QuoteDigital technology has emerged as a great enabler. It has paved the way for efficient service delivery and governance: PM Modi
QuoteWe are using mobile power or M-power to empower our citizens: PM Narendra Modi
QuoteThrough better targeting of subsidies, the JAM trinity has prevented leakages to the tune of nearly ten billion dollars so far: PM
QuoteCitizens of India are increasingly adopting cashless transactions; BHIM App is helping the movement towards a less cash and corruption free society: PM
QuoteTechnology breaks silos; PRAGATI has put back on track infrastructure projects worth billions of dollars which were stuck in red-tape: PM
QuoteCyber-space remains a key area for innovation. Our startups today are looking to provide solutions to everyday problems and improving lives: PM
QuoteNations must take responsibility to ensure that the digital space does not become a playground for the dark forces of terrorism and radicalization: PM

శ్రేష్ఠులైన శ్రీ లంక ప్ర‌ధాని రానిల్ విక్ర‌మ సింఘే, 
భార‌త‌దేశం నుండి ఇంకా విదేశాల నుండి విచ్చేసిన మంత్రులు,
ఐటియు సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌,
ఇత‌ర గౌర‌వ‌నీయ ఉన్న‌తాధికారులు,
120 కి పైగా దేశాల ప్ర‌తినిధులు,
విద్యార్థులు,
మ‌హిళ‌లు మ‌రియు స‌జ్జ‌నులారా,

గ్లోబ‌ల్ కాన్ఫ‌రెన్స్ ఆన్ సైబ‌ర్ స్పేస్ కార్య‌క్ర‌మం కోసం మీ అందరినీ న్యూ ఢిల్లీ కి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఇంట‌ర్ నెట్ మాధ్యమం ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి ఈ కార్య‌క్ర‌మంలో భాగం పంచుకొంటున్న వారంద‌రికీ కూడా ఇదే నా స్వాగతం.

మిత్రులారా,

సైబ‌ర్ స్పేస్ గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ప్ర‌పంచాన్ని ఎలా మార్చివేసిందీ మనంద‌రికీ ఎరుకే. ఇక్క‌డ గుమికూడిన స‌మూహంలో సీనియ‌ర్ తరం వారు 70వ మ‌రియు 80వ ద‌శ‌కాల నాటి భారీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూట‌ర్ సిస్ట‌మ్ లను ఒక్క సారి గుర్తుకు తెచ్చుకోగ‌ల‌రు. ఆనాటి నుండి ఎన్నో మార్పులు చోటు చేసుకొన్నాయి. ఇ-మెయిల్ మ‌రియు ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్లు 90వ ద‌శకంలో ఒక కొత్త విప్ల‌వాన్ని తీసుకువ‌చ్చాయి. అటు త‌రువాత సోష‌ల్ మీడియా రంగ ప్ర‌వేశం చేసింది; స‌మాచారాన్ని నిల్వ చేసేందుకు మ‌రియు కమ్యూనికేష‌న్ కోసం మొబైల్ ఫోన్ ఓ ముఖ్య‌మైన వాహ‌కం అయి కూర్చొంది. ఇంట‌ర్‌నెట్ ఆఫ్ థింగ్స్ మరియు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ల వంటివి ప్ర‌స్తుతం స‌ర్వ సాధార‌ణం అయిపోయాయి. మార్పు అనేది కొన‌సాగుతూ ఉంటుంద‌ని, బ‌హుశా ఇప్పుడు ఇది మ‌రింత వేగంగా చోటు చేసుకొంటుంద‌ని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.

డిజిట‌ల్ డ‌మేన్ లో తెర మీదకు వ‌చ్చిన ఈ శీఘ్ర ప‌రిణామాలు భార‌త‌దేశం లో సైతం గొప్ప ప‌రివ‌ర్త‌నకు అద్దం ప‌ట్టాయి. భార‌త‌దేశం లోని ఐటి ప్ర‌తిభావంతుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ల‌భించింది. భార‌తీయ ఐటి కంపెనీలు ప్ర‌పంచంలో తమకంటూ ఒక పేరును సంపాదించుకొన్నాయి.

