రాష్ట్రప‌తి ప్ర‌సంగాని కి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానాని కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రాజ్య స‌భ లో ఈ రోజు న స‌మాధానాన్నిచ్చారు. చ‌ర్చ లో పాలుపంచుకొని, ఆలోచ‌న‌ల‌ ను వెల్ల‌డించినందుకు ఎగువ స‌భ స‌భ్యుల కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. కీర్తి శేషుడైన రాజ్య స‌భ ఎంపి శ్రీ మ‌ద‌న్ లాల్ సైనీ కి నివాళులను కూడా ఆయ‌న అర్పించారు.

స్థిర‌త్వం ప‌ట్ల పౌరుల‌ లో ఉన్న అభిలాష ను 2019వ సంవ‌త్స‌రం లో జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల తీర్పు క‌ళ్ళ‌ కు క‌ట్టింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. స్థిర‌మైన ప్ర‌భుత్వాల‌ ను ఎన్నుకొనే ధోర‌ణి ని ప్ర‌స్తుతం వివిధ రాష్ట్రాల లో చూడవచ్చని కూడా ఆయ‌న అన్నారు.

ఇటీవ‌లి లోక్ స‌భ ఎన్నిక‌ల కాలం నాటి ఎన్నిక‌ల ప్ర‌క్రియ ను ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసిస్తూ, యావ‌త్తు ప్ర‌క్రియ యొక్క ప‌రిమాణం ఎంతో భారీ గా ఉండింద‌న్నారు. ‘ప్ర‌జాస్వామ్యం ఓడిపోయింది’ అంటూ కొంత మంది నాయ‌కులు ప్ర‌క‌ట‌న‌ చేయడం దుర‌దృష్ట‌క‌ర‌ం అని ఆయ‌న పేర్కొన్నారు. ఓట‌ర్ల వివేకాన్ని ప్ర‌శ్నించ‌వద్దంటూ స‌భ్యుల కు ఆయ‌న సూచన చేశారు. ‘‘మ‌న ప్ర‌జాస్వామ్యాన్ని మ‌రియు ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ ను గౌర‌వించ‌డం ముఖ్యం’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ఇలెక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల (ఇవిఎం) విష‌యం లో ప్ర‌శ్న‌ల‌ ను లేవ‌నెత్తడాన్ని ప్ర‌ధాన మంత్రి విమ‌ర్శించారు. పోలింగ్ కేంద్రాల‌ ను ఆక్ర‌మించుకొనేటటువంటి మ‌రియు హింస‌ కు పాల్ప‌డేటటువంటి సందర్భాల ను ఇవిఎం లు త‌గ్గించాయి అని ఆయ‌న చెప్పారు. ‘‘ప్ర‌స్తుతం, పోలింగ్ కేంద్రాల కు త‌ర‌లి వ‌చ్చిన వోట‌ర్ల సంఖ్య పెర‌గ‌డం అనేది వార్త‌ గా ఉంది. ఇది ప్ర‌జాస్వామ్యాని కి ఒక ఆరోగ్య‌క‌ర‌మైన సంకేతం’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. వివిపిఎటి లు ఇలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల విశ్వ‌స‌నీయ‌త ను మరింత ప‌టిష్ట‌ ప‌ర‌చాయ‌ని ఆయ‌న అన్నారు.

ఎన్నిక‌ల సంస్క‌ర‌ణ ల‌ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, భార‌త‌దేశం లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ ను బ‌లోపేతం చేసేందుకు ఈ సంస్క‌ర‌ణ‌ లు అత్యంత ఆవ‌శ్య‌క‌ం అన్నారు. ఈ సంద‌ర్భం లో ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ వంటి ఎన్నిక‌ల సంస్క‌ర‌ణ సంబంధిత ప్ర‌తిపాద‌న‌ల పై చ‌ర్చించ‌డం మ‌రియు త‌గిన సూచ‌న‌ల ను, స‌ల‌హాల‌ ను ఇవ్వ‌డం ముఖ్యం అని ఆయ‌న అన్నారు.

