QuoteBudget 2021 has boosted India's self confidence: PM Modi
QuoteThis year's budget focuses on ease of living and it will spur growth: PM Modi
QuoteThis year's budget is a proactive and not a reactive budget: PM Modi

ఈ సంవ‌త్స‌రం బ‌డ్జెటు లో వాస్త‌విక‌త ఉట్టిప‌డుతున్నద‌ని, ఇది అభివృద్ధి తాలూకు విశ్వాసాన్ని, భార‌త‌దేశాని కి త‌న‌పైన త‌న‌కు ఉన్న న‌మ్మ‌కాన్ని చాటిచెప్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఈ బడ్జెటు ప్ర‌స్తుత క‌ష్ట‌ కాలం లో ప్ర‌పంచంలో ఓ కొత్త విశ్వాసాన్ని నింపుతుంది అని కూడా ఆయ‌న అన్నారు.

యూనియ‌న్ బ‌డ్జెటు ను లోక్ స‌భ లో స‌మ‌ర్పించిన త‌రువాత ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, బ‌డ్జెటు ‘ఆత్మ‌నిర్భ‌రత’ తాలూకు దార్శ‌నిక‌త‌ ను వ్య‌క్తం చేస్తోంద‌ని, దేశం లో అన్ని వ‌ర్గాల వారినీ క‌లుపుకొని వెళ్ళేదిగా ఉంద‌న్నారు.  బ‌డ్జెటు రూప‌క‌ల్ప‌న వెనుక ఉన్న సిద్ధాంతాల‌ను గురించి శ్రీ మోదీ వివ‌రిస్తూ, వృద్ధి కి కొత్త అవ‌కాశాల‌ ను క‌ల్పించ‌డం;  యువ‌త‌ కు నూత‌న అవ‌కాశాల‌ ను అందించ‌డం;  మాన‌వ వ‌న‌రులకు కొత్త పార్శ్వాన్ని జ‌త‌ చేయడం;   మౌలిక స‌దుపాయాల‌ ను అభివృద్ధిపరచడం తో పాటు కొత్త కొత్త రంగాలు ఎద‌గ‌డానికి సాయ‌ప‌డ‌డం వంటివి భాగం గా ఉన్నాయ‌న్నారు.

బ‌డ్జెటు విధి విధానాల‌ ను మ‌రియు నియ‌మాల‌ ను స‌ర‌ళ‌తరంగా మార్చ‌డం ద్వారా సామాన్య మాన‌వుని ‘జీవ‌న సౌల‌భ్యాన్ని’ పెంపొందిస్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఈ బ‌డ్జెటు వ్య‌క్తుల‌ కు, ఇన్వెస్ట‌ర్ లకు, ప‌రిశ్ర‌మ రంగానికి, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న రంగానికి స‌కారాత్మ‌క‌మైన మార్పుల‌ ను కొని తెస్తుంది అని ఆయ‌న అన్నారు.

|

బ‌డ్జెటు ను స‌మ‌ర్పించిన కొన్ని గంట‌ల లోపే సానుకూల ప్ర‌తిస్పంద‌న ల‌భించింది అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.  ఫిస్క‌ల్ స‌స్‌టైన‌బిలిటీ దిశ‌ గా త‌న‌కు ఉన్న బాధ్య‌త ప‌ట్ల ప్ర‌భుత్వం స‌ముచిత‌మైన శ్ర‌ద్ధ‌ ను క‌న‌బ‌ర‌చింద‌ని, అదే కాలం లో బ‌డ్జెటు ప‌రిమాణాన్ని పెంచింద‌ని ఆయ‌న అన్నారు.  బ‌డ్జెటు కు గ‌ల పార‌ద‌ర్శ‌క‌త్వం అనే అంశాన్ని నిపుణులు ప్ర‌శంసించ‌డం ప‌ట్ల ఆయ‌న సంతోషాన్ని వెలిబుచ్చారు.  
 
క‌రోనా మ‌హ‌మ్మారి కాలం లో కావ‌చ్చు లేదా ఆత్మ‌నిర్భ‌ర‌త కోసం ప్ర‌చార ఉద్య‌మాన్ని చేప‌ట్టిన త‌రుణం కావ‌చ్చు.. ప్ర‌భుత్వం అనుసరించిన స‌క్రియాత్మ‌క‌మైన వైఖ‌రి ని గురించి ప్ర‌ధాన మంత్రి నొక్కి చెప్తూ, బ‌డ్జెటు లో ప్ర‌తిక్రియాశీల‌మైన వైఖ‌రి ర‌వ్వంత‌యినా లేద‌ని పేర్కొన్నారు.  ‘‘మేము క్రియాశీల‌త్వాని కంటే ఒక అడుగు ముందుకు వేసి, ఒక స‌క్రియాత్మ‌క‌మైన బ‌డ్జెటు ను అందించాం’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.
 