ఇవాళ డిజిట‌ల్ సాంకేతిక‌త ఒక గొప్ప కార్య సాధ‌కంగా అవ‌త‌రించింది. ఇది ప‌రిపాల‌న‌కు మ‌రియు సేవ‌ల అంద‌జేత‌కు రాచ మార్గాన్ని ఏర్ప‌ర‌చింది. విద్య‌ మొద‌లుకొని ఆరోగ్యం వ‌ర‌కు విస్త‌రించిన ప‌లు డ‌మేన్ ల‌లో దీటైన సేవ‌ల ల‌భ్య‌త‌కు ఇది బాటను వేసింది. అంతేకాదు, ఆర్థిక వ్య‌వ‌స్థ యొక్క మరియు వ్యాపారం యొక్క భ‌విత‌వ్యాన్ని రూపుదిద్ద‌డంలో ఇది స‌హాయ‌కారిగా కూడా ఉంది. ఇన్ని ర‌కాలుగా ఇది స‌మాజంలో త‌క్కువ సౌక‌ర్యాల‌ను అనుభ‌విస్తున్న వ‌ర్గాల వారికి మ‌రింత స‌మాన‌మైన‌ అవ‌కాశాల‌ను ప్ర‌సాదిస్తోంది. స్థూలంగా చూసిన‌ప్పుడు, ఇది ఒక సమతలమైన ప్ర‌పంచం ఆవిర్భావానికి దోహ‌దించింది. అది ఎటువంటి ప్ర‌పంచం అంటే, భార‌త‌దేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశం కూడా అభివృద్ధి చెందిన దేశాల‌తో స‌మాన స్థాయిలో పోటీ ప‌డ‌గ‌లిగే ప్ర‌పంచం అన్న మాట‌.

|

మిత్రులారా,

సాంకేతిక‌త అనేది అడ్డుగోడ‌ల‌ను తునాతున‌క‌లు చేస్తుంది. ఇది ‘‘వసుధైవ కుటుంబ‌కమ్’’ (అంటే.. జ‌గ‌మంతా ఒక ప‌రివారం)- అని బోధించే భార‌తీయ త‌త్వ‌శాస్త్రాన్ని ప్రామాణికం చేస్తున్నట్లు మేం న‌మ్ముతున్నాం. ఈ భావ‌న‌ మా పురాత‌న, స‌మ్మిళిత సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబిస్తోంది. సాంకేతిక విజ్ఞానం ద్వారా మేం ఈ భావ‌న‌కు సార్ధ‌క‌త‌ను ఇవ్వ‌గలిగాం; అలాగే, ఉత్త‌మ ప్ర‌జాస్వామిక విలువ‌ల‌కు సైతం సార్ధ‌క‌త‌ను జోడించ‌గ‌లిగాం.

భార‌త‌దేశంలో మేం సాంకేతిక విజ్ఞానం యొక్క మాన‌వీయ పార్శ్వానికి పెద్ద పీట వేస్తాం. మరి అలాగే దీనిని మేం ‘జీవ‌న స‌ర‌ళ‌త’కు మెరుగులు దిద్ద‌డానికి కూడా వినియోగిస్తాం. భార‌త ప్ర‌భుత్వం డిజిట‌ల్ ఏక్సెస్ ద్వారా సాధికారిత అనే ల‌క్ష్యానికి నిబ‌ద్ధురాలైంది. ‘‘డిజిట‌ల్ ఇండియా’’ అనేది ప్ర‌పంచంలోనే అతి పెద్ద సాంకేతిక‌త ప్ర‌ధానమైనటువంటి ప‌రివ‌ర్త‌న కార్య‌క్ర‌మం. ఈ కార్య‌క్ర‌మం మా పౌరులు డిజిట‌ల్ సేవ‌ల‌ను అందుకొనేందుకు మార్గాన్ని సుగ‌మం చేస్తోంది. మేం మొబైల్ ప‌వ‌ర్ లేదా ఎమ్‌-ప‌వ‌ర్ ను మా పౌరుల సాధికారితకై వినియోగిస్తున్నాం.

