ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీ న న్యూ ఢిల్లీ లోని తాల్కటోరా స్టేడియమ్ లో సిఆర్ఇడిఎఐ యూత్ కాన్-19 ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని కాన్ఫెడరేశన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డివెలపర్స్ అసోసియేశన్ ఆఫ్ ఇండియా (సిఆర్ఇడిఎఐ- క్రెడాయ్) నిర్వహిస్తోంది.
సిఆర్ఇడిఎఐ ఏర్పాటు చేసిన ప్రదర్శన ను కూడా ప్రధాన మంత్రి సందర్శించనున్నారు.
భారతదేశం లో స్థిరాస్తి పరిశ్రమ భవిష్యత్తు ను దృష్టి లో పెట్టుకొని సిఆర్ఇడిఎఐ ప్రతి ఏటా యువజన సదస్సు ను యూత్కాన్ పేరిట నిర్వహిస్తూ వస్తోంది.
భారతదేశం లో 200కు పైగా నగరాల కు చెందిన స్థిరాస్తి అభివృద్ధిదారు సంస్థల కు ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వోన్నత సంఘమైనటువంటి సిఆర్ఇడిఎఐ ని 1999వ సంవత్సరం లో స్థాపించడమైంది.