ఘనత వహించిన , కిర్గిజ్‌రిపబ్లిక్ అధ్యక్షుడు, నా మిత్రుడు సూరోన్‌బే జీన్‌బెకోవ్,
సోదరీమణులు మరియు సోదరులారా,
నాకు, నా బృందాని కి సాదర స్వాగతం పలికినందుకు నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కిర్గిజిస్థాన్ గత 30 సంవత్సరాల లో అద్భుత ప్రగతి సాధించినందుకు నేను అభినందనలు తెలుపుతున్నాను. ఇక్కడి ప్రజల ప్రతిభ, బలమైన ప్రజాస్వామ్యం, సహజ సుందరత వీటన్నింటి కారణం గా ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలం గా ఉండనుంది. భారత దేశ ప్రజల పట్ల కిర్గిజ్ ప్రజల ప్రేమ, స్నేహం అద్భుతం. గతం లో నేను ఇక్కడి కి వచ్చినపుడు, అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ ఉంటే ఇంట్లో ఉన్నట్టు గానే ఉంది.
ఎక్సెలెన్సీ,
ఎస్.సి.ఒ (శంఘయి కో ఆపరేశన్ ఆర్గనైజేశన్) శిఖరాగ్రసభ కు విజయవంతమైన అధ్యక్షులు గా నేను మీకు అభినందనలు తెలుపుతున్నాను. మీ అధ్యక్షతలో, ఎస్‌సిఒ ప్రాంతీయ సహకారాన్ని మెరుగు పరిచేందుకు పలు చర్యలు తీసుకుంది. గత నెల లో మీరు న్యూ ఢిల్లీ లో జరిగిన నా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఇవాళ మీతో కలిసి ద్వైపాక్షిక సంబంధాల ను సమీక్షించే అవకాశం రావడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. ఇరు దేశాల సంబంధాలకు ఇండియా, కిర్గిజ్ రిపబ్లిక్ లు రెండూ మంచి ప్రాధాన్యతనిస్తున్నాయి.
మిత్రులారా,
ఈ రోజు నేను అధ్యక్షుడు జీన్‌బెకోవ్ తో పలు అంశాల పై విస్తృత చర్చలు జరిపాను. ఉభయ దేశాల మధ్య పరస్పర సహకారానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని మేమిద్దరం భావించాం. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల ను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయి కి తీసుకువెళ్లాలని మేం ఈ రోజు నిర్ణయించాం. ఇది మా భాగస్వామ్య సంబంధాల లోని ప్రతి అంశం లో దీర్ఘకాలిక సహకారాని కి దోహదపడుతుంది.
మిత్రులారా,
మహోజ్వల నాగరికత కలిగిన రెండు దేశాలూ ఒకదాని తో మరొకటి సహజ సంబంధాలు కలిగి ఉన్నాయి. ఇండియా, మధ్య ఆసియాల కు లోతైన, చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. ఇండియా, కిర్గిజ్ రిపబ్లిక్ లు పురాణ సంబంధ పుణ్యభూములు. ఉదాహరణ కు మహాభారత, రామచరిత మానస్ భారత్ కు ఉంటే, కిర్గిజ్‌రిపబ్లిక్ కు మానస్ ఉంది. ఉభయ దేశాలూ ప్రజాస్వామ్య దేశాలు. అంతేకాదు పూర్తి వైవిధ్యం తో కూడుకున్నవి.
ఉభయ దేశాల మధ్యగల ప్రాచీన సంబంధాలు, శాంతియుత బంధాన్ని బలోపేతం చేసుకోవాలన్న మా ఆలోచన దీని ని మరింత బలోపేతం చేసుకోవడాని కి మాకు ప్రేరణ నిచ్చింది. ఇది మా దౌత్యసంబంధాల ను విస్తృతం చేసింది. ద్వైపాక్షిక, బహుళపక్ష సంబంధాల కు సంబంధించిన పలు అంశాల విషయం లో ఇండియా, కిర్గిజ్ రిపబ్లిక్ లు ఒకదాని తో ఒకటి క్రమం తప్పకుండా సన్నిహిత సంప్రదింపులు జరుపుకుంటున్నాయి..