ఒక వ్య‌క్తి తాలూకు విశిష్టమైన బ‌యోమెట్రిక్ గుర్తింపు అయిన‌టువంటి ‘ఆధార్’ ను గురించి మీలో చాలా మంది ఇప్ప‌టికే తెలుసుకొనివుండి ఉంటార‌ని నేను న‌మ్ముతున్నాను. ఈ గుర్తింపును ఉప‌యోగించుకొని మా ప్ర‌జ‌ల‌ను చేంతాడు వ‌రుస‌ల బారి నుండి మ‌రియు భార‌మైన ప్ర‌క్రియ‌ల బారి నుండి విముక్తుల‌ను చేశాం. మూడు అంశాలున్నాయి: వాటిలో ఒక‌టోది, మా యొక్క జ‌న్- ధ‌న్ బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక సేవ‌ల‌ను అంద‌రికీ చేరువ చేయడం; రెండో అంశంగా ‘ఆధార్’ వేదిక‌ నిర్మాణం; మూడో అంశ‌ం మొబైల్ ఫోన్.. ఇవి అవినీతిని త‌గ్గించ‌డంలో ఎంత‌గానో సాయ‌ప‌డ్డాయి. ఈ మూడు అంశాల‌ను మేం జె.ఎ.ఎమ్ లేదా ‘జామ్’ త్ర‌యం అని పిలుచుకొంటున్నాం. స‌బ్సిడీలు వాటిని ఉద్దేశించిన వర్గాలకు మాత్రమే అందేటట్టు ‘జామ్’ త్రయం చూస్తూ, ఇంతవరకు దాదాపు 10 బిలియ‌న్ డాల‌ర్ల స్థాయిలో లీకేజీల‌ను అడ్డుకొంది.

డిజిట‌ల్ టెక్నాల‌జీ అనేది ‘‘సుల‌భ‌మైన రీతిలో జీవించ‌డాన్ని’’ సానుకూలపరచడంలో ఎంతటి ఘనమైన సమన్వయకర్తగా ఉందో కొన్ని ఉదాహ‌ర‌ణల ద్వారా మీకు వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తాను.

ఇవాళ ఒక వ్యవసాయదారు భూసార పరీక్ష ఫలితాలను తెలుసుకొనేందుకు, నిపుణుడి స‌ల‌హా తీసుకొనేందుకు, త‌న పంట‌కు మంచి ధ‌ర‌ను పొందేందుకు.. ఇలా ప‌లు ర‌కాల సేవ‌ల‌ను కేవలం ఒక బటన్ ను నొక్కినంత మాత్రాననే అందుకోగలుగుతాడు. అంటే, ఈ విధంగా డిజిట‌ల్ టెక్నాల‌జీ వ్య‌వ‌సాయ‌ సంబంధ ఆదాయం పెర‌గ‌డానికి త‌న వంతు పాటు ప‌డుతోందన్న మాట.

ఒక చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్త ప్ర‌భుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ (Government e-Marketplace) లో త‌న పేరును న‌మోదు చేసుకోవ‌డం, త‌ద్వారా వ‌స్తువుల‌ను స్ప‌ర్ధాత్మ‌క బిడ్ ద్వారా ప్ర‌భుత్వానికి స‌ర‌ఫ‌రా చేయ‌డం సాధ్యమే. అత‌డు త‌న వ్యాపారాన్ని విస్త‌రించిన కొద్దీ, ప్ర‌భుత్వ సేక‌ర‌ణ ధ‌ర‌ను త‌గ్గించేందుకు కూడా కృషి చేస్తున్నాడ‌న్న మాటే. ఇది సామ‌ర్ధ్యాన్ని పెంపొందింప జేయ‌డంతో పాటు, ప్ర‌జా ధ‌నానికి మ‌రింత అధిక విలువ‌ జతపడటానికి దోహదిస్తుంది.

పింఛ‌న్ దారులు ఇక‌ మీదట వారు జీవించి ఉన్న‌ట్లుగా రుజువు చేసుకోవ‌డం కోసం ఒక బ్యాంకు అధికారి ఎదుట హాజ‌రు కానక్కర లేదు. ఇవాళ, ఒక పెన్ష‌న‌ర్ క‌నీస స్థాయి భౌతిక ప్ర‌య‌త్నం ద్వారా అంటే ఆధార్ బ‌యోమెట్రిక్ ప్లాట్ ఫార్మ్ ను వినియోగించుకోవడం ద్వారా ఈ విధ‌మైన రుజువును సమకూర్చేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది.

ఐటి శ్రామికుల‌లో మ‌హిళ‌లు చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లో ఉన్నారు. డిజిట‌ల్ టెక్నాల‌జీ మ‌హిళ‌ల ఆధ్వ‌ర్యంలో అనేక నూత‌న సంస్థ‌లు నిర్వ‌హించబ‌డ‌డానికి బాట వేసింది. ఈ ర‌కంగా ఐటి రంగం మ‌హిళ‌లు, పురుషులు అనే తేడా లేకుండా పౌరుల సాధికారితకు త‌న వంతు తోడ్పాటును అందించింది.

