Our links with Malaysia have been civilizational and historic. Our relationship is rich and diverse: PM Modi
The contributions of a large Indian community in Malaysia are of special value. They have not only nurtured our shared heritage: PM
India and Malaysia have built a thriving economic partnership: PM Narendra Modi
India’s infrastructure needs and our ambitious vision of developing Smart cities match well with the Malaysian capacities: PM
The U.T.A.R. University of Malaysia has started Ayurveda degree courses in Malaysia for the first time. This is a welcome development: PM
Our (India and Malaysia) wide-ranging defence partnership has already brought our armed forces closer, says PM Modi

శ్రేష్ఠులైన ప్రధాని శ్రీ మొహ‌మ్మ‌ద్ న‌జీబ్ బిన్ తున్ అబ్దుల్ ర‌జాక్‌,

మీడియా స‌భ్యులారా,

భారతదేశంలో పర్యటించేందుకు గాను మ‌లేశియా ప్ర‌ధానికి స్వాగ‌తం ప‌ల‌క‌డం నాకెంతో ఆనందాన్నిస్తోంది. 2015 నవంబరులో నేను మ‌లేశియాను సంద‌ర్శించిన‌ప్పుడు మీరు అందించిన ఆత్మీయత, ఆదరణలకు ప్రతిగా- శ్రేష్ఠులైన నజీబ్ గారు- ప్రస్తుతం మీ పర్యటన సంద‌ర్భంగా అదే ఆత్మీయతను, ఆదరణను మీకు అందజేసే అవ‌కాశం ల‌భించిందని మనవి చేస్తున్నాను. మన ఇరు దేశాల మ‌ధ్య‌ సంబంధాలు చరిత్రాత్మ‌క ద‌శ‌కు చేరుకున్న సంద‌ర్బంలో మీ భారత్ పర్యటన చోటు చేసుకొంది. మ‌న దేశాల మ‌ధ్య‌ దౌత్య సంబంధాలు ఆరంభ‌మై 60 సంవ‌త్స‌రాలైన సంద‌ర్భ‌మిది. ఎక్స్ లెన్సీ, మీరు చూపుతున్న వ్య‌క్తిగ‌త శ్ర‌ద్ధ‌, మీ నాయ‌కత్వ ల‌క్ష‌ణాల కార‌ణంగా ఉభయ దేశాల బంధాల‌కు దిశ‌, బ‌లం, ప్రోత్సాహం ల‌భిస్తున్నాయి. భార‌త‌దేశంతో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం స‌మ‌గ్రంగా రూపొంద‌డానికి మీరు చేస్తున్న కృషి కీల‌కమ‌ని భావిస్తున్నాను.

స్నేహితులారా,

మలేశియాతో భార‌త‌దేశ సంబంధాలు నాగ‌రిక‌మైన‌వి, చరిత్రాత్మ‌క‌మైన‌వి. ఇరు దేశాల మ‌ధ్య‌ బాంధ‌వ్యం ఎంతో ఉన్న‌త‌మైంది, వైవిధ్య‌మైందీనూ. ప‌లు స్థాయిలలో రెండు దేశాల స‌మాజాలు బంధాన్ని క‌లిగివున్నాయి. ఇరు దేశాల సంస్కృతి, మ‌తాల‌కు చెందిన బంధాల‌నేవి రెండు దేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య‌ బ‌ల‌మైన బంధాన్ని రూపొందించాయి. మలేశియాలో నివ‌సించే భార‌తీయులు చేస్తున్న కృషి చాలా ప్ర‌త్యేక‌మైన‌టువంటిది. ఇరు దేశాలు పంచుకుంటున్న వార‌స‌త్వాన్ని వారు పెంచి పోషించారు. మ‌న రెండు దేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య‌ సంబంధ‌ బాంధ‌వ్యాలు పెర‌గ‌డానికి, ఆర్ధిక కార్య‌క‌లాపాలు పెర‌గ‌డానికి మలేశియాలోని భార‌తీయులు చాలా కృషి చేశారు. నా చివ‌రి మలేశియా సంద‌ర్శ‌న స‌మ‌యంలో నేను, ప్ర‌ధాని శ్రీ న‌జీబ్ క‌లసి కౌలాలంపూర్ లో తోర‌ణ గేటును ప్రారంభించాం. సాంచీ స్తూపాన్ని ప్ర‌తిబింబించేలా తోర‌ణ గేటును రూపొందించ‌డం జ‌రిగింది. త‌ద్వారా ఇరు దేశాల స్నేహానికి అది ప్ర‌తీక‌గా నిలుస్తోంది.

