మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ రాజ్‌ఘాట్ వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించాను. ఆయన ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి. ఆయన ఆలోచనలు లక్షలాది ప్రజలలో శక్తి నింపుతున్నాయి #గాంధీజయంతి” అని పేర్కొన్నారు.
Paid floral tributes to Mahatma Gandhi At Rajghat. His ideals reverberate globally and his thoughts have provided strength to millions of people. #GandhiJayanti pic.twitter.com/35hGMEC1RL
— Narendra Modi (@narendramodi) October 2, 2022