కీలకమైన మౌలిక సదుపాయాల రంగాలైన విద్యుత్తు, నవీకరణ యోగ్య శక్తి, పెట్రోలియమ్, ఇంకా సహజ వాయువు, బొగ్గు మరియు గనుల తవ్వకం రంగాలలో పురోగతి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం నాడు సమీక్షించారు. రెండు గంటలకు పైగా సాగిన ఈ సమీక్షా సమావేశానికి మౌలిక సదుపాయాల కల్పన సంబంధిత మంత్రిత్వ శాఖలతో పాటు నీతి ఆయోగ్ కు, ఇంకా పిఎంఒ కు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
నీతి ఆయోగ్ సిఇఒ శ్రీ అమితాబ్ కాంత్ సమర్పించినటువంటి ఒక నివేదిక లో భాగంగా, భారతదేశం లో విద్యుత్తు ఉత్పత్తి సామర్ధ్యం 344 గీగావాట్ల కు పెరిగిన సంగతి ని చాటి చెప్పారు. భారతదేశం లో 2014 లో 4 శాతానికి పైగా ఉన్న శక్తి లోటు 2018 లో 1 శాతం కన్నా తక్కువ కు తగ్గిపోయింది. ప్రసార మార్గాలు, ట్రాన్స్‌ఫార్మర్ సామర్ధ్యం, మరియు ఇంటర్ రీజినల్ ట్రాన్స్ మిశన్ లలో సామర్ధ్యం జోడింపులు ప్రముఖ స్థాయి లో చోటు చేసుకొన్నాయి.
ప్రపంచ బ్యాంకు యొక్క ‘‘ఈజ్ ఆఫ్ గెట్టింగ్ ఎలక్ట్రిసిటీ’’ ఇండెక్స్ లో భారతదేశం 2014 లో 99వ స్థానం లో నిలువగా, ప్రస్తుతం 26వ స్థానం లో ఉంది. ‘సౌభాగ్య’ (SAUBHAGYA ) కార్యక్రమం లో భాగంగా కుటుంబాలకు విద్యుత్తు సరఫరా లో నమోదైన పురోగతిని ఈ సందర్భంగా సమీక్షించడమైంది.
చర్చలలో పట్టణ ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాల లో ఆఖరి స్థానం వరకు సంధానించడం, ఇంకా పంపిణీ అంశాలపై దృష్టి సారించారు. నూతన, నవీకరణ యోగ్య శక్తి రంగం లో సంచిత స్థాపిత సామర్ధ్యం 2013-14 లో 35.5 గీగా వాట్ల నుంచి దాదాపు రెట్టింపై 2017-18 లో సుమారు 70 గీగావాట్ల కు చేరుకొంది. ఇదే కాలం లో సౌర శక్తి రంగం లో స్థాపిత సామర్ధ్యం 2.6 గీగావాట్ల నుంచి 22 గీగావాట్ల కు పెరిగింది. నవీకరణ యోగ్య శక్తి సామర్ధ్యాన్ని 2022 కల్లా 175 గీగావాట్ల కు చేర్చాలంటూ ప్రధాన మంత్రి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించగలుగుతామన్న విశ్వాసాన్ని అధికారులు వ్యక్తం చేశారు.
వినియోగదారు కు అనుకూలంగా ఉండేటటువంటి సోలర్ కుంకింగ్ సొల్యూశన్స్ తో పాటు సోలర్ పంప్స్ తదితర సముచిత మార్గాల లో సౌర శక్తి సామర్ధ్యం లో పెరుగుదల తాలూకు ప్రయోజనాలు రైతులకు అందే దిశగా కృషి చేయవలసిందిగా అధికారులను ప్రధాన మంత్రి కోరారు.
పెట్రోలియమ్, ఇంకా సహజ వాయువు రంగం లో ప్రధాన మంత్రి ‘ఉజ్జ్వల యోజన’ లో భాగంగా నిర్దేశించుకొన్న లక్ష్యాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో సాధించడం జరుగాలన్న సంగతిని గమనించడమైంది. చర్చల సందర్భంగా, బొగ్గు రంగం లోనూ ఉత్పత్తి సామర్ధ్యాన్ని మరింతగా పెంచుకోవడం పై దృష్టి సారించడమైంది.