QuotePM reviews preparations for launch of Health Assurance programme under Ayushman Bharat

ఆయుష్మాన్ భార‌త్ లో భాగంగా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌ ఆరోగ్య హామీ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించే దిశ‌గా సాగుతున్న స‌న్నాహాల‌ తాలూకు పురోగ‌తి ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమ‌వారం నాడు స‌మీక్షించారు.

ఆరోగ్య హామీ కార్య‌క్ర‌మం త్వ‌రిత‌ంగా, సాఫీగా ఆరంభమయ్యేందుకు వీలుగా రాష్ట్రాల‌తో సంప్ర‌దింపులు స‌హా ఇంత‌వ‌ర‌కు జ‌రిగిన స‌న్నాహాల‌ పరంపరను ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి దృష్టికి తీసుకురావ‌డ‌మైంది.

ఈ ప‌థ‌కం ఒక్కొక్క కుటుంబానికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ర‌క్ష‌ణ‌ ను క‌ల్పిస్తుంది. 10 కోట్ల‌కు పైగా పేద, దుర్బల కుటుంబాల‌కు ర‌క్ష‌ణ‌ ను అందించడం ఈ పథకం యొక్క లక్ష్యంగా ఉంటుంది.

స‌మాజం లోని పేద‌లు మ‌రియు అణ‌గారిన వ‌ర్గాల వారికి గ‌రిష్ఠ ప్ర‌యోజ‌నాన్ని ఈ ప‌థ‌కంలో భాగంగా అంద‌జేయాల‌ని ప్ర‌ధాన మంత్రి నొక్కి చెప్పారు.

ఆరోగ్యం మ‌రియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ ఇంకా పిఎమ్ ఒ ల అగ్రగామి అధికారులు ఈ ప‌థ‌కం యొక్క వివిధ అంశాల‌ను గురించి ప్ర‌ధాన మంత్రికి తెలియజెప్పారు.

ఆయుష్మాన్ భార‌త్ లో భాగంగా ఒక‌టో హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంట‌ర్ ను ఛత్తీస్ గఢ్ లోని మ‌హ‌త్వాకాంక్ష క‌లిగిన జిల్లా అయిన‌టువంటి బీజాపుర్ లో ప్ర‌ధాన మంత్రి గత నెల‌లో ఆంబేడ్ కర్ జ‌యంతి సంద‌ర్భంగా ప్రారంభించారు.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
From Digital India to Digital Classrooms-How Bharat’s Internet Revolution is Reaching its Young Learners

Media Coverage

From Digital India to Digital Classrooms-How Bharat’s Internet Revolution is Reaching its Young Learners
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 28 మే 2025
May 28, 2025

Appreciation for PM Modi's Policies Power Jobs, Farmers, and Digital Revolution