The thoughts and ideals of Bapu have the power to help us overcome the menace of terrorism and climate change, two challenges humanity faces in these times: PM
Through his lifestyle, Bapu showed what living in harmony with nature is: PM Modi

 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు సియోల్ లోని యోన్‌సేయీ విశ్వ‌విద్యాల‌యం లో మహాత్మ గాంధీ ప్రతిమ ను ఆవిష్క‌రించారు.

ఈ కార్య‌క్ర‌మాని కి రిప‌బ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షులు మాన్య‌ శ్రీ మూన్ జే-ఇన్, రిప‌బ్లిక్ ఆఫ్ కొరియా ప్ర‌థ‌మ మ‌హిళ శ్రీ‌మ‌తి కిమ్ జూంగ్-సూక్, ఐక్య‌ రాజ్య స‌మితి పూర్వ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ శ్రీ బాన్ కీ-మూన్ లు హాజ‌ర‌య్యారు.

 

ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, యోన్‌సేయీ యూనివ‌ర్సిటీ లో బాపూ ప్ర‌తిమ ను ఆవిష్క‌రించ‌డం ఒక గౌర‌వ‌ం అని అభివ‌ర్ణించారు.

మనం బాపూ 150వ జ‌యంతి ని జ‌రుపుకొంటున్న త‌రుణం లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకోవడం మ‌రింత ప్ర‌త్యేక‌ం అని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

ప్ర‌స్తుత కాలం లో మాన‌వాళి ఎదుర్కొంటున్న రెండు అతి పెద్ద స‌వాళ్ళు.. ఉగ్ర‌వాద భూతం మ‌రియు జ‌ల‌, వాయు ప‌రివ‌ర్త‌న.. ను అధిగ‌మించ‌డం లో మ‌న‌కు స‌హాయకారి కాగ‌ల శ‌క్తి బాపూ ఆలోచనలు మ‌రియు సిద్ధాంతాలలో ఉందని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

ప్ర‌కృతి తో సామ‌ర‌స్యాన్ని కలిగివుంటూ క‌ర్బ‌న పాద ముద్ర ను ఏ విధం గా క‌నీస స్థాయి కి చేర్చవ‌చ్చునో బాపూ త‌న జీవ‌న శైలి ద్వారా నిరూపించార‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. భావి త‌రాల వారి కోసం ఒక స్వచ్ఛమైనటువంటి మ‌రియు ప‌చ్చ‌ద‌నం తో కూడినటువంటి ధరణి ని అందించ‌డం ముఖ్య‌మ‌ని కూడా ఆయ‌న మనకు బోధించార‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

యోన్‌సేయీ విశ్వ‌విద్యాల‌యం ద‌క్షిణ కొరియా లోని అత్యంత ప్ర‌సిద్ధ విశ్వ‌విద్యాల‌యాల స‌ర‌స‌న నిలుస్తోంది.

ప్రపంచ శాంతి కి ఒక ప్రతీక రూపం లో మ‌హాత్మ గాంధీ కి ద‌క్షిణ కొరియా లో పూజ‌నీయ స్థానాన్ని ఇస్తున్నారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"