Quote#AmbedkarJayanti: PM Modi to visit Nagpur, visit Deekhshabhoomi, launch development initiatives
QuoteWe are unwavering in our efforts towards creating a strong, prosperous and inclusive India of Dr. Ambedkar’s dreams: PM Modi

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు అంబేడ్కర్ జయంతి సందర్భంగా నాగ్ పూర్ ను సందర్శించనున్నారు.

“చాలా ప్రత్యేకమైనటువంటి అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని, రేపు నాగ్ పూర్ ను సందర్శించడం నాకు దక్కిన అమితమైన గౌరవంగా భావిస్తున్నాను.

నాగ్ పూర్ లో డాక్టర్ అంబేడ్కర్ తో అత్యంత సన్నిహిత సంబంధం కలిగివున్న పావన ప్రదేశమైన దీక్ష‌ాభూమి లో నేను ప్రార్థనలలో పాల్గొనబోతున్నాను.

ప్రజా జీవనాన్ని సానుకూలంగా ప్రభావితం చేయగల పలు అభివృద్ధి పథకాలు నాగ్ పూర్ లో రేపు ప్రారంభం కానున్నాయి.

ఈ అభివృద్ధి పథకాలలో ఐఐఐటి, ఐఐఎమ్, ఎఐఐఎమ్ఎస్ లతో పాటు, కోరాడీ థర్మల్ పవర్ స్టేషన్ కూడా ఉన్నాయి. నేను ఒక బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నాను కూడా.

డిజిధన్ మేళా సమాప్తి అయ్యే కార్యక్రమంలో నేను పాల్గొని ‘లకీ గ్రాహన్ యోజన’ మరియు ‘డిజిధన్ వ్యాపార్ యోజన’లలో మెగా డ్రా విజేతలకు పురస్కారాలను ప్రదానం చేస్తాను.

డాక్టర్ అంబేడ్కర్ కలలు గన్న బలమైన, వర్ధిల్లుతున్న మరియు అన్ని వర్గాలను కలుపుకొనివెళ్లే భారతదేశాన్ని ఆవిష్కరించే దిశగా జరుపుతున్న ప్రయత్నాలలో మేం దృఢంగా ఉన్నాము” అని ప్రధాన మంత్రి తన ట్విటర్ ఖాతాలో వరుసగా రాసిన ట్వీట్ సందేశాలలో వివరించారు.

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Data centres to attract ₹1.6-trn investment in next five years: Report

Media Coverage

Data centres to attract ₹1.6-trn investment in next five years: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 10 జూలై 2025
July 10, 2025

From Gaganyaan to UPI – PM Modi’s India Redefines Global Innovation and Cooperation