మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న లో కీలకమైన ర‌హ‌దారులు, పిఎమ్‌జిఎస్‌వై, గ్రామీణ ప్రాంతాల‌ లో గృహ నిర్మాణం, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌ లో గృహ నిర్మాణం, రైలు మార్గాలు, విమానాశ్ర‌యాలు, ఇంకా నౌకాశ్ర‌యాల రంగాల‌ లో పురోగ‌తి ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గురువారం నాడు స‌మీక్షించారు. దాదాపు రెండు గంట‌ల పాటు సాగిన ఈ స‌మీక్ష స‌మావేశానికి మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న సంబంధిత మంత్రిత్వ శాఖ‌లకు, నీతి ఆయోగ్ కు, ఇంకా పిఎమ్ఒ కు చెందిన ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

నీతి ఆయోగ్ సిఇఒ శ్రీ అమితాబ్ కాంత్ స‌మ‌ర్పించిన ఒక నివేదిక లో భాగంగా, ర‌హ‌దారుల నిర్మాణం లో వేగం చెప్పుకోద‌గ్గ రీతి లో పుంజుకొన్న‌ట్లు గ‌మ‌నించారు. 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రం లో స‌గటు న ఒక రోజు కు 26.93 కిలో మీట‌ర్ల మేర‌కు ర‌హ‌దారుల నిర్మాణం జ‌రిగింది. 2013-14 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఈ సగటు 11.67 కి.మీ. గా ఉంది.

ర‌వాణా రంగం లో డిజిట‌లీక‌ర‌ణ తాలూకు పురోగ‌తి ని ప్ర‌ధాన మంత్రి దృష్టి కి తీసుకు రావడమైంది. ఇంత‌వ‌ర‌కు 24 ల‌క్ష‌ల‌కు పైగా ఆర్ ఫ్ఐడి ట్యాగ్ ల‌ను జారీ చేయ‌డ‌ం జరిగింది. ప్రస్తుతం మొత్తం రాబ‌డి లో 22 శాతానికి పైగా రాబడి ఎల‌క్ట్రానిక్ ప‌ద్ధ‌తి లో దారి సుంకం వ‌సూలు ద్వారా సమకూరుతోంది. ర‌హ‌దారి స్థితిగ‌తులు ఎలా ఉన్న‌ాయన్న స‌మాచారాన్ని అందించడమే కాకుండా ఫిర్యాదుల దాఖ‌లు కు కూడా తోడ్పడే ‘‘సుఖ‌ద్ యాత్ర‌’’ యాప్ (Sukhad Yatra App)ను ఇంత‌వ‌ర‌కు ఒక ల‌క్ష కు పైగా సంఖ్యలో డౌన్ లోడ్ చేసుకోవ‌డ‌ం జరిగింది. దారి సుంకాన్ని ఎల‌క్ట్రానిక్ ప‌ద్ధ‌తి లో వ‌సూలు శ‌ర వేగంగా పురోగ‌మించేట‌ట్లు చూడాల‌ంటూ ప్ర‌ధాన మంత్రి పిలుపునిచ్చారు.

ప్ర‌ధాన్ మంత్రి గ్రామ్ స‌డ‌క్ యోజ‌న లో భాగంగా ప్రస్తుతం గ్రామీణ ప్రాంత ర‌హ‌దారుల అర్హ‌త క‌లిగిన అన్ని జ‌నావాసాల‌ లో 88 శాతం జనావాసాల‌ ను కలుపుతున్నాయి. 2014 క‌న్నా వెనుకటి నాలుగు సంవ‌త్స‌రాల కాలంలో 35,000 ప‌ల్లెల‌ ల‌ను సంధానించ‌డం జ‌రుగ‌గా, 2014 నుంచి 2018 మ‌ధ్య కాలం లో 44,000 ల‌కు పైగా గ్రామాల‌ను సంధానించ‌డమైంది. ‘‘మేరీ స‌డ‌క్’’ యాప్ (“MeriSadak” App) ను 10 ప్రాంతీయ భాష‌ల‌లో ప్రారంభించ‌గా, దీనిని ఇంత‌వ‌ర‌కు 9.76 ల‌క్ష‌ల సంఖ్య లో డౌన్ లోడ్ చేసుకోవ‌డ‌ం జరిగింది. ర‌హ‌దారుల‌కు జిఐఎస్ మ్యాపింగ్ ప‌ని కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 20 రాష్ట్రాలు జియో స్పేశల్ రూర‌ల్ రోడ్ ఇన్‌ఫ‌ర్మేశ‌న్ సిస్ట‌మ్ (జిఆర్ఆర్ఐఎస్‌) ను హోస్ట్ చేశాయి. గ్రామీణ ప్రాంత ర‌హ‌దారి నిర్మాణం లో- హ‌రిత సాంకేతికత తో పాటు ప్లాస్టిక్ వ్య‌ర్థాలు, ఇంకా థర్మల్ విద్యుత్తు కేంద్రాల నుండి వెలువడే బూడిద వంటి- సాంప్ర‌దాయేత‌ర ప‌దార్థాల‌ను ఉప‌యోగించ‌డం జ‌రుగుతోంది.

