పశ్చిమ బంగాల్ లోని నోవాపాడా నుంచి ద‌క్షిణేశ్వ‌ర్ వ‌ర‌కు విస్తరించిన మెట్రో రైల్వే మార్గాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమ‌వారం నాడు ప్రారంభించ‌డం తో పాటు ఆ మార్గం లో మొద‌టి మెట్రో స‌ర్వీసు కు ప్రారంభ సూచకం గా ప‌చ్చ‌జెండా ను కూడా చూపించారు. క‌లాయీకుండా, ఝార్‌గ్రామ్ ల మ‌ధ్య మూడో మార్గాన్ని కూడా ఆయన ప్రారంభించారు.

ఈస్ట‌ర్న్ రైల్వే లో అజీమ్‌ గంజ్ నుంచి ఖ‌ర్గాఘాట్ రోడ్ సెక్ష‌న్ వ‌ర‌కు వేసిన జోడు రైలు ప‌ట్టాల ను సైతం దేశ ప్ర‌జ‌ల కు శ్రీ న‌రేంద్ర మోదీ అంకితం చేశారు. ద‌న్‌కునీ కి, బ‌రూయీపారా కు మ‌ధ్య నాలుగో లైను ను, ర‌సూల్‌ పుర్ కు, మ‌గ్ రా కు మ‌ధ్య మూడో రైలు ను కూడా దేశ ప్ర‌జ‌ల కు ఆయ‌న అంకితం చేశారు.

ఈ కార్య‌క్ర‌మం లో పాల్గొన్న ప్ర‌జ‌ల ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, ఈ రోజు న ప్రారంభించిన ప‌థ‌కాలు హుగ్ లీ చుట్టుప‌క్క‌ల ప్రాంతాలలో నివ‌సిస్తున్న ల‌క్ష‌ల కొద్దీ ప్ర‌జ‌ల జీవ‌నాన్ని స‌ర‌ళ‌త‌రం చేస్తాయ‌న్నారు. ర‌వాణా కు ఉప‌యోగ‌ప‌డే సాధ‌నాలు మెరుగైన కొద్దీ మ‌న దేశం లో స్వ‌యంస‌మృద్ధి, విశ్వాసం తాలూకు సంక‌ల్పాలు దృఢ‌త‌రం కాగ‌ల‌వన్నారు. కోల్‌కాతా తో పాటు హుగ్ లీ, హావ్‌ డా, నార్త్ 24 ప‌ర‌గ‌ణాస్ జిల్లా ల ప్ర‌జ‌లు కూడా మెట్రో స‌ర్వీసు ప్ర‌యోజ‌నాల ను అందుకొంటారని ఆయ‌న చెప్తూ, ఈ విషయమై తన సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. నోవాపాడా నుంచి ద‌క్షిణేశ్వ‌ర్ కు విస్త‌రించిన‌ మెట్రో రైల్వే ను ప్రారంభించుకోవ‌డం తో, ఈ రెండు ప్ర‌దేశాల మ‌ధ్య ప్ర‌యాణ కాలం 90 నిమిషాల నుంచి 25 నిమిషాల కు త‌గ్గిపోతుంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ స‌ర్వీసులు విద్యార్థుల కు, శ్రామికుల‌ కు ఎంత‌గానో ఉప‌యోగ‌క‌రం కాగ‌ల‌వ‌న్నారు. 

భార‌త‌దేశం లో మెట్రో లేదా రైల్వే వ్య‌వ‌స్థ‌ ల నిర్మాణం లో ఈ మ‌ధ్య కాలం లో ‘మేడ్ ఇన్ ఇండియా’ తాలూకు ప్ర‌భావం క‌నిపిస్తోంది అంటూ ప్ర‌ధాన మంత్రి సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ప‌ట్టాల ను వేయ‌డం మొద‌లుకొని, ఆధునిక రైలు బండ్ల వ‌ర‌కు, అలాగే ఆధునిక రైళ్ళు మొద‌లుకొని ఆధునిక రైలు పెట్టెలు, గూడ్స్ తో పాటు భారీ ఎత్తున వినియోగిస్తున్న సాంకేతిక‌త సైతం దేశీయం గానే త‌యార‌వుతోంద‌న్నారు. ఇది ప్రాజెక్టు అమ‌లు ను వేగ‌వంతం చేసింద‌ని, నిర్మాణం లో నాణ్య‌త‌ ను పెంచింద‌ని ఆయ‌న వివ‌రించారు.

