లోక్సభ స్పీకర్, శ్రీమతి. సుమిత్రా మహాజన్ ప్రధాని నరేంద్ర మోదీపై రెండు పుస్తకాలు విడుదల చేసి నేడు రాష్టప్రతి భవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మొదటి కాపీలు అందజేశారు.
పుస్తక ఆవిష్కరణలో అతిథులనుద్దేశించి ప్రసంగిస్తూ, ప్రణబ్ ముఖర్జీ ప్రధాని నరేంద్ర మోదీని సమర్థవంతమైన వక్తగా ప్రశంసించారు. పౌరులతో అనుసంధానం కావడానికి మాధ్యమంగా వున్న మన్ కి బాత్ ను ప్రశంసిస్తూ, ప్రతి ఎపిసోడ్ లోనూ ప్రధాని ఎంచుకుంటున్న విషయాల పట్ల శ్రీ ప్రణబ్ ముఖర్జీ సంతోషం వ్యక్తం చేశారు.
"ఉత్తమ అధ్యక్షులు మరియు ప్రధాన మంత్రులందరికీ సాధారణమైన విషయం ఏమిటంటే వారు చాలా మంచి వక్తలు కావడం. ప్రధాని నరేంద్ర మోదీ చాలా ప్రభావవంతమైన వక్తగా ఉన్నారు. మన్ కి బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఎంపిక చేసుకునే అంశాలు, వంద కోట్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయి. అతను ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను ఇచ్చారు. కొన్ని నిర్ణయాలు కొత్త యుగానికి నాంది పలికాయి.", అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.