యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు మాన్య శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.
అధ్యక్షుడు శ్రీ బైడెన్ కు ప్రధాన మంత్రి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ బైడెన్ పదవీ కాలం చక్కగా సాగాలని కోరుకొంటూ, భారతదేశం-యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయి కి తీసుకు పోవడానికి ఆయన తో సన్నిహితంగా పని చేయాలని వుందని ప్రధాన మంత్రి అన్నారు.
నేత లు ప్రాంతీయ పరిణామాల ను గురించి, విస్తృత భౌగోళిక రాజకీయాల నేపథ్యం లో సుదీర్ఘం గా చర్చించారు. భారతదేశం-యుఎస్ భాగస్వామ్యం ఉమ్మడి ప్రజాస్వామిక విలువ లు, ఉమ్మడి వ్యూహాత్మక హితాల పునాది మీద దృఢం గా నిలచివున్న సంగతి ని వారు గమనించారు. నియమావళి ని శిరసావహించే అంతర్జాతీయ వ్యవస్థ, స్వేచ్ఛాయుతమైన, అరమరికల కు తావు ఉండనటువంటి, అన్ని వర్గాల కు ప్రయోజనకరంగా నిలచే ఇండో-పసిఫిక్ ప్రాంత పరిరక్షణ కు పూచీపడడం కోసం సమానమైన ఆలోచనలు కలిగివుండే దేశాల తో కలసి కృషి చేసేందుకు ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసివుందని వారు పునరుద్ఘాటించారు.
ప్రపంచ జలవాయు పరివర్తన రువ్వుతున్న సవాలు కు కలిసికట్టుగా పరిష్కారాన్ని కనుగొనవలసిన అవసరం ఎంతయినా ఉందని ప్రధాన మంత్రి, అధ్యక్షుడు శ్రీ బైడెన్ లు సమ్మతించారు. పారిస్ ఒప్పందాని కి మరొక సారి వచనబద్ధత ను వ్యక్తం చేస్తూ అధ్యక్షుడు శ్రీ బైడెన్ తీసుకొన్న నిర్ణయాన్ని ప్రధాన మంత్రి స్వాగతించారు. నవీకరణ యోగ్య శక్తి రంగం లో భారతదేశం నిర్దేశించుకొన్న మహత్వాకాంక్షలతో కూడినటువంటి లక్ష్యాలను గురించి ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రముఖంగా ప్రకటించారు. ఈ సంవత్సరం ఏప్రిల్ లో ‘క్లయిమేట్ లీడర్స్ సమిట్’ ను నిర్వహించడానికి అధ్యక్షుడు శ్రీ బైడెన్ తీసుకొన్న చొరవ ను ప్రధాన మంత్రి స్వాగతిస్తూ, ఆ శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడానికి తాను ఎదురు చూస్తున్నానన్నారు.
డాక్టర్ జిల్ బైడెన్ తో కలసి అధ్యక్షుడు శ్రీ బైడెన్ వీలైనంత త్వరలో భారతదేశాన్ని సందర్శించవలసిందంటూ ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ఆహ్వానం పలికారు.
President @JoeBiden and I are committed to a rules-based international order. We look forward to consolidating our strategic partnership to further peace and security in the Indo-Pacific region and beyond. @POTUS
— Narendra Modi (@narendramodi) February 8, 2021