పలు అంతర్జాతీయ అంశాలపై మేం ఒకేరకమైన అభిప్రాయాలు కలిగి ఉన్నాం. ఐక్య రాజ్య సమితి లో, ఇతర అంతర్జాతీయ వేదికలపై మా మధ్య సహకారం బలమైనదిగానే ఉంది. మిలటరీ శిక్షణ, సంయుక్త యుద్ధ విన్యాసాలు, క్షేత్ర స్థాయి పరిశోధన, సైనిక సాంకేతిక పరిజ్ఞాన రంగాల కు మా రక్షణ రంగ సహకారం విస్తరించింది. రక్షణ రంగ సహకారాని కి సంబంధించి ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఉభయ దేశాలు నిర్ణయించాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక స హకారాని కి అద్భుత అవకాశాలు ఉన్నాయి. ఉభయ దేశాలు దీని ని తమకు అనుకూలం గా మలచుకోవచ్చు.
మిత్రులారా,
మేం ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం, ద్వంద్వ పన్నుల మినహాయింపు ఒప్పందం (డిటిఎఎ) కుదుర్చుకున్నాం. వాణిజ్యం, ఆర్థిక సహకారాని కి సంబంధించి ఐదు సంవత్సరాల కాలానికి రోడ్ మ్యాప్ కు అంగీకారం తెలిపాం. బిజినెస్ టు బిజినెస్ (బి2బి) సహకారాన్ని పెంచేందుకు ఇండియా-కిర్గిజ్ బిజినెస్ ఫోరం ను అధ్యక్షుడు జీన్‌బెకోవ్, నేనూ కలిసి ప్రారంభించాం. ‘నమస్కార్ యూరాసియా’ పేరు తో బిశ్కెక్ లో ఈ ఏడాది ఒక వాణిజ్య ప్రదర్శన నిర్వహించనున్నాం. నిర్మాణ రంగం, రైల్వే లు, జల విద్యుత్, మైనింగ్, ఇతర రంగాల లో కిర్గిజ్ రిపబ్లిక్ లో గల అవకాశాల ను అధ్యయనం చేయాల్సింది గా నేను భారతీయ కంపెనీల కు పిలుపునిస్తున్నాను.
మిత్రులారా,
కిర్గిజ్ రిపబ్లిక్ అభివృద్ధి అవసరాల ను తీర్చేందుకు ఈ రోజు నేను 200 మిలియన్ డాలర్ల విలువ గల కన్సెషనల్ లైన్ ఆఫ్ క్రెడిట్‌ను ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. కిర్గిజ్ రిపబ్లిక్ లో ఇండియా- కిర్గిజ్ సంయుక్త ఆర్థిక కార్యకలాపాలు చేపట్టడాని కి ఈ సహాయం సహాయకారి గా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇండియా, కిర్గిజ్ మధ్య, అలాగే మధ్య ఆసియా లోని పలు ప్రాంతాల తో గల మంచి అనుసంధానత కారణం గా ఉభయ దేశాల మద్య ప్రజల కు ప్రజల కు మధ్య సంబంధాల కు, పెట్టుబడుల కు, వ్యాపారాభివృద్ధి కి అవకాశం కల్పించనుంది.
మిత్రులారా,
ఇండియా, కిర్గిజ్ రిపబ్లిక్ లు జనవరి లో ఉజ్బెకిస్థాన్‌లోని సమర్ ఖండ్ లో విదేశాంగ మంత్రుల స్థాయి లో జరిగిన తొలి ఇండియా – సెంట్రల్ ఆసియా డైలాగ్ సమావేశం లో చురుకు గా పాల్గొన్నాయి. ఈ సమావేశాల లో మేం సుసంపన్నత, శాంతి, సుస్థిరత, ఇతర అంశాల కు సంబంధించిన దార్శనికత తో కూడిన అభిప్రాయాల ను పంచుకున్నాం.
