పార్లమెంట్ ప్రస్తుత సమావేశాలు అతి ముఖ్యమైన సమావేశాలు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. రాజ్య సభ యొక్క 250వ సమావేశం మరియు ఈ సంవత్సరం భారత రాజ్యాంగ 70వ సంవత్సరం కావడమే దీని కి కారణం అని ఆయన తెలిపారు.
నేడు పార్లమెంట్ శీత కాల సమావేశాలు ఆరంభం కావడాని కన్నా ముందు ప్రధాన మంత్రి ప్రసార మాధ్యమాల ను ఉద్దేశించి ప్రసంగించారు.
భారతదేశాన్ని పురోగతి పథం లో నిలబెట్టడం లో ప్రధాన పాత్ర ను పోషించినందుకు రాజ్య సభ ను ఆయన ప్రశంసించారు.
“మిత్రులారా, ఇవి 2019వ సంవత్సరం లో పార్లమెంట్ యొక్క చివరి సమావేశాలు. అంతేకాదు, భారతదేశం యొక్క అభివృద్ధి లోను, ప్రగతి లోను ఒక కీలక పాత్ర ను పోషించినటువంటి రాజ్య సభ యొక్క 250వ సమావేశాలు కూడా కావడం వల్ల దీని ని ఒక ముఖ్యమైన సమావేశాలు గా పరిగణించవలసివుంది.”
నవంబర్ 26వ తేదీ నాడు భారతదేశం తన 70వ రాజ్యాంగ దినాన్ని జరుపుకోనున్నది. భారతదేశ రాజ్యాంగాన్ని 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీ నాడు అంగీకరించడం జరిగింది. అంటే, ఈ సంవత్సరం లో భారత రాజ్యాంగం 70 ఏళ్ళ ను పూర్తి చేసుకొంటోందన్న మాట.’’
భారతదేశ ఏకత ను, అఖండత ను మరియు వివిధత్వాన్ని పరిరక్షించిన ఒక గొప్ప సిద్ధాంతం గా రాజ్యాంగాన్ని ప్రధాన మంత్రి అభివర్ణించారు.
“నవంబర్ 26వ తేదీ న మనం రాజ్యాంగ 70వ దినాన్ని జరుపుకోబోతున్నాం. ఆ రోజు కల్లా రాజ్యాంగాన్ని స్వీకరించి 70 ఏళ్ళు పూర్తి అవుతాయి. ఈ రాజ్యాంగం భారతదేశం యొక్క ఏకత ను, అఖండత ను మరియు వివిధత్వాన్ని నిలబెడుతున్నది. దీనిలో అంతటా భారతదేశపు శోభ ఉట్టిపడుతున్నది. మరి ఇది దేశాని కి చోదక శక్తి గా కూడా ఉంటున్నది. పార్లమెంట్ వర్తమాన సమావేశాలు మన రాజ్యాంగాని కి 70 సంవత్సరాలు అయ్యాయన్న సంగతి ని ప్రజల కు తెలియబరచే ఒక సాధనం గా నిలవాల్సివుంది.’’
ఎంపీ ల యొక్క చర్చల లో నుండి ఉత్తమమైన అభిప్రాయాల ను దేశం పొందగలిగేటట్టుగాను, తద్వారా ఆయా ఆలోచనల ను దేశ సంక్షేమం కోసం, పురోగతి కోసం వినియోగించుకోవడాని కి వీలు గాను వివిధ చర్చల లో- మునుపటి సమావేశం మాదిరి గానే సకారాత్మకం గాను మరియు క్రియాశీలం గాను- పాలు పంచుకోవలసింది గా ప్రధాన మంత్రి ఎంపీలందరి కి విజ్ఞప్తి చేశారు.
‘‘గడచిన కొద్ది రోజుల లోను మేము దాదాపు గా అన్ని పక్షాల కు చెందిన వేరు వేరు నాయకుల తో భేటీ అయ్యే అవకాశాన్ని దక్కించుకొన్నాము. మునుపటి సమావేశాల మాదిరి గానే వర్తమాన సమావేశాలు ఎంపీలందరి వద్ద నుండి సకారాత్మకమైన మరియు చురుకైన భాగస్వామ్యాన్ని పొందగలగాలి. ఇదివరకటి సమావేశాల లో మునుపు ఎరుగని కార్యసాధన లు నమోదు అయ్యాయి. ఈ కార్య సిద్ధులు ప్రభుత్వానికి గాని లేదా పాలక పక్ష సభ్యుల కు గాని చెందినవి కాదు, ఇవి యావత్తు పార్లమెంటు కు చెందినవి అని, ఈ విజయాల కు సభ్యులందరూ సిసలైన సొంతదారులు అని నేను సగర్వం గాను, బహిరంగం గాను ఒప్పుకొని తీరవలసిందే.
మరొక్క మారు ఎంపీలందరి కి వారి క్రియాశీల భాగస్వామ్యాని కి గాను నేను నా యొక్క కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను. మరి దేశ పురోగతి కోసం ప్రస్తుత సమావేశాలు కూడా పునరంకితమైన భావన తో కృషి చేస్తాయని నేను ఆశ పడుతున్నాను.
అన్ని అంశాల పట్ల చర్చ జరగాలని మేము కోరుకొంటున్నాము. మనం అనుకూలం గానో లేదా ప్రతికూలం గానో గొప్పవైనటువంటి చర్చల ను చేపట్టవలసినటువంటి అవసరం కూడా ఉంది. అది జరిగిన నాడు ఈ చర్చల లో నుండి దేశ అభ్యున్నతి కి మరియు దేశ సంక్షేమాని కి ఉపయోగపడడల ఉత్తమమైన పరిష్కార మార్గాలు వెలువడుతాయి.
సభ్యులందరి కి ఇవే నా శుభాకాంక్షలు.”