 

స్నేహితులారా,

ప్ర‌ధాని శ్రీ న‌జీబ్ నేను క‌లసి చాలా సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం. ఇరు దేశాల మ‌ధ్య‌ గ‌ల సాంస్కృతిక‌, ఆర్ధిక‌, వ్యూహాత్మ‌క కార్య‌క‌లాపాలను గురించి స‌మ‌గ్రంగా చ‌ర్చించుకోవ‌డం జ‌రిగింది. 2015 నవంబ‌ర్ లో నా మలేశియా ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా తీసుకున్న ప్ర‌ధాన‌మైన నిర్ణ‌యాల అమ‌లులో ఎలాంటి ప్ర‌గ‌తి సాధించామో చ‌ర్చించ‌డం జ‌రిగింది. ఇరు దేశాల మ‌ధ్య‌ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం సంయుక్త దృక్ప‌థాన్ని క‌లిగి వుండాల‌ని మేం నిర్ణ‌యించాం. ఇరు దేశాల మ‌ధ్య ఉండే దూర‌దృష్టి కార్య‌రూపం దాల్చ‌గ‌లిగేలా ఉండాలి. ఇందుకోసం ఇరు దేశాలు త‌మ స‌హ‌కారాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకోవడం, నూత‌న అంశాలలో ఇరు దేశాల మ‌ధ్య‌న సంబంధాల‌ను ఏర్ప‌రచుకోవ‌డం రెండు దేశాల దూర‌దృష్టిలో ముఖ్యమైన‌వి.

స్నేహితులారా,

భార‌త‌దేశం, మలేశియా లు విశిష్ట‌మైన ఆర్ధిక భాగ‌స్వామ్యాన్ని క‌లిగివున్నాయి. దీనిని మ‌రింత ముందుకు తీసుకుపోవ‌డానికిగాను, ప్ర‌పంచంలోనే వేగంగా అభివృద్ధ‌వుతున్న భారీ ఆర్ధిక రంగాన్ని క‌లిగిన దేశమైన భార‌త‌దేశం అస‌మాన‌మైన అవ‌కాశాల‌ను అందించ‌డానికి సిద్ధంగా వుంది. ఇరు దేశాల్లో సంప‌దను సృష్టించ‌డానికిగాను కొత్త మార్గాల‌ను నిర్మించాల‌నుకుంటే ఇరు దేశాల మ‌ధ్య‌ వాణిజ్యాన్ని, పెట్టుబ‌డులను పెంచాల్సివుంటుంది. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న అనేది మ‌న రెండు దేశాల భాగ‌స్వామ్యాల్లో మంచి ఫ‌లితాల‌ను ఇస్తున్న రంగం. అయితే ఈ విష‌యంలో మ‌నం మ‌రింతగా కృషి చేయాల్సి వుంది. మౌలిక వ‌స‌తుల రంగంలో భార‌త‌దేశం సాధించవలసింది చాలా ఉంది. స్మార్ట్ సిటీస్ పేరుతో మొద‌లుపెట్టిన కార్య‌క్ర‌మం ద్వారా మలేశియా సామ‌ర్థ్యాల‌కు అనుగుణంగా నిల‌వాల్సివుంది. దేశంలోని ప‌లు రాష్ట్రాలలో అనేక మౌలిక వ‌స‌తుల ప్రాజెక్టుల్లో మలేశియా కంపెనీలు వాటి పాత్ర‌ను పోషిస్తున్నాయి. మలేశియా ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లో భార‌తీయ కంపెనీలు కూడా విస్తృత‌మైన భాగ‌స్వామ్యంతో ప‌ని చేస్తున్నాయి. పెట్టుబ‌డులు పెట్టాయి. ప్ర‌స్తుతం ప్ర‌ధాని శ్రీ న‌జీబ్ తో పాటు ఉన్న‌త స్థాయి వ్యాపార ప్రతినిధివర్గం కూడా ఉంద‌నే విష‌యం మాకు చాలా ఆనందాన్ని క‌లిగిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఏర్ప‌డే వ్యాపార భాగ‌స్వామ్యాలు రెండు దేశాల వాణిజ్య కార్య‌క్ర‌మాల్లో మ‌రింత ప్ర‌గ‌తిని తెస్తాయ‌ని నాకు చాలా న‌మ్మ‌కంగా ఉంది. ఆహార భ‌ద్ర‌త‌ను సాధించడానికి మ‌నం క‌లసిక‌ట్టుగా కృషి చేస్తున్నాం.. త‌ద్వారా అన్న‌దాత‌లు ల‌బ్ధి పొందుతారు. మలేశియాలో ఎరువుల త‌యారీ క‌ర్మాగారాన్ని అభివృద్ధి చేయ‌డానికిగాను ఎంఓయు, మలేశియాలో మిగిలిపోయిన యూరియాను భార‌త‌దేశానికి తీసుకురావాడానికి చేసుకున్న ఒప్పందం స్వాగ‌తించ‌ద‌గ్గ ప‌రిణామాలు.