ఎక్సెలెన్సీ,
ఇండియా, కిర్గిస్తాన్ వంటి ప్రజాస్వామిక, వైవిధ్యం తో కూడిన సమాజాల కు ఉగ్రవాదం పెనుముప్పు గా మారింది. ఛాందసవాదం, ఉగ్రవాదాని కి ఒక పరిష్కారం కనుకొనడం లో మేం సమిష్టి గా ఉన్నాం. ఉగ్రవాద కార్యకలాపాల ను స్పాన్సర్ చేసేవారిని వీటి కి బాధ్యులు గా చేయవలసి ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలు ఏ రూపం లోనూ, ఏ రకం గానూ సమర్ధించు కోవడానికి వీలులేనివన్న గట్టి సందేశాన్ని ప్రపంచాని కి ఇవ్వాల్సి ఉంది.
మిత్రులారా,
బిశ్కెక్ లో ఇండియా- కిర్గిజ్ సంయుక్త టెక్స్‌టైల్ ప్రదర్శన ను ప్రారంభించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ను ఆసక్తి తో చూసిన వారు ఇండియా, కిర్గిజ్ టెక్స్‌టైల్ సంప్రదాయాలు ఒకే రీతి గా ఉండడం చూసి ఆశ్చర్యపోయి ఉంటారు. ఇండియా,కిర్గిజ్ రిపబ్లిక్ లు పర్వత ప్రాంత పర్యావరణం, హరిత పర్యాటకం, మంచు చిరుతలు అంతరించిపోకుండా చూడడం, ఉభయ దేశాల ప్రజల కు -ప్రజల కు మధ్య స్నేహం, వంటి అంశాలపై పరస్పరం సహరించుకుంటాయి. సాంస్కృతిక సన్నిహితత్వం మా రెండు దేశాల కు గొప్ప ఆస్తి. దీని ని పరిరక్షించు కోవాలని నేను కోరుకుంటున్నాను. ఇందుకోసం పలు చర్యలు తీసుకున్నాం.
కిర్గిజ్ రిపబ్లిక్, ఇండియా మధ్య సాంస్కృతిక, స్నేహ సంబంధాల సంవత్సరం గా 2021ని జరుపుకోవడానికి మేం అంగీకరించామని తెలపడానికి సంతోషిస్తున్నాను. మరొక్కసారి నేను కిర్గిజ్ ప్రెసిడెంట్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భం గా నేను మిమ్మల్ని ఇండియా రావాల్సింది గా ఆహ్వానిస్తున్నాను. ఇండియా లో మీకు స్వాగతం పలకడం మాకు గొప్ప గౌరవం గా భావిస్తాము.
మీకు ధన్యవాదాలు.
Strategic partners for a better future.
— PMO India (@PMOIndia) June 14, 2019
Significant outcomes from the talks between PM @narendramodi and President Jeenbekov that will benefit India-Kyrgyzstan relations. pic.twitter.com/rUyvWY4fhs
भारत और Kyrgyz Republic जैसे लोकतान्त्रिक और विविधता भरे समाजों को आज आतंकवाद से सबसे बड़ा खतरा है। हम आतंकवाद और कट्टरवाद के समाधान के लिए एकजुट हैं। आतंकवाद के प्रायोजकों को जवाबदेह ठहराना होगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 14, 2019
पूरी दुनिया को यह संदेश देने की जरूरत है कि आतंकवाद को किसी भी तरीके से उचित नहीं माना जा सकता: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 14, 2019
मुझे घोषणा करते हुए प्रसन्नता है कि वर्ष 2021 को Kyrgyz Republic और भारत के बीच सांस्कृतिक और मैत्री के वर्ष के रूप में मनाने पर हम सहमत हुए हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 14, 2019