భారతదేశ ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
“మహాత్మ గాంధీ నుండి స్ఫూర్తిని పొంది, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశ స్వాతంత్య్ర సమరంలో చురుకైన పాత్రను పోషించారు. సహాయ నిరాకరణ ఉద్యమం వంటి అట్టడుగు స్థాయి ఉద్యమాలలో ఆయన పాలుపంచుకొన్నారు. అలాగే, రాజ్యాంగ పరిషత్తు కు అధ్యక్షునిగా ఘనమైన నాయకత్వాన్ని అందించారు.
భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా ఆయన అందించినటువంటి నాయకత్వం, మార్గదర్శకత్వం తొలి సంవత్సరాలలో మన దేశానికి అత్యంత అమూల్యమైనటువంటివి.
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ యొక్క విశిష్ట సేవ నుండి తరాల తరబడి భారతీయులు ప్రేరణ ను పొందుతూ ఉంటారు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Remembering Dr. Rajendra Prasad on his Jayanti. pic.twitter.com/4uPv8aGAjf
— Narendra Modi (@narendramodi) December 3, 2017