QuoteIndia has provided medicines to more than 150 countries during this time of Covid: PM Modi
QuoteIndia has remained firm in its commitment to work under the SCO as per the principles laid down in the SCO Charter: PM Modi
QuoteIt is unfortunate that repeated attempts are being made to unnecessarily bring bilateral issues into the SCO agenda, which violate the SCO Charter and Shanghai Spirit: PM

దేశాధినేతల ఎస్.సి.ఓ. మండలి 20వ శిఖరాగ్ర సమావేశం 2020 నవంబర్, 10వ తేదీన వీడియో కాన్ఫరెన్సు విధానంలో జరిగింది. ఈ సమావేశానికి రష్యా సమాఖ్య అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షత వహించారు.  భారత ప్రతినిధి బృందానికి ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు.  ఇతర ఎస్.సి.ఓ. సభ్య దేశాలకు ఆయా దేశాల అధ్యక్షులు ప్రాతినిధ్యం వహించగా, భారత, పాకిస్తాన్ దేశాలు ప్రధానమంత్రి స్థాయిలో ప్రాతినిధ్యం వహించాయి. ఈ సదస్సులో – ఎస్.సి.ఓ. సచివాలయం సెక్రటరీ జనరల్; ఎస్.సి.ఓ ప్రాంతీయ తీవ్రవాద నిరోధక బృందం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్; ఎస్.సి.ఓ. ఎస్.సి.ఓ. కి పరిశీలకులుగా ఉన్న నాలుగు దేశాల (ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్, మంగోలియా) అధ్యక్షులు పాల్గొన్నారు.

ఇది, వర్చువల్ విధానంలో జరిగిన మొదటి ఎస్.సి.ఓ. సదస్సు కాగా, 2017 లో పూర్తి సభ్యత్వం పొందిన తరువాత భారతదేశం పాల్గొన్న మూడవ సమావేశం.  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ఎస్.సి.ఓ. నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి కారణంగా సవాళ్లు, అవరోధాలు , ఎదురైనప్పటికీ ఈ సమావేశాన్ని నిర్వహించినందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను అభినందించారు.   

మహమ్మారి అనంతరం సామాజిక, ఆర్ధిక ప్రభావాలతో బాధపడుతున్న ప్రపంచం యొక్క ఆశలను తీర్చడానికి సంస్కరించబడిన బహుపాక్షికత యొక్క ఆవశ్యకతను ప్రధానమంత్రి  తన ప్రసంగంలో ప్రముఖంగా పేర్కొన్నారు.  యు.ఎన్.‌ఎస్.‌సి. లో తాత్కాలిక సభ్య దేశంగా ఉన్న భారతదేశం, ప్రపంచ పాలనలో కావాల్సిన మార్పులను తీసుకురావడానికి ‘సంస్కరించబడిన బహుపాక్షికత’ అనే అంశంపై,  2021 జనవరి, 1వ తేదీ నుండి  ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. 

ప్రాంతీయ శాంతి, భద్రత, శ్రేయస్సుపై భారతదేశం యొక్క దృఢమైన నమ్మకాన్ని మరియు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, అక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్ ల ‌పై ప్రతిఘటనను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.  మహమ్మారి సమయంలో భారత దేశ వీర సైనికులు సుమారు 50 ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక కార్యక్రమాలలో పాల్గొన్నారనీ, మహమ్మారి సమయంలో భారతదేశ ఫార్మా పరిశ్రమ 150 కి పైగా దేశాలకు అవసరమైన మందులను సరఫరా చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  

ఎస్.సి.ఓ. ప్రాంతంతో భారతదేశానికి ఉన్న బలమైన సాంస్కృతిక, చారిత్రక సంబంధాల గురించి ప్రధానమంత్రి ఈ సందర్భంగా నొక్కిచెప్పారు.  అలాగే, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్, చాబహార్ పోర్ట్ మరియు అష్గాబాట్ ఒప్పందం వంటి కార్యక్రమాలతో ఈ ప్రాంతంలో అనుసంధానతను బలోపేతం చేయడంలో భారతదేశం యొక్క దృఢమైన నిబద్ధతను కూడా ఆయన  పునరుద్ఘాటించారు.   2021 లో ఎస్.సి.ఓ. 20వ వార్షికోత్సవాన్ని "ఎస్.సి.ఓ. సంస్కృతి సంవత్సరం (ఎస్.సి.ఓ. ఇయర్ ఆఫ్ కల్చర్)" గా పాటించటానికి ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది భారతదేశంలో ఎస్.సి.ఓ. ఫుడ్ ఫెస్టివల్, "బౌద్ధ వారసత్వం" పై నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియా నిర్వహించబోయే  మొదటి ఎస్.సి.ఓ. ప్రదర్శనతో, పది ప్రాంతీయ భాషా సాహిత్య రచనలను రష్యా, చైనా భాషలలోకి అనువదించడం వంటి భారతదేశం యొక్క స్వంత కార్యక్రమాల గురించి కూడా ఆయన తెలియజేశారు.   

2020 నవంబర్, 30 వ తేదీన వర్చువల్ విధానంలో నిర్వహించే, ఎస్.సి.ఓ. ప్రభుత్వ అధిపతుల మండలి తదుపరి సాధారణ సమావేశానికి ఆతిధ్య మివ్వడానికి భారతదేశ సంసిద్ధతను ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. ఎస్.సి.ఓ. పరిధిలో ఆవిష్కరణలు, అంకురసంస్థలపై ఒక ప్రత్యేక కార్యాచరణ బృందాన్నీ, సంప్రదాయ వైద్యంపై ఒక ఉప బృందాన్నీ ఏర్పాటు చేయాలని కూడా భారతదేశం ప్రతిపాదించింది.  మహమ్మారి అనంతర ప్రపంచంలో "ఆత్మ నిర్భర్ భారత్" (స్వావలంబన భారతదేశం) గురించి భారతదేశం యొక్క దృష్టిని ఆయన వివరించారు.  ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, అదేవిధంగా ఎస్.సి.ఓ. ప్రాంత ఆర్ధిక పురోగతికి కూడా ఇది  శక్తి గుణకంగా నిరూపించగలదని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  

వచ్చే ఏడాది ఎస్.సి.ఓ. కు చైర్మన్ పదవిని చేపడుతున్నందుకు, తజికిస్తాన్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఎమోమలీ రెహమాన్ ను ప్రధానమంత్రి అభినందించారు.  భారతదేశం నుండి పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

Click here to read PM's speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Bharat Tex showcases India's cultural diversity through traditional garments: PM Modi

Media Coverage

Bharat Tex showcases India's cultural diversity through traditional garments: PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16ఫెబ్రవరి 2025
February 16, 2025

Appreciation for PM Modi’s Steps for Transformative Governance and Administrative Simplification