ఆయుష్మాన్ భారత్ లో భాగమైన ఆరోగ్య హామీ కార్యక్రమాన్ని ప్రారంభించే దిశగా సాగుతున్న సన్నాహాల లో పురోగతి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమీక్షించారు.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.87065300_1533369934_684-1-pm-reviews-preparations-for-launch-of-health-assurance-programme-under-ayushman-bharat-3.jpg)
ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య హామీ రక్షణ ను ఈ పథకం అందించనుంది. దీని పరిధి లోకి 10 కోట్ల కు పైగా పేద మరియు దుర్బల కుటుంబాలను తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నారు.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.39718700_1533369964_684-2-pm-reviews-preparations-for-launch-of-health-assurance-programme-under-ayushman-bharat-4.jpg)
ఈ సందర్భంగా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, ఇంకా ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) లకు చెందిన ఉన్నతాధికారులు ఈ పథకానికి సంబంధించి రాష్ట్రాల లో సాగుతున్న సన్నాహక చర్యలతో పాటు ఈ పథకం తో ముడిపడిన సాంకేతిక అంశాల, మౌలిక అంశాల అభివృద్ధి సహా వివిధ అంశాలను ప్రధాన మంత్రి కి వివరించారు.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.64377600_1533369990_684-3-pm-reviews-preparations-for-launch-of-health-assurance-programme-under-ayushman-bharat-1.jpg)
ఆయుష్మాన్ భారత్ లో భాగంగా తొలి ‘హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్’ ను ఆకాంక్ష భరిత జిల్లా లలో ఒకటైన బీజాపుర్ జిల్లా (చండీగఢ్ లో ఉంది ఈ జిల్లా) లో- ఆంబేడ్ కర్ జయంతి సందర్భం గా ఏప్రిల్ నెల లో- ప్రధాన మంత్రి ప్రారంభించారు.