శ్రీ బాబా సాహెబ్ పురందరే 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఘన నీరాజనం అర్పించారు. బాబా సాహెబ్ జీవితంలో శతాబ్ది జన్మదిన వేడుకల సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- మన రుషి పుంగవులు ప్రవచించిన చురుకైన, మానసిక చైతన్యంతో కూడిన నిండు నూరేళ్ల జీవితానికి బాబా సాహెబ్ పురందరే జీవితం అద్భుత తార్కాణమని పేర్కొన్నారు. అంతేకాకుండా భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో పురందరే నూరో సంవత్సరంలో ప్రవేశించడ ఒక యాదృచ్ఛిక హర్షణీయ సందర్భమని ఆయన అభివర్ణించారు. దేశ చరిత్రలో అమరువీరులైన వారి ఉజ్వల చరిత్ర రచనలో బాబా సాహెబ్ పురందరే కృషిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. “శివాజీ మహరాజ్ జీవితం, చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన అద్భుత కృషికి మనం సదా రుణపడి ఉండాలి” అని ప్రధాని పేర్కొన్నారు. కాగా, శ్రీ పురందరేను కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించగా, 2015లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ‘మహారాష్ట్ర భూషణ్’ పురస్కారం అందజేసింది. అలాగే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ‘కాళిదాస్’ పురస్కారంతో గౌరవించింది.
శివాజీ మహరాజ్ అద్భుత వ్యక్తిత్వం గురించి ప్రధానమంత్రి సమగ్రంగా వివరించారు. శివాజీ మహరాజ్ భారతదేశ చరిత్రకు ఘనతను ఆపాదించడమే కాకుండా ప్రస్తుత భారత భౌగోళిక స్వరూపాన్ని కూడా ప్రభావితం చేశారని ఆయన పేర్కొన్నారు. శివాజీ మహరాజ్ లేని భారతదేశంలో మన గత, వర్తమాన, భవిష్యత్ స్థితిగతులు ఏమిటన్నది పెనుసవాలుగా మారి ఉండేదని చెప్పారు. శివాజీ మహరాజ్ ప్రస్తావనలేని భారత స్వరూపం, ఘన చరితను ఊహించడం కూడా అసాధ్యమేనని పేర్కొన్నారు. తన కాలంలో ఆయన ఏంచేశారో, ఆ తర్వాతి కాలంలో ఆయన చరిత్ర, స్ఫూర్తి, వీరగాథలు అదే పాత్రను పోషించాయని చెప్పారు. వెనుకబడిన, అణగారిన వర్గాలకు న్యాయం, నిరంకుశత్వంపై పోరుకు శివాజీ మహరాజ్ ‘హైందవ స్వరాజ్య’ నినాదమే అపూర్వ నిదర్శనమని చెప్పారు. వీర శివాజీ నిర్వహణ సామర్థ్యం, నావికాదళ వినియోగ శక్తి, నీటి యాజమాన్యం నేటికీ అనుసరణీయాలని శ్రీ మోదీ తెలిపారు.
బాబా సాహెబ్ పురందరే రచన శివాజీ మహరాజ్‌పై ఆయనకుగల అచంచల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఆ రచనను చదువుతున్నపుడు శివాజీ మహరాజ్ సజీవుడై మన హృదయంలో సంచరిస్తారని ఆయన అన్నారు. బాబా సాహెబ్ కార్యక్రమాలకు లోగడ తాను హాజరుకావడాన్ని ఈ సందర్భంగా ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. సంపూర్ణ ఘనతతో కూడిన చరిత్రను, దాని స్ఫూర్తిని యువతకు చేరువ చేయడంలోఆయన చూపిన ఉత్సాహాన్ని ప్రశంసించారు. చరిత్రను ఎల్లప్పుడూ దాని వాస్తవిక రూపంలో తెలియజేయడంపై నిబద్ధతను ఆయన సదా పాటించారని కొనియాడారు. “దేశ చరిత్రకు సంబంధించి ఈ సమతూకం అవశ్యం. తన వ్యక్తిగత విశ్వాసంతోపాటు తనలోని సాహితీవేత్త చారిత్రక స్ఫూర్తిని ప్రభావితం చేయకుండా ఆయన సదా జాగ్రత్త వహించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్ర రచనలో బాబా సాహెబ్ పాటించిన ప్రమాణాలను అనుసరించాలని యువ చరిత్రకారులకు ఈ సందర్భంగా నా విజ్ఞప్తి” అని ప్రధానమంత్రి సూచించారు. కాగా, గోవా విముక్తి ఉద్యమం, దాదర్-నాగర్-హవేలీ స్వాతంత్ర్య పోరాటాలకూ బాబా సాహెబ్ తనవంతు చేయూతనందించారని ప్రధాని గుర్తుచేశారు.
मैं आदरणीय बाबा साहेब पुरंदरे जी को जीवन के सौवें वर्ष में प्रवेश के लिए हृदय से शुभकामनाएँ देता हूँ।
— PMO India (@PMOIndia) August 13, 2021
उनका मार्गदर्शन, उनका आशीर्वाद जैसे अभी तक हम सबको मिलता रहा है, वैसे ही आगे भी लंबे समय तक मिलता रहे, ये मेरी मंगलकामना है: PM @narendramodi
आप सब इस बात से परिचित हैं कि आज़ादी के अमृत महोत्सव में देश ने स्वाधीनता सेनानियों के, अमर आत्माओं के इतिहास लेखन का अभियान शुरू किया है।
— PMO India (@PMOIndia) August 13, 2021
बाबा साहेब पुरंदरे यही पुण्य-कार्य दशकों से करते आ रहे हैं: PM @narendramodi
उन्होंने शिवाजी महाराज के जीवन को, उनके इतिहास को जन-जन तक पहुंचाने में जो योगदान दिया है, उसके लिए हम सभी उनके हमेशा ऋणी रहेंगे।
— PMO India (@PMOIndia) August 13, 2021
मुझे खुशी है कि हमें उनके इस योगदान के बदले देश को उनके प्रति कृतज्ञता ज्ञापित करने का सौभाग्य मिला है: PM @narendramodi
शिवाजी महाराज, भारत के इतिहास के शिखर-पुरुष तो हैं ही, बल्कि भारत का वर्तमान भूगोल भी उनकी अमर गाथा से प्रभावित है।
— PMO India (@PMOIndia) August 13, 2021
ये हमारे अतीत का, हमारे वर्तमान का, और हमारे भविष्य का एक बहुत बड़ा प्रश्न है, कि अगर शिवाजी महाराज न होते तो क्या होता? - PM @narendramodi
छत्रपति शिवाजी महाराज के बिना भारत के स्वरूप की, भारत के गौरव की कल्पना भी मुश्किल है।
— PMO India (@PMOIndia) August 13, 2021
जो भूमिका उस कालखंड में छत्रपति शिवाजी की थी, वही भूमिका उनके बाद उनकी प्रेरणाओं ने, उनकी गाथाओं ने निभाई है: PM @narendramodi
शिवाजी महाराज का 'हिंदवी स्वराज' सुशासन का, पिछड़ों-वंचितों के प्रति न्याय का, और अत्याचार के खिलाफ हुंकार का अप्रतिम उदाहरण है।
— PMO India (@PMOIndia) August 13, 2021
वीर शिवाजी का प्रबंधन, देश की समुद्रिक शक्ति का इस्तेमाल, नौसेना की उपयोगिता, जल प्रबंधन ऐसे कई विषय आज भी अनुकरणीय हैं: PM @narendramodi
बाबा साहेब ने हमेशा सुनिश्चित करने का प्रयास किया कि युवाओं तक इतिहास अपनी प्रेरणाओं के साथ पहुंचे, साथ ही अपने सच्चे स्वरूप में भी पहुंचे।
— PMO India (@PMOIndia) August 13, 2021
इसी संतुलन की आज देश के इतिहास को आवश्यकता है।
उनकी श्रद्धा और उनके भीतर के साहित्यकार ने कभी भी उनके इतिहासबोध को प्रभावित नहीं किया: PM