దేశం లో స్వ‌యంస‌మృద్ధి తాలూకు ఒక ముఖ్య‌మైన కేంద్రం గా ప‌శ్చిమ బంగాల్ ఉంటూ వ‌చ్చిందని, ప‌శ్చిమ బంగాల్ కు, దేశ ఈశాన్య ప్రాంతాని కి అంత‌ర్జాతీయ వ్యాపారం తాలూకు అపార‌మైన అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ కొత్త రైలు మార్గాలు మ‌నిషి జీవ‌నాన్ని స‌ర‌ళ‌త‌రం గా మార్చుతాయ‌ని, ప‌రిశ్ర‌మ‌ల కు కూడా కొత్త మార్గాలు అందుబాటు లోకి వ‌స్తాయ‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

పూర్వ రంగం :

మెట్రో రైల్వే విస్తరణ

నోవాపాడా నుండి దక్షిణాశ్వర్ వరకు మెట్రో రైలు మార్గాన్ని పొడిగించి, ఈ భాగం లో మొదటి సర్వీసు కు పచ్చ జెండా ను చూపడం తో ఈ రెండు ప్రాంతాల నడుమ రహదారి మార్గం లో రద్దీ తగ్గడమే కాకుండా పట్టణ ప్రాంత రాక పోక లు కూడా మెరుగుపడనున్నాయి. పూర్తి గా కేంద్ర ప్రభుత్వమే సమకూర్చిన 464 కోట్ల రూపాయల మేర నిధులతో 4.1 కిలోమీటర్ల మార్గం విస్తరణ ను చేపట్టడమైంది. ఈ విస్తరణ వల్ల కాళీఘాట్, దక్షిణేశ్వర్ లలోని రెండు ప్రపంచ ప్రఖ్యాత కాళీ మందిరాల కు లక్షల కొద్దీ పర్యాటకులు, భక్తులు చేరుకోవడాన్ని సుగమం చేయనుంది. బడానగర్, దక్షిణేశ్వర్ పేరుల తో రెండు స్టేశన్ లను కొత్త గా నిర్మించి ఆ స్టేశన్ లలో ప్రయాణికులకై ఆధునిక సౌకర్యాలను కల్పించడం జరిగింది. ఆ స్టేశన్ లను కుడ్యచిత్రాలు, ఛాయాచిత్రాలు, శిల్పాలు మరియు విగ్రహాలతో అలంకరించడమైంది.

రైల్వే లైన్ ల ప్రారంభం:

కలయీకుండా, ఝార్ గ్రామ్ ల మధ్య ఆగ్నేయ రైల్వే కి చెందిన 132 కిలోమీటర్ల పొడవైన ఖడగ్ పుర్-ఆదిత్యపుర్ మూడో లైన్ ప్రాజెక్టు లో భాగం అయిన 30 కిలోమీటర్ల పొడవైన భాగానికి 1312 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో మంజూరు ను ఇవ్వడమైంది. కలయీకుండా, ఝార్ గ్రామ్ ల మధ్య నాలుగు స్టేశన్ ల ప్రస్తుత మౌలిక వసతుల నవీకరణ తో పాటు నాలుగు కొత్త స్టేశన్ భవనాలను, ఆరు కొత్త ఫుట్ బ్రిడ్జిల ను, పదకొండు కొత్త ప్లాట్ ఫార్మ్ లను కూడా నిర్మించి పునరభివృద్ధి చేయడం జరిగింది. ఇది హావ్ డా- ముంబయి ప్రధాన మార్గం లో ప్రయాణికుల రైళ్ళు, సరుకు రవాణా రైళ్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా రాక, పోకల ను సాగించేలా చూడటం లో తోడ్పడనుంది.

హావ్ డా- బర్ధమాన్ కోర్డ్ లైన్ లో దన్ కునీ, బరుయిపారా నడమ (11.28 కి.మీ. ) నాలుగో లైను, హావ్ డా - బర్ధమాన్ ప్రధాన మార్గం లో రసూల్ పుర్, మగ్ రా ల నడుమ (42.42 కి.మీ.) మూడో లైను ను ఈ రోజు న దేశ ప్రజలకు అంకితం చేయడం జరిగింది. అవి కోల్‌కాతా కు ప్రముఖ ప్రవేశ ద్వారం గా సేవలను అందించనున్నాయి. రసూల్‌ పుర్, మగ్ రా ల నడుమ మూడో లైను ను 759 కోట్ల రూపాయల వ్యయం తో వేయడమైంది. దన్ కునీ, బరూయిపారా ల నడుమ నాలుగో లైన్ ప్రాజెక్టు వ్యయం 195 కోట్ల రూపాయలు గా నిర్దేశించడమైంది.

అజీమ్‌ గంజ్ - ఖర్‌గ్రాఘాట్ రోడ్డు మార్గం డబ్లింగ్ పనులు :

తూర్పు రైల్వే కు చెందిన హావ్ డా- బందేల్ - అజీమ్ ‌గంజ్ సెక్షన్ లో ఓ భాగం అయిన అజీమ్‌ గంజ్ నుండి ఖార్‌గ్రాఘాట్ రోడ్డు భాగం డబ్లింగ్ ప్రాజెక్టు పనులను సుమారు 240 కోట్ల రూపాయలు గా నిర్దేశించడమైంది.

ఈ ప్రాజెక్టు లు కార్యకలాపాల మెరుగుదల కు, తక్కువ ప్రయాణ కాలానికి, రైలు కార్యకలాపాల తాలూకు భద్రత కు పూచీ పడడమే కాకుండా ఈ యావత్తు ప్రాంతం ఆర్థిక వృద్ధి ని కూడా పెంపొందించ గలుగుతాయి.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi