేహపూర్వకమైన సంబంధాల ను నెరపుతున్నాయి. ఇటీవలి కాలం లో మన సంబంధాలు క్షణ, భద్రత, వ్యాపారం మరియు పెట్టుబడి లు సహా ద్వైపాక్షిక సమ్మతి తో ముడిపడిన అనేక రంగాల కు విస్తరించాయి.
ద్వైపాక్షిక సహకారాని కి సంబంధించిన అంశాల యావత్తు శ్రేణి కి సంబంధించిన మన చర్చ లకు తోడు అధ్యక్షులు శ్రీ జీన్‌బెకోవ్, నేను ‘ఇండియా-కిర్గిజ్ బిజినెస్ ఫోరమ్’ ప్రథమ సమావేశం లో ప్రసంగించనున్నాము.
కిర్గిజ్ రిపబ్లిక్ ను నేను సందర్శించనుండటం కిర్గిజ్ రిపబ్లిక్ తో పాటు ఎస్‌సిఒ సభ్యత్వ దేశాల తో మన సహకారాన్ని మరింత గా బలోపేతం చేసి, ఏకీకృతం చేయగలుగుతుందన్న నమ్మకం నాలో ఉంది.