రైల్వేల రంగం లో సామ‌ర్ధ్యాన్ని, ఇంకా రైలు పెట్టెలు, ఇంజను వంటి వాటి జోడింపు గ‌ణ‌నీయ స్థాయి లో చోటు చేసుకొంది. 2014 ఇంకా 2018 సంవ‌త్స‌రాల మ‌ధ్య కాలంలో కొత్త మార్గాలు, డ‌బ్లింగ్ తో పాటు గేజ్ కన్వర్షన్ లలో జోడింపు లు 9528 కిలోమీట‌ర్లుగా నమోదయ్యాయి. అంతక్రితం నాలుగు సంవ‌త్స‌రాల కాలంలో జ‌రిగిన ఇటువంటి ప‌నులనే పోల్చి చూసిన‌ప్పుడు ఈ విషయంలో 56 శాతం పెరుగుదల ఉంది.

ఇదే మాదిరిగా, విమాన‌యాన రంగం లో ప్ర‌యాణికుల రాక‌ పోక‌ లలో 2014 నుంచి 2018 మ‌ధ్య కాలం లో 62 శాతానికి పైగా వృద్ధి న‌మోదు అయింది. 2014 కంటే పూర్వం నాలుగు సంవ‌త్స‌రాల కాలంలోను విమాన‌యాన రంగం లో ప్ర‌యాణికుల రాక‌ పోక‌ లలో18 శాతం మేర వృద్ధి ఉంది. యుడిఎఎన్‌ ప‌థ‌కం లో భాగంగా ప్ర‌స్తుతం రెండో అంచె నగరాలలోను, మూడో అంచె న‌గ‌రాల‌లోను 27 విమానాశ్ర‌యాలు ప‌ని చేయడం మొదలుపెట్టాయి.

నౌకాశ్ర‌యాల రంగానికి వస్తే, ప్ర‌ధాన నౌకాశ్ర‌యాల‌లో రాక‌పోక‌ల ప‌రిమాణం 2014 నుంచి 2018 మ‌ధ్య కాలంలో 17 శాతం మేర‌కు పెరిగింది.

గ్రామీణ ప్రాంతాల‌లో గృహ నిర్మాణం రంగాన్ని పరిశీలించగా, 2014 క‌న్నా పూర్వం నాలుగు సంవ‌త్స‌రాల కాలంలో దాదాపు 25 ల‌క్ష‌ల ఇళ్ళ‌ను నిర్మించ‌గా, 2014 నుంచి 2018 మ‌ధ్య కాలంలో ఒక కోటి కి పైగా గృహాలను నిర్మించిన‌ట్లు ప్ర‌ధాన మంత్రి దృష్టి కి తీసుకువ‌చ్చారు. ఈ పరిణామం గృహ నిర్మాణ రంగం లోను, నిర్మాణ సంబంధిత ప‌రిశ్ర‌మ‌ల లోను ఉపాధికి ద‌న్నుగా నిల‌చింది. ఒక స్వ‌తంత్ర అధ్య‌య‌నం యొక్క క‌థ‌నం ప్ర‌కారం, నిర్మాణం పూర్తి కావ‌డానికి పడుతున్న స‌రాస‌రి కాలం 2015-16 మ‌ధ్య 314 రోజులుగా ఉన్న‌ది కాస్తా 2017-18 లో 114 రోజుల‌కు త‌గ్గిపోయింది. విప‌త్తు ల‌ను త‌ట్టుకొని నిల‌చే అంశం పట్ల, త‌క్కువ ఖ‌ర్చుతో కూడిన హౌసింగ్ డిజైన్ టైపాల‌జీస్ ప‌ట్ల శ్ర‌ద్ధ వహిస్తున్నారు.

ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో గృహ నిర్మాణ రంగం విషయానికి వస్తే, నూత‌న నిర్మాణ సాంకేతిక‌త ల‌కు ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు. ప్ర‌ధాన్‌ మంత్రి ఆవాస్ యోజ‌న (అర్బ‌న్) ప‌థ‌కాన్ని ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి 54 ల‌క్ష‌ల గృహాల‌ను మంజూరు చేయ‌డ‌మైంది.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s coffee exports zoom 45% to record $1.68 billion in 2024 on high global prices, demand

Media Coverage

India’s coffee exports zoom 45% to record $1.68 billion in 2024 on high global prices, demand
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 4 జనవరి 2025
January 04, 2025

Empowering by Transforming Lives: PM Modi’s Commitment to Delivery on Promises