స్నేహితులారా,

మలేశియాకు చెందిన యు.టి.ఎ.ఆర్. విశ్వ‌విద్యాల‌యం దేశంలోనే మొద‌టిసారిగా ఆయుర్వేద డిగ్రీని ప్రారంభించింది. ఇది స్వాగ‌తించ‌ద‌గ్గ ప‌రిణామం. అదే విశ్వ‌విద్యాల‌యంలో ఆయుర్వేద చైర్ ను త్వ‌ర‌లో నెల‌కొల్ప‌బోతున్నారు. ఈ ప‌ని తొంద‌ర‌గా జ‌రిగితే ఆయుర్వేద రంగ‌లో ద్వైపాక్షిక స‌హ‌కారం మ‌రింత ప‌టిష్టమ‌వుతుంది. ఇరు దేశాల మ‌ధ్య‌ విద్యాప‌రంగా ఏర్పాటు చేసుకునే ఇచ్చిపుచ్చుకునే కార్య‌క్ర‌మాల‌ కార‌ణంగా రెండు దేశాల ప్ర‌జ‌ల బంధాలు మ‌రింత ముందుకు సాగుతాయి. ఈ రోజు డిగ్రీల విష‌యంలో ప‌ర‌స్ప‌ర గుర్తింపు ల‌భించ‌డానికి ఉద్దేశించిన ఎంఓయు పైన సంత‌కాలు జ‌ర‌గ‌డ‌మ‌నేది ఈ రంగంలో ప్ర‌ధాన‌మైన అభివృద్ది. త‌ద్వారా ఇరు దేశాల విద్యార్థులు, ప్ర‌జ‌లు ల‌బ్ధి పొందుతారు.

స్నేహితులారా,

సంప్ర‌దాయ‌కంగాను, సంప్ర‌దాయేత‌రంగాను భ‌ద్ర‌తా స‌మ‌స్య‌లు క్ర‌మంగా పెరుగుతున్న స‌మ‌య‌మిది. ఇరు దేశాల స్థ‌ల‌, కాలాలు దీనికి మిన‌హాయింపు కాదు. మ‌న ప్రాంతాన్ని మ‌న‌ రెండు దేశాల‌ను ఈ స‌వాళ్లు భ‌య‌పెడుతున్నాయ‌ని, ఆర్ధిక స్థిర‌త్వానికి, సౌభాగ్యానికి అడ్డుగా నిలుస్తున్నాయ‌ని ప్ర‌ధాని శ్రీ న‌జీబ్, నేను అంగీక‌రించ‌డం జ‌రిగింది. ఈ విష‌యంలో భార‌త‌దేశం, మలేశియాల‌తో పాటు ఈ ప్రాంతంలోని ఇత‌ర దేశాలు క‌లిసిక‌ట్టుగా ప‌ని చేయాలి. రెండు దేశాలు సంయుక్తంగా చేప‌ట్టిన ఉగ్ర‌వాద వ్య‌తిరేక కార్య‌క‌లాపాల విష‌యంలో భార‌త‌దేశ స‌హ‌కారం నిరంత‌రం కొన‌సాగుతుంద‌ని తెలియ‌జేస్తున్నాను.

