మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. జాతిపితకు నివాళిగా ఖాదీ, హస్తకళా ఉత్పత్తులు కొనుగోలు చేయాలని శ్రీ మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారతదేశం స్వాతంత్ర్య అమృత మహోత్సవం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది గాంధీ జయంతి మరింత ప్రత్యేకమైనదని శ్రీ మోదీ నొక్కి చెప్పారు. మహాత్మా గాంధీపై తన మనోభావాల వీడియోను కూడా ఆయన ప్రజలతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
“#గాంధీ జయంతినాడు మహాత్మునికి నివాళి అర్పిస్తున్నాను. భారతదేశం స్వాతంత్ర్య అమృత మహోత్సవం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది గాంధీ జయంతి మనకెంతో ప్రత్యేకం. మనమంతా సదా బాపూజీ ఆశయాలను పాటిద్దాం. ఈ మేరకు ఆయనకు నివాళిగా ఖాదీ, హస్తకళా ఉత్పత్తులు కొనుగోలు చేయాలని నేను మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Paying homage to Mahatma Gandhi on #GandhiJayanti . This Gandhi Jayanti is even more special because India is marking Azadi Ka Amrit Mahotsav. May we always live up to Bapu’s ideals. I also urge you all to purchase Khadi and handicrafts products as a tribute to Gandhi Ji. pic.twitter.com/pkU3BJHcsm
— Narendra Modi (@narendramodi) October 2, 2022