ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విదేశీ వ్యవహారాల శాఖ పూర్వ మంత్రి సుష్మా స్వరాజ్ మృతి కి న్యూ ఢిల్లీ లోని ఆమె నివాసం లో నివాళులు అర్పించారు.
ఆమె మరణం పట్ల ప్రధాన మంత్రి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ‘‘భారతదేశ రాజకీయాల లో ఒక సుప్రసిద్ధ అధ్యాయం ముగిసింది. ప్రజల కు సేవ చేయడం కోసం మరియు పేదల జీవితాల ను మెరుగుపరచడం కోసం తన జీవితాన్ని సమర్పించినటువంటి ఒక ఉత్కృష్ట నేత కన్నుమూత పట్ల భారతదేశం దుఃఖిస్తోంది. కోట్లాది ప్రజల కు ఒక ప్రేరణ మూర్తి గా నిలచినటువంటి సుష్మా స్వరాజ్ గారి వంటి వారు ఒక్కరే ఉంటారు.
సుష్మా గారు సఫల వక్త యే కాక విశిష్ట పార్లమెంటేరియన్ కూడా. ఆమె ను పార్టీ విభేదాల కు అతీతం గా ప్రశంసించే వారు; అలాగే గౌరవ ప్రతిపత్తుల ను అందుకొనే వారు. బిజెపి సిద్ధాంతం మరియు హితాల కు సంబంధించిన విషయాలు వచ్చే సరికి ఆమె రాజీపడే వారు కాదు. బిజెపి వృద్ధి కి ఆమె ఎనలేని తోడ్పాటు ను అందించారు.
శ్రేష్ఠమైన పరిపాలకురాలు గా సుష్మా గారు తాను నిర్వహించిన ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖ లోనూ ఉన్నత ప్రమాణాల ను నిర్దేశించారు. వివిధ దేశాల తో భారతదేశం యొక్క సంబంధాల ను మెరుగు పరచడం లో ఆమె ఒక కీలకమైన పాత్ర ను పోషించారు. సాటి భారతీయులు ప్రపంచం లోని ఏ మూలన అయినా ఆపద లో ఉన్నప్పుడు ఒక మంత్రి గా సహాయం చేసినటువంటి ఆమె యొక్క దయాపూరిత పార్శ్వాన్ని సైతం మనము చూశాము.
గడచిన అయిదు సంవత్సరాల కాలం లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా అలుపెరుగకుండా ఆమె పరిశ్రమించడాన్ని నేను మరచిపోలేను. ఆమె కు ఆరోగ్యం బాగా లేకపోయినప్పటి కీ, తన విధుల కు న్యాయం చేయడం కోసం తాను చేయగలిగిందంతా ఆమె చేసే వారు. మరి తన మంత్రిత్వ శాఖ కు సంబంధించిన వ్యవహారాలన్నింటిని ఆమె ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ ఉండే వారు. ఆ నిబద్ధత, ఆ స్ఫూర్తి సాటి లేనివి గా ఉండేవి.
సుష్మా గారి కన్నుమూత వ్యక్తిగతం గా ఏర్పడినటువంటి ఒక నష్టం. భారతదేశం కోసం ఆమె చేసిన ప్రతి పని ని ఆసక్తి తో స్మరించుకోవడం జరుగుతుంది. ఈ దురదృష్టకరమైన ఘడియల లో ఆమె కుటుంబాని కి, మద్ధతుదారుల కు మరియు ప్రశంసకుల కు కలిగిన శోకం లో నేను కూడా పాలు పంచుకుంటున్నాను. ఓం శాంతి’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
విదేశీ వ్యవహారాల శాఖ పూర్వ మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ గత రాత్రి న్యూ ఢిల్లీ లో కన్నుమూశారు.