ఎక్స్ లెన్సీ, మీరు స్వ‌యంగా మీ నాయ‌క‌త్వం కింద ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా చేస్తున్న పోరాటం మ‌న మొత్తం ప్రాంతానికి స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తోంది. ఇరు దేశాల మ‌ధ్య‌ విస్తృతంగా గ‌ల ర‌క్ష‌ణ‌ రంగ భాగ‌స్వామ్యం మ‌న సైనిక‌ద‌ళాల మ‌ధ్య‌న మ‌రింత బంధాన్ని పెంచింది.

రక్ష‌ణ‌ రంగానికి సంబంధించి శిక్ష‌ణ‌, సామ‌ర్థ్య పెంపుద‌ల‌, ప‌రిక‌రాల నిర్వ‌హ‌ణ‌, మిలిట‌రీ హార్డ్ వేర్‌, స‌ముద్ర‌ రంగ భ‌ద్ర‌త‌, విప‌త్తుల స‌మ‌యంలో వ్య‌వ‌హ‌రించాల్సిన తీరు త‌దిత‌ర అంశాలలో భార‌త‌దేశం త‌న స‌హ‌కారం కొన‌సాగిస్తోంది.

ప్ర‌ధాని శ్రీ న‌జీబ్, నేను క‌లసి ఇరు దేశాల ఆర్ధిక సౌభాగ్యాన్ని ప్రోత్స‌హించ‌డానికిగాను ఎలాంటి పాత్ర‌ను పోషించాల‌నేదానిపైన చ‌క్క‌టి అవ‌గాహ‌నతో ఉన్నాం. నౌకార‌వాణా, ఆసియా- ప‌సిఫిక్ ప్రాంతంలో స్థిర‌త్వం, ముఖ్యంగా స‌ముద్రాల‌కు సంబంధించి మాకు అవ‌గాహ‌న వుంది. ఇరు దేశాల‌కు త‌గిన భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలోను, ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికిగాను మ‌న రెండు దేశాల వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని బ‌లోపేతం చేసుకోవ‌డానికి మేం అంగీక‌రించాం. తద్వారా ఉమ్మ‌డి ఇబ్బందులు, స‌వాళ్ల‌కు స‌రైన ప‌రిష్కారం ల‌భిస్తుంది.

ఎక్స్ లెన్సీ ప్ర‌ధాని శ్రీ న‌జీబ్‌,

భార‌త‌దేశంలోకి మిమ్మ‌ల్ని మ‌రోసారి సాద‌రంగా స్వాగ‌తిస్తున్నాను. ఇరు దేశాల మ‌ధ్య‌ స‌రైన చ‌ర్చ‌లు జ‌రిగినందుకు మీకు నా అభినంద‌న‌లు. ఈ రోజు తీసుకున్న నిర్ణ‌యాలు మ‌న రెండు దేశాల మ‌ధ్య‌న గ‌ల వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని ఉన్న‌త ద‌శ‌కు తీసుకువెళ్తాయని నేను నమ్ముతున్నాను. మీ భార‌త‌దేశ‌ ప‌ర్య‌ట‌న మీకు అన్ని విధాలా మేలు చేకూర్చుగాక.

ధన్యవాదాలు.

అనేకానేక ధన్యవాదాలు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures

Media Coverage

India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948
December 03, 2024

The Prime Minister Shri Narendra Modi lauded the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948 in Rajya Sabha today. He remarked that it was an important legislation which will boost energy security and also contribute to a prosperous India.

Responding to a post on X by Union Minister Shri Hardeep Singh Puri, Shri Modi wrote:

“This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India.”