అబుదాబి యువరాజు, యు.ఎ.ఈ. సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్, గౌరవనీయులు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోను లో మాట్లాడారు.
ఈ ప్రాంతంలో కోవిడ్ మహమ్మారి ప్రభావం గురించి ఇరువురు నాయకులు చర్చించారు, ఆరోగ్య సంక్షోభం నెలకొన్న సమయంలో కూడా భారత, యు.ఎ.ఈ. దేశాల మధ్య సహకారం, ఎటువంటి అవాంతరాలు లేకుండా కొనసాగినందుకు, వారు, సంతృప్తి వ్యక్తం చేశారు.
కోవిడ్ అనంతర ప్రపంచంలో, భారత-యు.ఏ.ఈ. భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మరింత సన్నిహితంగా సంప్రదింపులు జరుపుతూ, సహకారాన్ని కొనసాగించడానికి, వారు, అంగీకరించారు. ఈ సందర్భంలో, వారు వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింత వైవిధ్య భరితంగా అమలు పరిచే అవకాశాలపై వారు చర్చలు జరిపారు.
యు.ఎ.ఈ. లో నివసిస్తున్న ప్రవాస భారతీయ సమాజ శ్రేయస్సు కోసం, గౌరవనీయులు, అబుదాబి యువరాజు, ఎల్లప్పుడూ చూపించిన వ్యక్తిగత శ్రద్ధ, సంరక్షణ పట్ల ప్రధానమంత్రి, తన ప్రత్యేక ప్రశంసలు, కృతజ్ణతలు తెలియజేశారు.
కోవిడ్ సంక్షోభాన్ని త్వరలోనే అధిగమించగలమన్న విశ్వాసాన్ని ఇరువురు నాయకులు పరస్పరం ప్రకటించుకున్నారు. సమీప భవిష్యత్తులో వ్యక్తిగతంగా కలవడానికి ఎదురు చూస్తున్నట్లు ఇరువురు నాయకులు చెప్పారు.