PM Modi, Japanese PM Abe to hold the 12th India-Japan Annual Summit
PM Modi, PM Abe to review 'Special Strategic and Global Partnership' betwen India and Japan
PM Modi, PM Abe of Japan to lay foundation stone for India’s first high-speed rail project between Ahmedabad and Mumbai

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆహ్వానం మేర‌కు జ‌పాన్ ప్ర‌ధాని శ్రీ షింజో ఆబే 2017 సెప్టెంబ‌ర్‌ 13వ మరియు 14వ తేదీల‌లో భార‌త‌దేశంలో ఆధికారిక ప‌ర్య‌ట‌నకు తరలిరానున్నారు.

సెప్టెంబ‌ర్ 14వ తేదీన గుజ‌రాత్ లోని గాంధీన‌గ‌ర్ లో మ‌హాత్మ మందిర్ వేదిక‌గా ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ మరియు ప్ర‌ధాని శ్రీ ఆబే లు ఇండియా- జ‌పాన్ 12వ వార్షిక శిఖ‌ర స‌మ్మేళ‌నంలో పాల్గొంటారు. ఇరువురు నేత‌లు ప్ర‌సార మాధ్య‌మాల‌కు ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేస్తారు. అదే రోజున ఇండియా - జ‌పాన్ బిజినెస్ ప్లీన‌రీ జ‌రుగ‌నుంది.

ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ మ‌రియు ప్ర‌ధాని శ్రీ ఆబే ల మ‌ధ్య జ‌రుగనున్న నాలుగ‌వ వార్షిక శిఖ‌ర స‌మ్మేళ‌నం ఇది. ఉభ‌య నేత‌లు భార‌త‌దేశ మ‌రియు జ‌పాన్ ల మ‌ధ్య ‘ప్ర‌త్యేక వ్యూహాత్మ‌క మ‌రియు ప్ర‌పంచ భాగ‌స్వామ్యం’ ఫ్రేమ్ వ‌ర్క్ లో భాగంగా బ‌హుళ పార్శ్వాలు క‌లిగిన స‌హ‌కారం అంశంలో ఇటీవ‌ల చోటు చేసుకొన్న పురోగ‌తిని స‌మీక్షిస్తారు.

అహ‌మ‌దాబాద్ మ‌రియు ముంబ‌యి ల మ‌ధ్య భార‌త‌దేశ‌పు ఒక‌ట‌వ అధిక వేగ‌వంత‌మైన రైల్ ప్రాజెక్టు ప‌నుల ప్రారంభ సూచ‌కంగా సెప్టెంబ‌ర్ 14వ తేదీన జరిగే ఒక బ‌హిరంగ కార్య‌క్ర‌మంలో ఇరువురు నేత‌లు పాల్గొంటారు. ఈ రైలు స‌ద‌రు రెండు న‌గ‌రాల మ‌ధ్య ప్ర‌యాణ కాలాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గిస్తుంద‌ని భావిస్తున్నారు. అధిక వేగ‌వంత‌మైన రైల్ నెట్‌వ‌ర్క్ ల‌లో జ‌పాన్ మార్గ‌ద‌ర్శిగా ఉంది. ఈ దేశానికి చెందిన శిన్‌క‌న్‌సెన్‌ బులెట్ రైలు ప్ర‌పంచంలోనే అత్యంత త్వ‌రిత‌గ‌తిన ప‌య‌నించే రైళ్ళ‌లో ఒక‌టి. అహ‌మ‌దాబాద్ న‌గ‌రం ప్ర‌ధాని శ్రీ ఆబే కు అభినంద‌న‌ పూర్వ‌కంగా విస్తృత‌మైన స్థాయిలో పౌర స్వాగ‌త కార్య‌క్ర‌మాన్ని సెప్టెంబ‌ర్ 13వ తేదీన నిర్వ‌హించ‌నుంది. ఈ కార్య‌క్ర‌మం ప‌లు ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో భార‌త‌దేశ సాంస్కృతిక వైవిధ్యానికి అద్దం ప‌ట్టేదిగా రూపొందనుంది.

ప్ర‌ధాన మంత్రులు ఇరువురు సాబ‌ర్‌మ‌తీ న‌ది తీరాన మ‌హాత్మ గాంధీ నెల‌కొల్పిన సాబ‌ర్‌మ‌తీ ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించ‌నున్నారు. వారు అహ‌మ‌దాబాద్ లోని ప్ర‌ఖ్యాత 16వ శ‌తాబ్దపు మ‌సీదు ‘‘సీదీ స‌య్య‌దీ ని జాలీ’’ ని సంద‌ర్శిస్తారు. ఉభ‌య నేత‌లు మ‌హాత్మ మందిరం వ‌ద్ద మ‌హాత్మ గాంధీ కి అంకితం ఇచ్చిన‌టువంటి వ‌స్తు ప్ర‌ద‌ర్శ‌న శాల ‘దండి కుటీర్‌’ ను కూడా సంద‌ర్శిస్తారు.

*****

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry

Media Coverage

Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 26 డిసెంబర్ 2024
December 26, 2024

Citizens Appreciate PM Modi : A Journey of Cultural and Infrastructure Development