ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రాన్స్ రక్షణశాఖ మంత్రి శ్రీమతి ఫ్లోరెన్స్ పార్లీతో సమావేశమయ్యారు.
ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా ఇచ్చిన సందేశంలో-
“ఫ్రాన్స్ రక్షణశాఖ మంత్రి @ఫ్లోరెన్స్_పార్లీతో ఇవాళ సమావేశమయ్యాను. ఈ సందర్భంగా ద్వైపాక్షిక రక్షణ సహకారం, ప్రాంతీయ భద్రత, ఇండో-పసిఫిక్సహా ఐరోపా సమాఖ్యకు ఫ్రాన్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనుండటంపై ఆమెతో చర్చించాను.
రెండుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేయడంపై భారత నిబద్ధతను ఈ సందర్భంగా నేను పునరుద్ఘాటించాను.” అని పేర్కొన్నారు.
Received French Minister for Armed Forces @florence_parly today and discussed bilateral defence cooperation, regional security, Indo-Pacific and France’s forthcoming Presidency of the EU Council.
— Narendra Modi (@narendramodi) December 17, 2021
I reiterated India's commitment to further deepening our Strategic Partnership. pic.twitter.com/GbmLSKcHkk