QuotePM Modi dedicates multiple development projects worth Rs. 22,000 crores in Bhilai, Chhattisgarh
QuoteThe expansion of Bhilai Steel Plant will further strengthen the foundation of a New India: PM Modi
QuoteContinuous efforts are being made to enhance water, land and air connectivity: PM Modi
QuoteUnder UDAN Yojana, we are opening new airports at places where the previous government even refrained to construct roads: PM
QuoteNaya Raipur is now the country’s first Greenfield Smart City; be it electricity, water or transport, everything will be controlled from a single command centre: PM Modi
QuoteDevelopment is necessary to eliminate any kind of violence: PM Modi

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఛ‌త్తీస్ గ‌ఢ్ లో ఈ రోజు ప‌ర్య‌టించారు. న‌యా రాయ్ పుర్ స్మార్ట్ సిటీ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంట‌ర్ ను ఆయ‌న ప్రారంభించారు. ఈ సందర్భంగా క‌మాండ్ అండ్ కంట్రోల్ సెంట‌ర్ తాలూకు వివిధ అంశాల‌ను అధికారులు ఆయ‌నకు వివరించారు.

|

ఆ త‌రువాత భిలాయి ఉక్కు క‌ర్మాగారం లో ఎనిమిదో బ్లాస్ట్ ఫ‌ర్నెస్ ను ఆయ‌న ప్రారంభించారు. ఆయ‌న‌కు క‌ర్మాగారం యొక్క వివిధ అంశాల‌ను గురించి అధికారులు తెలియజేశారు. ప్ర‌ధాన మంత్రి కి అభినంద‌న‌లు తెలియ‌జేయ‌డం కోసం ప్ర‌జ‌లు భిలాయి వీధుల‌లో బారులు తీరారు.

ఒక పెద్ద జ‌న స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి పాలుపంచుకొని, ఆధునికీక‌రించిన మ‌రియు విస్త‌రించిన‌టువంటి భిలాయి ఉక్కు క‌ర్మాగారాన్ని దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. ఐఐటి భిలాయి కి ఆయ‌న పునాది రాయి ని వేశారు. అలాగే, భార‌త్ నెట్ యొక్క రెండో ద‌శ కు ప్రారంభ సూచ‌కంగా ఒక ఫ‌ల‌కాన్ని కూడా ఆయ‌న ఆవిష్క‌రించారు. జ‌గ్ ద‌ల్ పుర్ మ‌రియు రాయ్ పుర్ ల మ‌ధ్య గ‌గ‌న‌త‌ల సేవ‌ల‌ను ప్ర‌ధాన మంత్రి ప్రారంభించారు. వివిధ ప‌థ‌కాల‌లో భాగంగా ల్యాప్‌టాప్ ల‌ను, ధ్రువప‌త్రాల‌ను, ఇంకా చెక్కులు త‌దిత‌ర ప‌త్రాల‌ను ల‌బ్దిదారుల‌కు ఆయ‌న అందజేశారు.

|

ప్ర‌ధాన మంత్రి జ‌న స‌భ లో ప్రసంగిస్తూ, అన్ని రకాలైనటువంటి హింస‌ కు అత్యుత్త‌మ‌ స‌మాధాన‌ం అభివృద్ధే అని స్ప‌ష్టం చేశారు.

భిలాయి ఉక్కు క‌ర్మాగారం జాతి నిర్మాణానికి ఎంత‌గానో తోడ్పాటును అందించింద‌ని ఆయ‌న అన్నారు. ‘న్యూ ఇండియా’ నిర్మాణానికి ఒక బ‌ల‌మైన పునాది ని స‌మ‌కూర్చ‌డంలో ఆధునికీక‌రించిన మ‌రియు విస్త‌రించిన‌టువంటి ఈ క‌ర్మాగారం త‌న వంతు పాత్ర‌ను పోషించ‌గ‌లుగుతుంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ రోజు ప్రారంభించిన ఇత‌ర అభివృద్ధి ప‌థ‌కాలు అందించగలిగిన ప్రయోజనాల‌ను గురించి కూడా ఆయ‌న ఏకరువు పెట్టారు.

|

గ‌త రెండు నెల‌ల్లో గ్రామ్ స్వ‌రాజ్ అభియాన్ ఎంతో స‌కారాత్మ‌క‌ ప్ర‌భావాన్ని చూపినట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు. ఈ ఉద్య‌మం 115 మ‌హ‌త్వాకాంక్ష భ‌రిత జిల్లాలలో ముమ్మ‌రంగా సాగుతోంద‌ని, వాటిలో 12 జిల్లాలు ఛ‌త్తీస్ గ‌ఢ్ లోనివే అని ఆయ‌న గుర్తు చేశారు. జ‌న్ ధ‌న్ యోజ‌న, ముద్ర యోజ‌న‌, ఉజ్జ్వ‌ల యోజ‌న‌, ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌, ఇంకా సౌభాగ్య వంటి ప‌థ‌కాలు రాష్ట్రానికి అందించినటువంటి లాభాన్ని గురించి ఆయ‌న వ‌ల్లించారు.

|

ఆదివాసి జ‌నాభా యొక్క మేలు ను దృష్టిలో పెట్టుకొని అట‌వీ హ‌క్కుల చ‌ట్టాన్ని ఖ‌చ్చితంగా అమ‌లు చేయ‌డం జ‌రుగుతోంద‌ని శ్రీ న‌రేంద్ర‌ మోదీ చెప్పారు. ప్ర‌భుత్వం ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేస్తోంద‌ంటూ, ఏక‌లవ్య విద్యాల‌యాల‌ను దేశ‌వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జ‌రుగుతోంద‌ని ఆయ‌న అన్నారు.

|
|

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read PM's speech

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Maratha bastion in Tamil heartland: Gingee fort’s rise to Unesco glory

Media Coverage

Maratha bastion in Tamil heartland: Gingee fort’s rise to Unesco glory
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 జూలై 2025
July 21, 2025

Green, Connected and Proud PM Modi’s Multifaceted Revolution for a New India