భార‌త‌దేశం లోని పౌరులు న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను జ‌ర‌ప‌డం పెరుగుతోంది. ఇందుకోసం మేం ‘భార‌త్ ఇంట‌ర్ ఫేస్ ఫ‌ర్ మ‌నీ’ లేదా బిహెచ్ఐఎమ్ యాప్ (Bharat Interface for Money – or BHIM App) ను రూపొందించాం. త‌క్కువ స్థాయి న‌గ‌దుతో కూడిన మ‌రియు అవినీతి ర‌హిత స‌మాజం దిశ‌గా పురోగ‌మించేందుకు ఈ యాప్ తోడ్ప‌డుతోంది.

పాల‌న‌ను మెరుగుప‌ర‌చ‌డంలో సాంకేతిక విజ్ఞానం యొక్క శ‌క్తిని ఈ ఉదాహ‌ర‌ణ‌లు చాటి చెబుతున్నాయి.

|

మిత్రులారా,

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యాన్ని స‌మ‌న్వ‌య ప‌ర‌చ‌డం కోసం మేం డిజిట‌ల్ డ‌మేన్ ను ఉప‌యోగించుకొంటున్నాం. 2014 మే నెల‌లో మేం పాల‌న ప‌గ్గాల‌ను స్వీక‌రించిన‌ప్పుడు, చాలా మంది- మ‌రీ ముఖ్యంగా యువ‌త‌రం- వారి ఆలోచ‌న‌ల‌ను పంచుకొని, దేశం కోసం ప‌ని చేయాల‌న్న అభిమ‌తాన్ని వ్య‌క్తం చేశారు. ల‌క్ష‌లాది భార‌తీయుల మ‌స్తిష్కంలో జ‌నించిన ఆలోచ‌న‌లు భార‌త‌దేశాన్ని నూత‌న శిఖ‌రాల‌కు చేర్చ‌డంలో ఎంత‌గానో స‌హ‌క‌రించ‌గ‌ల‌వ‌న్నది మ దృఢ విశ్వ‌ాసం.

ఈ కార‌ణంగా మైగ‌వ్ (MyGov) పేరుతో పౌరుల ప్ర‌మేయం ఉండేట‌టువంటి ఒక పోర్ట‌ల్ ను మేం తీసుకువ‌చ్చాం. ఈ వేదిక పౌరుల‌కు ముఖ్య‌మైన అంశాల‌పై వారి వారి ఆలోచ‌న‌ల‌ను, అభిప్రాయాల‌ను వెల్ల‌డి చేసేందుకు వీలు క‌ల్పిస్తుంది. ఎన్నో కీల‌క‌మైన విధాన సంబంధ అంశాల‌పై మాకు వేల సంఖ్య‌లో విలువైన సూచ‌న‌లు అందాయి. ఈ రోజు వివిధ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల అధికార చిహ్నాల ఆకృతులు ‘మైగ‌వ్’ లో ప్ర‌క‌టించిన పోటీలకు స్పందనగాను మ‌రియు ప్ర‌జ‌ల నుండి వ‌చ్చినటువంటి స‌ల‌హాల ప‌ర్య‌వ‌సాన‌మే. నిజానికి ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం యొక్క ఆధికారిక యాప్ కూడా ‘మైగ‌వ్’ లో నిర్వ‌హించిన ఒక పోటీకి యువ‌త‌రం నుండి వెల్లువెత్తిన సూక్ష్మ బుద్ధి గ‌ల స‌మాధానాల నుండి రూపుదిద్దుకొన్న‌దే. సాంకేతిక విజ్ఞానం అనేది ప్ర‌జాస్వామ్యాన్ని ఎలా బ‌లోపేతం చేయ‌గ‌లుగుతుంది అన్న దానికి మైగ‌వ్ ఒక ప్ర‌ధాన‌మైన ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది.

మీకు మ‌రొక ఉదాహ‌ర‌ణను గురించి చెబుతాను. నా ప‌ద‌వీ స్వీకారానంత‌రం ముఖ్య‌మైన ప్ర‌భుత్వ ప‌థ‌కాలు మ‌రియు కార్య‌క్ర‌మాలు ప్ర‌భుత్వం ప‌నితీరులో అన‌వ‌స‌రపు అడ్డుగోడ‌ల కారణంగాను మ‌రియు శ్ర‌ద్ధ లోపించినటువంటి నిర్ణ‌యాల వ‌ల్లనూ పురోగమించలేకపోతున్నాయ‌న్న సంగ‌తిని గ్ర‌హించాను. దీనితో సైబ‌ర్ స్పేస్ ప్రాతిప‌దిక‌గా ప‌నిచేసే ఒక వేదిక‌ను మేం రూపొందించాం. దీనికి ప్రొ-యాక్టివ్ గ‌వర్నెన్స్ ఫ‌ర్ టైమ్ లీ ఇంప్లిమెంటేష‌న్ లేదా ప్ర‌గ‌తి (PRAGATI) అని పేరు పెట్టాము. ఈ ‘ప్ర‌గ‌తి’ అనే మాట‌కు హిందీ భాషలో పురోగ‌తి అనే అర్థం వస్తుంది.

ప్ర‌తి నెల ఆఖ‌రి బుధ‌వారం నాడు నేను కేంద్ర ప్రభుత్వం మ‌రియు రాష్ట్ర ప్ర‌భుత్వాల లోని ఉన్న‌తాధికారుల‌తో ‘ప్ర‌గ‌తి’ స‌మావేశం పేరిట భేటీ అవుతున్నాను. సాంకేతిక విజ్ఞానం ప్ర‌తిబంధ‌కాల‌ను ఛేదిస్తుంది. మేం మా కార్యాల‌యాల‌లోనే కూర్చొని సైబ‌ర్ వ‌ర‌ల్డ్ స‌హ‌కారంతో ముఖ్య‌మైన పాల‌న సంబంధ స‌మ‌స్య‌ల‌ను గురించి చ‌ర్చించి, వాటిని ప‌రిష్క‌రిస్తున్నాం. ‘ప్ర‌గ‌తి’ స‌మావేశాలు దేశ ప్ర‌జ‌ల విశాల హితాన్ని దృష్టిలో పెట్టుకొని ఏకాభిప్రాయం ద్వారా త్వ‌రిత‌గ‌తిన నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి అండ‌గా నిలచాయ‌ని మీకు తెలియ‌జేయ‌డం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. కాల‌యాప‌న‌కు లోనైన కోట్లాది డాల‌ర్ల విలువైన అవ‌స్థాప‌న ప్రాజెక్టుల‌ను గురించి ‘ప్ర‌గ‌తి’ ఆరాలు తీసి, వాటిని గాడిన‌ పెట్ట‌గ‌లిగింది.

స్వ‌యంగా నేను కూడా Narendra Modi Mobile App ద్వారా ఎంతో కొంత ప్ర‌య‌త్నం చేశాను. ఈ యాప్ దేశ ప్ర‌జ‌ల‌తో నా అనుసంధానాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు మెరుగుప‌రుస్తోంది. ఈ యాప్ లో నాకు అందే సూచ‌న‌లు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటున్నాయి.

ఇవాళ, ఉమంగ్ (UMANG) మొబైల్ యాప్ ను మేం ప్రారంభించాము. ఇది 100కు పైగా పౌర ప్ర‌ధానమైనటువంటి సేవ‌ల‌ను అంద‌జేయ‌గ‌లుగుతుంది. బ్యాక్- ఎండ్ లో, ఈ విధ‌మైన సేవ‌ల‌ను కేంద్ర ప్రభుత్వం మ‌రియు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ లోని అనేక వేరు వేరు విభాగాలు అంద‌జేస్తాయి. ఈ స‌మీకృత వైఖ‌రి ఈ విభాగాల ప‌నితీరుకు ‘పియ‌ర్ పెర్‌ఫార్మెన్స్ ప్రెజర్‌’ అనే ఒక ఆటోమేటిక్ లేయర్ ను జోడించగలుగుతుంది.

|

మిత్రులారా,

మేం మా యొక్క అనుభ‌వాల‌ను మ‌రియు విజ‌య గాథ‌ల‌ను ప్ర‌పంచ స‌ముదాయంతో పంచుకోవ‌డానికి ఆనందిస్తున్నాం. మ‌రో వైపు భార‌త‌దేశం డిజిట‌ల్ టెక్నాల‌జీని ఉప‌యోగించుకొని విద్య మ‌రియు ఆరోగ్యం రంగాల‌లో కొత్త కొత్త ప‌రిష్కారాల‌ను మ‌రియు సాధించ‌ద‌గిన‌ న‌మూనాల‌ను అన్వేషించాల‌ని భార‌త‌దేశం ఆతృత‌తో ఉంది. దివ్యాంగ జనుల కోసం ఉప‌యోగ‌ప‌డే ఒక సాధ‌నంగా సైబ‌ర్ స్పేస్ ను వినియోగించుకోవాల‌ని మేం కోరుకొంటున్నాం. ఇటీవ‌ల 36 గంట‌ల పాటు సాగిన హ్యాక‌థ‌న్ లో క‌ళాశాల విద్యార్థులు పాలుపంచుకొని సుదీర్ఘ కాలంగా అటక మీదే ఉండిపోయిన స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గాల‌ను సూచించారు; ఆ పరిష్కార మార్గాలను ఆయా మంత్రిత్వ శాఖ‌ల దృష్టికి తీసుకువెళ్ళ‌డం జ‌రిగింది. ప్ర‌పంచ దేశాల అనుభ‌వాల నుండి మ‌రియు ఉత్త‌మ‌మైన అభ్యాసాల నుండి పాఠాలు నేర్చుకోవాల‌ని మేం ఎదురుచూస్తున్నాం. మ‌నమంతా క‌లసి ఎదిగిన‌ప్పుడే, వృద్ధి చోటు చేసుకోగలదని మా విశ్వాసం.

