ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జపాన్ ప్రధాని శ్రీ షింజో ఆబే 2017 సెప్టెంబర్ 13వ మరియు 14వ తేదీలలో భారతదేశంలో ఆధికారిక పర్యటనకు తరలిరానున్నారు.
సెప్టెంబర్ 14వ తేదీన గుజరాత్ లోని గాంధీనగర్ లో మహాత్మ మందిర్ వేదికగా ప్రధాన మంత్రి శ్రీ మోదీ మరియు ప్రధాని శ్రీ ఆబే లు ఇండియా- జపాన్ 12వ వార్షిక శిఖర సమ్మేళనంలో పాల్గొంటారు. ఇరువురు నేతలు ప్రసార మాధ్యమాలకు ప్రకటనలు విడుదల చేస్తారు. అదే రోజున ఇండియా - జపాన్ బిజినెస్ ప్లీనరీ జరుగనుంది.
ప్రధాన మంత్రి శ్రీ మోదీ మరియు ప్రధాని శ్రీ ఆబే ల మధ్య జరుగనున్న నాలుగవ వార్షిక శిఖర సమ్మేళనం ఇది. ఉభయ నేతలు భారతదేశ మరియు జపాన్ ల మధ్య ‘ప్రత్యేక వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యం’ ఫ్రేమ్ వర్క్ లో భాగంగా బహుళ పార్శ్వాలు కలిగిన సహకారం అంశంలో ఇటీవల చోటు చేసుకొన్న పురోగతిని సమీక్షిస్తారు.
అహమదాబాద్ మరియు ముంబయి ల మధ్య భారతదేశపు ఒకటవ అధిక వేగవంతమైన రైల్ ప్రాజెక్టు పనుల ప్రారంభ సూచకంగా సెప్టెంబర్ 14వ తేదీన జరిగే ఒక బహిరంగ కార్యక్రమంలో ఇరువురు నేతలు పాల్గొంటారు. ఈ రైలు సదరు రెండు నగరాల మధ్య ప్రయాణ కాలాన్ని గణనీయంగా తగ్గిస్తుందని భావిస్తున్నారు. అధిక వేగవంతమైన రైల్ నెట్‌వర్క్ లలో జపాన్ మార్గదర్శిగా ఉంది. ఈ దేశానికి చెందిన శిన్‌కన్‌సెన్ బులెట్ రైలు ప్రపంచంలోనే అత్యంత త్వరితగతిన పయనించే రైళ్ళలో ఒకటి. అహమదాబాద్ నగరం ప్రధాని శ్రీ ఆబే కు అభినందన పూర్వకంగా విస్తృతమైన స్థాయిలో పౌర స్వాగత కార్యక్రమాన్ని సెప్టెంబర్ 13వ తేదీన నిర్వహించనుంది. ఈ కార్యక్రమం పలు ప్రదర్శనలతో భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి అద్దం పట్టేదిగా రూపొందనుంది.
ప్రధాన మంత్రులు ఇరువురు సాబర్‌మతీ నది తీరాన మహాత్మ గాంధీ నెలకొల్పిన సాబర్‌మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. వారు అహమదాబాద్ లోని ప్రఖ్యాత 16వ శతాబ్దపు మసీదు ‘‘సీదీ సయ్యదీ ని జాలీ’’ ని సందర్శిస్తారు. ఉభయ నేతలు మహాత్మ మందిరం వద్ద మహాత్మ గాంధీ కి అంకితం ఇచ్చినటువంటి వస్తు ప్రదర్శన శాల ‘దండి కుటీర్’ ను కూడా సందర్శిస్తారు.
*****