PM releases the book "President Pranab Mukherjee - A Statesman" at Rashtrapati Bhavan

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని, ‘‘ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ - ఎ స్టేట్స్ మన్’’ పేరుతో వచ్చిన ఒక ఫోటో బుక్ ను ఆవిష్కరించారు. ఆ పుస్తకం తాలూకు తొలి ప్రతిని రాష్ట్రపతికి ఆయన అందజేశారు. 

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, తన దృష్టిలో మనం ఒక సమాజంగా చరిత్ర పట్ల అవగాహనను మరింతగా పెంచుకోగలమని, మన చరిత్ర యొక్క అంశాలను మరింత బాగా పరిరక్షించుకోగలమనిపిస్తోందన్నారు. 

రాష్ట్రపతిగా పనిచేయడం ప్రోటోకాల్ కన్నా ఎంతో మిన్న అయిన విషయమని శ్రీ మోదీ చెప్పారు. ఈ పుస్తకంలోని ఛాయాచిత్రాల ద్వారా మనం మన రాష్ట్ర పతి లోని మానవీయ పార్శ్వాన్ని చూడగలుగుతామని, ఇది మనకెంతో గర్వకారణమని ప్రధాన మంత్రి అన్నారు. 

మహాత్మ గాంధీ గారి రెండు ఛాయాచిత్రాలలో ఒకదానిలో ఆయన చీపురును పట్టుకొని వున్నారని, మరొక దానిలో సూక్ష్మదర్శినిలో నుండి ఏదో చూస్తూవున్నారని, ఆయన ఎంతటి భిన్నమైన వ్యక్తిత్వాన్ని కలిగివున్నవారో ఈ రెండు ఫోటోలు సూచిస్తున్నాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. 

వార్తాపత్రికలు ఏ నాయకుడి గురించైనా కొన్ని అంశాలను చూపిస్తాయని, కానీ పత్రికలలో ప్రచురితమైనవి కాకుండా మరిన్ని అంశాలు ఒక నాయకుడిలో ఉంటాయని ప్రధాన మంత్రి వివరించారు.

శ్రీ ప్రణబ్ ముఖర్జీతో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించడం తనకు దక్కిన విశేషాధికారం అని శ్రీ మోదీ అన్నారు. తన అనుభవాలను ఆయన గుర్తుకుతెచ్చుకొంటూ, అనేక సార్లు తాను ఎంతో వ్యత్యాసం కలిగిన నాయకులతోను, కార్యకర్తలతోను పనిచేసినట్లు వెల్లడించారు. తాను ఢిల్లీకి వచ్చినప్పుడు తనకు మార్గదర్శకత్వం వహించడానికి ‘‘ప్రణబ్ దా’’ వంటి ఒకరు లభించారన్న సంగతిని తాను ఎన్నటికీ మరువలేనని ఆయన అన్నారు. రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ తనకు ఒక తండ్రి వలె దారిని చూపారని ఆయన తెలిపారు. తగినంత విశ్రాంతి తీసుకోమని కూడా రాష్ట్రపతి చెప్పేవారు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండని సూచించే వారు అని శ్రీ మోదీ వివరించారు. 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 జనవరి 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones