QuoteIndia is the land of 'Buddha', not 'Yuddha' (war): PM Modi at #UNGA
QuoteTerrorism is the biggest threat to humanity, world needs to unite and have a consensus on fighting it: PM at #UNGA
QuoteIndia is committed to free itself from single-use plastic: PM Modi at #UNGA

ఈ రోజు న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (యుఎన్‌జిఎ) 74 వ సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.

మహాత్మా గాంధీని స్మరించుకుంటూ, ప్రపంచ శాంతి, పురోగతి మరియు అభివృద్ధికి గాంధీజీ ఇచ్చిన సత్యం మరియు అహింస సందేశం నేటికీ సందర్భోచితమైనదిగా ఉందని ప్రధానమంత్రి అన్నారు.

స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్ భారత్, జన్ ధన్ యోజన మరియు డిజిటల్ గుర్తింపు (ఆధార్) వంటి ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా వచ్చిన భారీ పరివర్తనను ప్రధానమంత్రి ఎత్తిచూపారు. భారతదేశం ఇటువంటి కార్యక్రమాలను అనుసరిస్తున్నప్పుడు, ఇది మొత్తం ప్రపంచంలో ఆశను రేకెత్తిస్తుందని ఆయన అన్నారు.

ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్‌ను తొలగించడంలో భారతదేశం యొక్క నిబద్ధత గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. రాబోయే ఐదేళ్లలో ప్రతి ఇంటికి నీరు, ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు మరియు క్షయ నిర్మూలనకు ప్రభుత్వం అందించే నిబద్ధత గురించి ఆయన మాట్లాడారు.

|

భారతీయ సంస్కృతికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజా సంక్షేమం మన సాంస్కృతిక ధర్మంలో భాగమని ప్రధానమంత్రి అన్నారు. ప్రజా భాగస్వామ్యం ద్వారా ప్రజా సంక్షేమం తన ప్రభుత్వ మంత్రం అని అన్నారు.

130 కోట్ల మంది భారతీయుల కలలను నెరవేర్చడంతో పాటు, ప్రభుత్వ ప్రయత్నాలు మొత్తం ప్రపంచానికి మేలు చేస్తాయి. “మేము మా ప్రజల సంక్షేమం కోసం మాత్రమే కాకుండా, మొత్తం ప్రపంచం యొక్క సంక్షేమం కోసం పనిచేస్తున్నాము. అందుకే మా ధ్యేయం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్’ అని ప్రధానమంత్రి తెలిపారు.

ఉగ్రవాదాన్ని ప్రపంచానికి అతిపెద్ద సవాలుగా పేర్కొంటూ, మానవత్వం కోసం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు ఏకం కావాలని ప్రధానమంత్రి కోరారు. “భారతదేశం ప్రపంచానికి యుద్ధం కాకుండా బుద్ధుని శాంతి సందేశం ఇచ్చిన దేశం” అని ప్రధానమంత్రి అన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ మిషన్‌కు భారతదేశం అందించిన సహకారం గురించి కూడా ఆయన ప్రస్తావించారు

|

బహుపాక్షికతకు కొత్త దిశానిర్దేశం చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని ప్రధానమంత్రి కోరారు. ప్రపంచం కొత్త శకం గుండా వెళుతున్నందున, దేశాలు తమ తమ సరిహద్దుల్లోనే తమను తాము నిర్బంధించుకునే అవకాశం లేదని ఆయన అన్నారు. “విచ్చిన్నమైన ప్రపంచం ఎవరి ఆసక్తిలో లేదు. ఐక్యరాజ్యసమితిని సంస్కరించడానికి మరియు బహుపాక్షికతకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి, ”అని ప్రధానమంత్రి అన్నారు.

వివిధ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి సమిష్టి చర్య తీసుకోవాలని తమిళ తత్వవేత్త కనియన్ పుంగుంద్రనార్ మరియు స్వామి వివేకానంద ల వ్యాఖ్యలను ప్రధానమంత్రి జ్ఞాపకం చేశారు. ‘సామరస్యం మరియు శాంతి’ అనేది ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మిగతా ప్రపంచానికిచ్చే సందేశం అని ఆయన అన్నారు.

భూతాపం (గ్లోబల్ వార్మింగ్) గురించి మాట్లాడుతూ, తలసరి ఉద్గారాల పరంగా భూతాపం పెరగడానికి భారతదేశం యొక్క సహకారం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, దీనికి వ్యతిరేకంగా ప్రతిస్పందించడంలో మాత్రం భారతదేశం ముందంజలో ఉంది. ఈ సందర్భంగా, వాతావరణ మార్పులపై పోరాడటానికి 450 గిగా వాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యం మరియు అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటుతో సహా తన ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు.

Click here to read full text speech

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
New trade data shows significant widening of India's exports basket

Media Coverage

New trade data shows significant widening of India's exports basket
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 మే 2025
May 17, 2025

India Continues to Surge Ahead with PM Modi’s Vision of an Aatmanirbhar Bharat