న‌వ‌క‌ల్ప‌న‌కు సైబ‌ర్ స్పేస్ ఒక కీల‌క‌మైన క్షేత్రంగా ఉంటుంది. మా దేశంలోని స్టార్ట్-అప్ లు ఇవాళ సామాన్య ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాల‌ను అందించాల‌ని ప్ర‌యత్నిస్తున్నాయి. ప్ర‌జ‌ల జీవితాల‌లో మెరుగుద‌ల తీసుకురావాల‌ని అవి చూస్తున్నాయి. భార‌త‌దేశ స్టార్ట్-అప్ ల రాశికి ఉన్న అనంత శక్తిసామర్థ్యాలను ప్ర‌పంచ పెట్టుబ‌డి స‌ముదాయం గుర్తించి ముంద‌డుగు వేస్తుంద‌న్న న‌మ్మ‌కం నాకుంది. ఈ రంగంలో పెట్టుబ‌డి పెట్ట‌వ‌ల‌సిందిగాను, మ‌రియు భార‌త స్టార్ట్-అప్ ల విజ‌య గాథ‌లో భాగం పంచుకోవ‌ల‌సిందిగాను మిమ్మ‌ల్ని నేను ఆహ్వానిస్తున్నాను.

మిత్రులారా,

ఇంట‌ర్ నెట్ అనేది స్వాభావికంగా స‌మ్మిళిత‌మైన మాధ్య‌మం. అంతేగాని ఇది స్వీయ‌మైన‌ది కాదు. ఇది ల‌భ్య‌త‌ను సమంగా అందజేస్తుంది; సమానావ‌కాశాల‌నూ ఇవ్వజూపుతుంది. ఇవాళ ఫేస్ బుక్‌, ట్విట‌ర్‌, ఇంకా ఇన్‌స్టాగ్రామ్ ల‌ను వాడుతున్న వారే లోకం పోక‌డ‌ను తీర్చిదిద్దుతున్నారు. సైబ‌ర్ స్పేస్ ను అందరికీ భాగం ఉండేట‌ట్లుగా సామాజిక మాధ్య‌మాల వేదిక‌లు త‌యారు చేస్తున్నాయి. స్టుడియోల నుండి నిపుణులు మ‌న‌కు అందించే వార్త‌లకు సోష‌ల్ మీడియా లోని అనుభూతులు పూర‌కంగా ఉంటున్నాయి. ఈ ప‌రివ‌ర్త‌న సైబ‌ర్ వ‌ర‌ల్డ్ చలవే. యువ‌తీయువ‌కులు వారి సృజ‌నాత్మ‌క‌త‌ను, శ‌క్తియుక్తుల‌ను చాటి చెప్ప‌డానికి- అది ఒక అంత‌ర్ దృష్టితో కూడిన బ్లాగ్ కావ‌చ్చు, ఒక వీనుల‌విందైన సంగీత ఆలాప‌న కావ‌చ్చు, కళాకృతి కావ‌చ్చు, లేదా ఒక రంగ‌స్థ‌లం కావ‌చ్చు.. వీటికి ఆకాశమే హద్దు- ఆద‌ర్శ‌ప్రాయ‌ వేదిక‌గా ఇంట‌ర్ నెట్ త‌యారైంది.

|

మిత్రులారా,

‘‘మ‌న్నికైన అభివృద్ధి కోసం భ‌ద్ర‌మైన మ‌రియు స‌మ్మిళిత‌మైన సైబ‌ర్ స్పేస్’’.. ఇదీ ఈ స‌మావేశం యొక్క ఇతివృత్తం. మాన‌వాళికి చెందిన ఈ కీల‌క‌మైన ఆస్తిని కాపాడుకోవ‌ల‌సిన ప్రాముఖ్య‌త‌ను ఇది విడ‌మ‌ర‌చి చెబుతోంది. సైబ‌ర్ సెక్యూరిటీ అంశాన్ని విశ్వాసంతో, సంక‌ల్పంతో స‌మీపించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ప్ర‌పంచ స‌ముదాయానికి ఎంతైనా ఉంది. సైబ‌ర్ స్పేస్ టెక్నాల‌జీలు మ‌న ప్ర‌జ‌ల‌కు అధికారమిచ్చేవిగా ఉండి తీరాలి.