స‌ర్వ‌తోముఖ అభివృద్ధి కి బ‌డ్జెటు ప్రాధాన్యాన్ని ఇవ్వ‌డాన్ని శ్రీ మోదీ మెచ్చుకొంటూ, సంప‌ద పైన‌, శ్రేయం పైన, సూక్ష్మ‌, ల‌ఘు, మ‌ధ్య‌త‌ర‌హా వ్యాపార సంస్థ‌ల (ఎమ్ఎస్ఎమ్ఇ) పైన‌, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న పైన బ‌డ్జెటు శ్ర‌ద్ధ వ‌హించింద‌న్నారు.  ఆరోగ్య సంర‌క్ష‌ణ కు ఇదివ‌ర‌కు ఎన్న‌డూ లేనంతగా ప్రాముఖ్యాన్ని ఇవ్వ‌డ‌మైంది అని కూడా ఆయ‌న అన్నారు.  ద‌క్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాల‌తో పాటు, లేహ్ ల‌ద్దాఖ్ ల అభివృద్ధి అవ‌స‌రాల‌ ను బడ్జెటు లెక్క‌ లోకి తీసుకొన్నందుకు ప్ర‌ధాన మంత్రి సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.  ఇది త‌మిళ నాడు, కేర‌ళ‌, ప‌శ్చిమ బంగాల్ ల వంటి మ‌న కోస్తా తీర రాష్ట్రాల‌ ను వ్యాపార ప‌రం గా ప్ర‌ముఖ స్థానాలుగా తీర్చిదిద్దే దిశ‌ లో ఒక పెద్ద అడుగు అని ఆయ‌న అన్నారు.  బ‌డ్జెటు అస‌మ్ వంటి ఈశాన్య రాష్ట్రాల లో ఇంత‌వ‌ర‌కు వెలికి రాని శ‌క్తియుక్తుల‌ ను వినియోగించుకోవ‌డం లో సైతం ఎంతగానో స‌హాయ‌కారి కాగ‌లుగుతుంది అని ఆయ‌న అన్నారు.

స‌మాజం లో వివిధ వ‌ర్గాల పైన బ‌డ్జెటు ప్ర‌స‌రించే ప్ర‌భావాన్ని గురించి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌స్తావిస్తూ, ప‌రిశోధ‌న‌, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల పై బ‌డ్జెటు వ‌హిస్తున్న శ్ర‌ద్ధ యువ‌త‌ కు స‌హాయ‌కారి కాగ‌ల‌ద‌న్నారు.  ఆరోగ్యం, స్వ‌చ్ఛ‌త‌, పోష‌ణ సంబంధిత‌ విజ్ఞానం, శుద్ధ‌మైన నీరు ల‌తో పాటు స‌మాన అవ‌కాశాలు అనే అంశాల‌ కు బడ్జెటు లో ప్రాధాన్యాన్ని ఇవ్వ‌డం సామాన్యుల కు మేలు చేస్తుంద‌ని ప్రధాన మంత్రి అన్నారు.  అదే విధంగా మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌ కు కేటాయింపును పెంచ‌డం, విధాన‌ప‌ర‌మైన సంస్క‌ర‌ణ‌లు ఉద్యోగ క‌ల్ప‌న‌ కు, వృద్ధి కి దారితీస్తాయి అని ఆయ‌న అన్నారు.

బ‌డ్జెటు లో వ్య‌వ‌సాయ రంగానికి సంబంధించిన అంశాలు, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు సంబంధించిన‌ అంశాలు అనేకం ఉన్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  రైతులు మ‌రింత‌గా రుణాన్ని, అది కూడా సుల‌భం గా పొందగలుగుతారు అని ఆయ‌న అన్నారు.  ఎపిఎమ్‌సి ని, ఎగ్రిక‌ల్చ‌ర్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఫండ్ ను ప‌టిష్ట‌ ప‌ర‌చేందుకు ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.  ‘‘ఇది ప‌ల్లెలు, మ‌న రైతులు ఈ బ‌డ్జెటు కు కేంద్ర స్థానం లో ఉన్నార‌న్న విష‌యాన్ని చాటి చెప్తోంది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ఉద్యోగావ‌కాశాల‌ ను మెరుగుప‌ర్చడానికి ఎమ్ఎస్ఎమ్ఇ రంగానికి కేటాయింపులను రెట్టింపు చేయ‌డమైంది అని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.  బ‌డ్జెటు కొత్త ద‌శాబ్దానికి ఒక బ‌ల‌మైన పునాది ని వేస్తుంద‌ని ఆయ‌న పేర్కొంటూ, ‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్’ ఆవిష్క‌ర‌ణ కోసం ఉద్దేశించినటువంటి ఒక బ‌డ్జెటు ను అందుకొంటున్నందుకు గాను దేశ ప్ర‌జ‌ల‌ ను అభినందించారు.

Click here to read full text speech

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
EPFO reports record payroll addition of 2 million members in May 2025

Media Coverage

EPFO reports record payroll addition of 2 million members in May 2025
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 జూలై 2025
July 21, 2025

Green, Connected and Proud PM Modi’s Multifaceted Revolution for a New India