పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి సందర్భంగా ఒక సవాలును స్వీకరించవలసిందిగా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఒఎన్‌జిసి) ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కోరారు. ‘సౌభాగ్య యోజన’ ప్రారంభ సూచకంగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ఒఎన్‌జిసి అధికారులను మరియు సిబ్బందిని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, విద్యుత్తు ఆధారంగా వంట చేసి పెట్టే ఒక సమర్ధమైన పొయ్యి (స్టవ్) ను రూపొందించే దిశగా కృషి చేయండని ఉద్బోధించారు.
భారతదేశం దిగుమతి చేసుకొన్న ఇంధనం పై ఆధారపడటాన్ని ఈ నూతన ఆవిష్కరణ గణనీయంగా ప్రభావితం చేయగలుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచం విద్యుత్తు కార్లను తీసుకు వచ్చే కసరత్తు చేస్తుంటే, భారతదేశంలో విద్యుత్తు కార్లకు తోడు, ఎలక్ట్రిక్ స్టవ్ లు ప్రజల అవసరాలను తీర్చడంలో ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. ఈ రంగంలో స్టార్ట్-అప్ లను ఏర్పాటు చేయవలసిందని మరియు ఈ నవకల్పనలో పాలుపంచుకోవలసిందిగా యువతను ఆహ్వానించాలని ఒఎన్‌జిసి కి ఆయన సూచనలు చేశారు.