దాపరికం లేని మ‌రియు అంద‌రికీ అందుబాటులో ఉండే ఇంట‌ర్ నెట్ కోసం సాగే అన్వేష‌ణ త‌ర‌చుగా దాడికి దారితీయ‌వ‌చ్చు. వెబ్‌సైట్ ల హ్యాకింగ్ మరియు వికృతీక‌ర‌ణ ఉదంతాలు మంచుకొండ కు కొన వంటివి మాత్ర‌మే. అవి సైబ‌ర్ ఎటాక్స్ ఒక ప్ర‌బల‌మైన బెద‌రింపు అనే సంగతిని సూచిస్తున్నాయి. మ‌న స‌మాజంలోని దుర్భ‌ల వ‌ర్గాలు సైబ‌ర్ క్రిమిన‌ల్స్ యొక్క దురాగ‌తాలకు బ‌లి కాకుండా మ‌నం జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌సిన ఆవ‌శ్య‌క‌త ఉంది. సైబ‌ర్ సెక్యూరిటీ స‌మ‌స్య‌ల ప‌ట్ల అప్ర‌మ‌త్త‌త అనేది ఒక జీవన విధానంగా మారాలి.

సైబ‌ర్ థ్రెట్స్ కు ఎదురొడ్డ‌డానికి స‌ర్వ స‌మ‌ర్థులైన, ద‌క్ష‌త క‌లిగిన నిపుణులకు శిక్ష‌ణ‌ను ఇవ్వ‌డం అనేది మ‌నం శ్ర‌ద్ధ వ‌హించవ‌ల‌సిన ప్ర‌ధాన రంగాల‌లో ఒక రంగం. సైబ‌ర్ ఎటాక్స్‌ ప‌ట్ల క‌నురెప్ప వాల్చ‌కుండా ఉండే వారే సైబ‌ర్ వారియ‌ర్లు. ‘‘హ్యాకింగ్’’ అనే మాట ఉత్తేజ‌క‌ర‌మైన‌, ఆఖ‌రికి సందేహ పూరిత‌మైన ఒక ఉన్న‌త స్వ‌రాన్ని సంతరించుకొని ఉంటే ఉండ‌వ‌చ్చు. మ‌నం సైబ‌ర్ ప్రొటెక్ష‌న్ ను యువ‌త‌కు ఒక ఆక‌ర్ష‌ణీయ‌మైన మ‌రియు లాభ‌దాయ‌క‌మైన వృత్తి మార్గంగా తీర్చిదిద్ద‌వ‌ల‌సివుంది.

సాపేక్షంగా చూసిన‌ప్పుడు, డిజిట‌ల్ క్షేత్రం ఉగ్ర‌వాదం మ‌రియు స‌మూల సంస్క‌ర‌ణ‌వాదం అనే అంధ‌కార శ‌క్తుల ఆట మైదానంగా మార‌కుండా చూసే బాధ్య‌త‌ను ప్ర‌భుత్వాలు కూడా భుజాన వేసుకోవాలి. ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతున్న బెద‌రింపుల చిత్ర ప‌టాన్ని చెరిపివేయ‌డానికి భ‌ద్ర‌త సంస్థ‌లు స‌మాచారాన్ని త‌మ‌లో తాము పంచుకొంటూ ఉండటంతో పాటు ఆ స‌మాచారాన్ని స‌మ‌న్వ‌యప‌ర‌చుకోవ‌డం కూడా అత్య‌ంత అవ‌సరం.