భార‌తదేశ ప్ర‌జ‌ల‌ కు మేలు చేసే విధం గా ప్ర‌క్రియ‌ల ను స‌ర‌ళ‌త‌రం చేసే దిశ గా కేంద్ర ప్ర‌భుత్వం పాటు ప‌డినట్లు ప్ర‌ధాన మంత్రి చెప్పారు. సామాన్య ప్ర‌జ‌ల కు సాధికారిత కల్పన అంశాన్ని ప్ర‌భుత్వం న‌మ్ముతోంది అని ఆయ‌న అన్నారు. దేశం లోని పౌరుల‌ కు గ్యాస్ క‌నెక్ష‌న్‌, మ‌రుగుదొడ్డి, విద్యుత్తు, ఇల్లు త‌దిత‌ర సౌకర్యాల‌ ను స‌మ‌కూర్చే దిశ గా ప్ర‌భుత్వం చేసిన కృషి ని గురించి ఆయ‌న వివ‌రించారు.

భార‌తదేశాన్ని అయిదు ట్రిలియ‌న్ డాల‌ర్ ఆర్థిక వ్య‌వ‌స్థ గా తీర్చి దిద్దే దిశ గా కృషి చేయాల‌ని, ప్ర‌తి ఒక్క‌రి కి శ్రీ మోదీ విజ్ఞ‌ప్తి చేశారు. ఈ ల‌క్ష్య సాధ‌న‌ కై ఒక స‌కారాత్మ‌క ఆలోచ‌న దృక్ప‌థం తో ప‌ని చేస్తూ సూచ‌న‌ల ను, ఆలోచ‌న‌ల ను ఇవ్వాలని రాజ‌కీయ ప‌క్షాలన్నింటి ని ఆయ‌న కోరారు.

ఝార్‌ఖండ్ లో ఇటీవ‌ల జ‌రిగిన ఘ‌ట‌న త‌న‌ ను తీవ్ర శోకాని కి లోను చేసింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. దోషుల కు దేశం లోని చ‌ట్టాల ప్ర‌కారం త‌గిన శిక్ష వేయాలి అని ఆయ‌న అన్నారు. ఒక సంఘ‌ట‌న జరిగినందుకు ఏకం గా ఓ రాష్ట్రాన్నే కించ‌ప‌ర‌చడం సరి కాదు అని ఆయ‌న చెప్పారు. హింస కు పాల్ప‌డ్డ‌ వారి పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి, ఆ త‌ర‌హా ఘ‌ట‌న‌ లన్నింటి విష‌యం లోనూ- అవి ఏ రాష్ట్రంలో జరిగిన‌ప్ప‌టి కి కూడాను- చ‌ట్ట‌ాని కి అనుగుణం గా నడచుకోవాలి అని ఆయ‌న అన్నారు.

‘ఆయుష్మాన్ భార‌త్’ ను ప‌క్కా గా అమ‌లు చేయ‌వలసిన త‌క్ష‌ణావ‌శ్య‌క‌త ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ‘‘మ‌న పేద‌లు మంచి నాణ్య‌త క‌లిగిన మ‌రియు త‌క్కువ ఖ‌ర్చు తో కూడిన రోగ చికిత్స ను అందుకోవాల‌ని మేము కోరుకుంటున్నాము’’ అని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

ఈశాన్య ప్రాంత రాష్ట్రాల తో పాటు ఆకాంక్ష‌భ‌రిత జిల్లాల అభివృద్ధి ప‌ట్ల అమిత శ్ర‌ద్ధ ను వ‌హించిన‌ట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

స‌హకారాత్మ‌క స‌మాఖ్య వాదాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ‘ప్రాంతీయ ఆకాంక్ష‌ల తో కూడిన జాతీయ అభ్యుద‌యేచ్ఛ ను క‌లిగి ఉండ‌టం ముఖ్యం’ అన్నారు.

దేశాన్ని మ‌రింత మెరుగైంది గా, బ‌ల‌వ‌త్త‌ర‌మైంది గా మ‌ల‌చ‌డం కోసం చేయ‌గ‌లిగిందంతా చేయాల‌ని పౌరుల‌ కు ప్ర‌ధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. భార‌త‌దేశాన్ని నూత‌న శిఖ‌రాల‌ కు తీసుకు పోయే దిశ గా మ‌రియు ఒక ‘న్యూ ఇండియా’ను ఆవిష్క‌రించే దిశ గా క‌ల‌సిక‌ట్టు గా ప‌ని చేయాలంటూ ప్ర‌తి ఒక్క‌రి ని ఆయ‌న కోరారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage