ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ థాయిలాండ్ పర్యటన కు బయలుదేరి వెళ్లడానికి ముందు ఈ దిగువ ప్రకటన చేశారు.
నేను నవంబర్ 3వ తేదీన జరగనున్న ఆసియాన్-భారత శిఖరాగ్ర సమావేశంలోను, 4వ తేదీన జరగనున్న 14వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో,మూడవ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య కూటమి (ఆర్ సెప్) సమావేశం లోను పాల్గొనడాని కి రేపు బయలుదేరి 16వ బ్యాంకాక్ వెళ్తున్నాను.
ఈ పర్యటన లో భాగం గా నేను బ్యాంకాక్ వస్తున్న ఇతర ప్రపంచ నాయకుల తో ద్వైపాక్షిక సమావేశాల్లో కూడా పాల్గొంటాను.
ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు మన దౌత్య క్యాలెండర్ లో కీలకమైనవి. మన యాక్ట్ ఈస్ట్ పాలసీ కి ప్రధానం.
ఆసియాన్ దేశాల తో మన బంధం అనుసంధానత, సామర్థ్యాల పెంపు, వాణిజ్యం, సంస్కృతి అనే నాలుగు స్తంభాలపై నిర్మాణం అయింది. న్యూ ఢిల్లీ లో 2018 జనవరి లో జరిగిన ప్రత్యేక సమావేశం లో ఆసియాన్ తో భారత భాగస్వామ్య చర్చల 25వ వార్షికోత్సవం నిర్వహించుకున్నాం. ఆ సదస్సు కు వచ్చిన ఆసియాన్ నాయకులందరూ మన గణతంత్ర దినోత్సవం లో ముఖ్య అతిథులు గా పాల్గొన్నారు.
ఆసియాన్ సహకారం తో భాగస్వాములందరూ నిర్వహిస్తున్న వివిధ కార్యకలాపాల ను ఆ నాయకులందరి తోనూ సమీక్షించడం తో పాటు ఆసియాన్, ఆసియాన్ సారథ్యం లోని వ్యవస్థ లు బలోపేతం చేసేందుకు, అనుసంధానత పెంపునకు (సాగర, భూ, వాయు, డిజిటల్, ప్రజా), ఆర్థిక భాగస్వామ్యాలు మరింత లోతు గా పాదుకునేలా చేయడాని కి, సాగర సహకారాని కి ప్రణాళికలు పరిశీలిస్తాను.
తూర్పు ఆసియా శిఖరాగ్రం నేటి ప్రాంతీయ సహకార నిర్మాణం లో ఎంతో కీలకం. ఈ నాయకత్వ ప్రధాన వ్యవస్థ ఆసియాన్ కేంద్రం గా ఉంటుంది. ఈ ప్రాంతం లోని అన్ని దేశాల నాయకులు లేదా కీలకమైన ప్రయోజనాలు ఇందులో భాగం గా ఉంటాయి. ఇఎఎస్ అజెండా లో భాగం గా అమిత ప్రాధాన్యం గల ప్రాంతీయ, ప్రపంచ స్థాయి అంశాల పై కూడా చర్చించడం తో పాటు వివిధ ప్రాజెక్టులు, కార్యక్రమాల తీరుతెన్నుల ను కూడా సమీక్షిస్తాం. అలాగే మన ఇండో పసిఫిక్ వ్యూహం గురించి కూడా వారి తో నేను చర్చిస్తాను. ఆసియాన్, ఇఎఎస్ లోని ఇతర దేశాల తో మనకు బలమైన అనుసంధానత ఉంది.
ఆర్ సిఇపి శిఖరాగ్రం లో అందుకు సంబంధించిన చర్చల దిశ గా జరుగుతున్న పురోగతి గురించి మేం సమీక్షించి పరిగణనలోకి తీసుకుంటాం. వస్తు సేవల వాణిజ్యం, పెట్టుబడుల విషయం తో భారతదేశం ప్రయోజనాలు, ఆందోళనల ను కూడా మేం పరిగణన లోకి తీసుకుని వాటన్నింటినీ ఆ ఒప్పందం లో పూర్తిగా సద్దుబాటు చేసే అంశం పరిశీలిస్తాం.
నవంబర్ నాలుగో తేదీన సుస్థిరత అంశం పై ఏర్పడిన ఆసియాన్ విభాగం అధ్యక్ష హోదా లో థాయ్ లాండ్ ప్రధాన మంత్రి అతిథులు గా వచ్చిన నాయకులందరి కోసం నిర్వహిస్తున్న విందు కార్యక్రమం లో కూడా నేను పాల్గొంటాను.
2వ తేదీన థాయిలాండ్ లోని భారతీయ సంతతి ప్రజలు నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాని కి కూడా నేను హాజరవుతాను. ప్రవాస భారతీయులు, భారతీయ సంతతి ప్రజలు థాయిలాండ్ కు పలు రకాలుగా విశిష్టమైన సేవలందించారు. థాయిలాండ్ రాచరికం, భారత దేశం బంధాని కి వారు ఎంతో కీలక అనుసంధానం గా నిలిచారు.