మ‌నం ఒక‌వైపు గోప్య‌త‌ మ‌రియు స్ప‌ష్ట‌త‌లకు, మ‌రో వైపు జాతీయ భ‌ద్ర‌త కు మ‌ధ్య స‌రి అయినటువంటి తూకాన్ని సాధించ‌గలమనే నేను భావిస్తున్నాను. మ‌న‌మందరం క‌లిస్తే, ఒక‌ ప‌క్క ప్ర‌పంచ వ్యవస్థలు మరియు దాప‌రికం లేని వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య, మ‌రియు మ‌రో పక్క దేశాల‌ వారీ న్యాయ స‌మ్మ‌త నిబంధ‌న‌ల‌కు మ‌ధ్య ఉన్నటువంటి వ్య‌త్యాసాల‌ను అధిగ‌మించ‌డం సాధ్యపడే విషయమే.

|

మిత్రులారా,

పెల్లుబుకుతున్న డిజిట‌ల్ సాంకేతిక ధోర‌ణులు మ‌న భ‌విష్య‌త్తును ఏ విధంగా ప్ర‌భావితం చేయ‌గ‌ల‌వు అన్న‌ దానిపైన మ‌నం ఇప్పుడే ఒక అంచ‌నాకు రాలేం. పార‌ద‌ర్శ‌క‌త్వానికి, గోప్య‌త‌కు, విశ్వాసానికి, ఇంకా భ‌ద్ర‌త‌కు సంబంధించిన ముఖ్య‌మైన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను రాబ‌ట్టాల్సివుంది. డిజిట‌ల్ సాంకేతిక విజ్ఞానం మాన‌వాళిని సాధికారప‌ర‌చ‌డానికి తోడ్ప‌డేట‌టువంటిదే. అది ఆ విధంగానే ఉండేలా మ‌నం జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

ఈ కార్య‌క్ర‌మంలో సంబంధిత వ‌ర్గాల‌ వారు పెద్ద సంఖ్య‌లో పాలుపంచుకోవ‌డం ఈ వేదిక ద‌క్కించుకొన్న ప్ర‌పంచ స్థాయి ఆమోదానికి ఒక నిద‌ర్శ‌నం. వివిధ దేశాలు, ప‌రిశ్ర‌మ మేధావి లోకం, పౌర స‌మాజం.. ఇవ‌న్నీ క‌లిసిక‌ట్టుగా ఒక సంఘ‌టితమైన, సాముదాయికమైన చ‌ట్రాన్ని నిర్మించే దిశ‌గా కృషి చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంది. ఈ ప‌ని చేసిన‌ప్పుడు, జీవన నాణ్య‌త‌కు మెరుగులు దిద్దేట‌టువంటి ఒక భ‌ద్ర‌మైన సైబ‌ర్ స్పేస్ త‌ప్ప‌క రూపు దాల్చ‌గ‌లుగుతుంది.

మిత్రులారా,

ఈ స‌మావేశం బ‌హుశా సభికుల హాజ‌రు ప‌రంగా చూసిన‌ప్పుడు ఈ త‌ర‌హా కార్య‌క్ర‌మాల‌లో కెల్లా అతి పెద్ద‌ది కావ‌చ్చు. పూర్వ‌రంగం లోని అన్ని అంశాలతో పాటు లాజిస్టిక్స్ ను డిజిట‌ల్ మాధ్య‌మం ద్వారా నిర్వ‌హించిన‌ట్లు నా దృష్టికి తీసుకువ‌చ్చారు. ప్ర‌పంచం న‌లుమూల‌ల నుండి విచ్చేసిన ప్ర‌తినిధులు దీనిని ఒక సాఫీగా సాగేట‌టువంటి మ‌రియు అంత‌రాయాల‌కు తావులేనిటువంటి అనుభూతిని పొందుతార‌ని నేను ఆశిస్తున్నాను.

మీ చ‌ర్చోప‌చ‌ర్చ‌లు నిర్మాణాత్మ‌కంగా సాగి ఫ‌ల‌ప్ర‌ద‌మైన ఫ‌లితాలను అందిస్తాయ‌ని ఆశిస్తూ, నేను నా ప్ర‌సంగాన్ని ముగిస్తున్నాను. మ‌రొక్క‌మారు మీకు నేను స్వాగ‌తం ప‌లుకుతూ, ఈ స‌మావేశం జ‌య‌ప్ర‌దం కావాల‌ని అభిల‌షిస్తున్నాను.

మీ కంద‌రికీ నా ధ‌న్య‌వాదాలు.

|

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PM Modi urges states to unite as ‘Team India’ for growth and development by 2047

Media Coverage

PM Modi urges states to unite as ‘Team India’ for growth and development by 2047
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 మే 2025
May 25, 2025

Courage, Culture, and Cleanliness: PM Modi’s Mann Ki Baat’s Blueprint for India’s Future

Citizens Appreciate PM Modi’s Achievements From Food Security to Global Power