ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో జరిగిన ‘నెట్‌వ‌ర్క్‌-18 రైజింగ్ ఇండియా స‌మిట్’లో ప్ర‌సంగించారు.

జాతీయ యుద్ధ స్మారకాన్ని దేశ ప్ర‌జ‌ల కు అంకితం చేసిన తరువాత కొద్ది సేప‌టికే ‘రైజింగ్ ఇండియా’ అనే అంశాన్ని గురించి మాట్లాడే అవ‌కాశం త‌న‌ కు దక్కడం ప‌ట్ల ఆయ‌న హర్షాన్ని వ్య‌క్తం చేశారు.  ‘రాజ‌కీయాల‌ కు అతీతంగా: జాతీయ ప్రాథ‌మ్యాల‌ ను నిర్వ‌చించ‌డం’ అనే ఇతివృత్తం చాలా ముఖ్య‌మైన‌టువంటిదని ఆయ‌న అన్నారు.  

దేశ హితాన్ని ప్రాథ‌మ్యం గా నిర్దేశించుకొని ఏ విధ‌మైన ఫ‌లితాల‌ను సాధించ‌వ‌చ్చో చాటి చెప్ప‌డం కోసం, గ‌తాని కి మ‌రియు వ‌ర్త‌మానాని కి మ‌ధ్య ఒక వ్యత్యాసాన్ని గురించి వివ‌రిస్తూ ఈ అంశం పై సంభాషిస్తాన‌ని ఆయ‌న అన్నారు.

2014వ సంవ‌త్స‌రం క‌న్నా ముందు జిడిపి వృద్ధి త‌క్కువ‌ గా ఉన్నప్పటికీ ద్ర‌వ్యోల్బ‌ణం మ‌రియు ఆదాయ‌పు ప‌న్ను రేట్లు ఏ విధం గా అధికం గా ఉండేవో ఆయ‌న విశ‌దీక‌రించారు.  ప్ర‌స్తుతం జిడిపి వృద్ధి 7 శాతం నుండి 8 శాతం శ్రేణి కి చేరుకోగా, ద్ర‌వ్యోల్బ‌ణం మ‌రియు కోశ లోటు అల్పం గా ఉన్నట్లు ఆయ‌న చెప్పారు.  ఆదాయ‌పు ప‌న్ను కు సంబంధించినంత వ‌ర‌కు ప్ర‌జ‌ల కు ఉప‌శ‌మ‌నం లభించింది అని కూడా ఆయ‌న అన్నారు.

ప్ర‌పంచం లో భారతదేశం సాధించిన‌ స్థానాన్ని గురించి ఆయ‌న చెప్తూ, 21వ శ‌తాబ్దాన్ని ఒక‌ప్పుడు భార‌త‌దేశపు శ‌తాబ్ది గా పేర్కొన్నార‌ని గుర్తు చేశారు.  అయితే, 2013వ సంవ‌త్స‌రం క‌ల్లా ప్రపంచం లో ‘‘పెళుసైన అయిదు’’ ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ ల‌లో ఒక‌టి గా భార‌త‌దేశం మారింద‌ని ఆయన అన్నారు.  ప్ర‌స్తుతం భార‌త‌దేశం అత్యంత వేగం గా వృద్ధి చెందుతున్న ప్ర‌ధాన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ గా ఉంద‌న్నారు.  ‘వ్యాపారం చేయ‌డం లో సౌల‌భ్యం’ అంశాన్ని ప్ర‌స్తావించి,  2011వ సంవ‌త్స‌రం లో భార‌త‌దేశం 132వ స్థానం లో ఉన్న‌ది కాస్తా, 2014వ సంవ‌త్స‌రం లో 142వ స్థానాని కి ప‌డిపోయింద‌ని ఆయ‌న చెప్పారు.  ప్ర‌స్తుతం మ‌నం 77వ స్థానం లో నిల‌బ‌డ్డాం అని ఆయ‌న అన్నారు.  

ఈ క్షీణ‌త‌ కు ఒక కార‌ణం అవినీతి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఆ కాలం లో ప‌తాక శీర్షిక ల‌కు ఎక్కిన బొగ్గు, సిడ‌బ్ల్యుజి, స్పెక్ట్రమ్ వగైరా కుంభ కోణాలను ఆయ‌న ఈ సంద‌ర్భం లో ప్ర‌స్తావించారు.

‘జ‌న్ ధ‌న్ యోజ‌న’ను కేంద్ర ప్ర‌భుత్వం ఏ విధం గా మొద‌లు పెట్టిందో ఆయ‌న వివ‌రించారు.  ఈ ప‌థ‌కం లో భాగంగా 34 కోట్ల బ్యాంకు ఖాతాల ను తెర‌వ‌డం జ‌రిగింద‌న్నారు.  ఈ ఖాతాల‌ ను ఆధార్ సంఖ్య‌ల తోను, మొబైల్ ఫోన్ ల తోను ముడివేయ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న తెలిపారు.  ఇవాళ దాదాపు 425 సంక్షేమ ప‌థ‌కాల తాలూకు ప్ర‌యోజ‌నాలు ఈ బ్యాంకు ఖాతాల లోకి నేరు గా బ‌దిలీ అవుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  ల‌బ్ధిదారుల‌ కు నేరుగా ఆరు ల‌క్షల కోట్ల రూపాయ‌లు బ‌దిలీ అయ్యాయ‌న్నారు.  ఈ ప్ర‌క్రియ లో భాగం గా 8 కోట్ల బూట‌క‌పు లబ్ధిదారుల‌ ను తొల‌గించ‌డం జ‌రిగింద‌ని, 1.1 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు ఆదా అయ్యాయని ఆయ‌న తెలిపారు.

‘ఆయుష్మాన్ భార‌త్’ ప‌థ‌కం లో ఎటువంటి దారి మ‌ళ్ళింపు కు అవ‌కాశం లేద‌ని, ఆ ప‌థ‌కం లో భాగం గా డ‌బ్బు ను ఆసుప‌త్రి ఖాతా లోకి నేరు గా బ‌దలాయిస్తార‌ని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు.  ల‌బ్దిదారుల‌ కు ఆధార్ కార్డులు ఉంటాయ‌ని, వారిని 2015వ సంవ‌త్స‌రం సామాజిక‌, ఆర్థిక స‌ర్వేక్ష‌ణ్ ప్రాతిప‌దిక‌ న ఎంపిక చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు.  ఇదే త‌ర‌హా లో ‘పిఎం కిసాన్ స‌మ్మాన్ నిధి’లో సైతం ఎటువంటి దారి మ‌ళ్ళింపులు సాధ్యం కావ‌ని, ఈ ప‌థ‌కం లో భాగం గా సుమారు 12 కోట్ల మంది రైతులు ప్ర‌త్య‌క్ష ప్ర‌యోజ‌న బ‌దిలీ ల‌ను స్వీక‌రించ‌నున్నార‌ని తెలిపారు.

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో బ‌న్‌సాగ‌ర్ ఆన‌క‌ట్ట‌, ఇంకా ఝార్‌ఖండ్ లో మండ‌ల్ ఆన‌క‌ట్ట ల వంటి ప‌థ‌కాలు పెద్ద ఎత్తున వ్య‌యం పెరుగుదల కు లోన‌య్యాయ‌ని, దీనికి కార‌ణం ద‌శాబ్దాల త‌ర‌బ‌డి అవి అమ‌లు కు నోచుకోక‌పోవ‌డ‌మే అని ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు.  ఈ జాప్యాల‌న్నింటికి మూల్యాన్ని నిజాయతీప‌రులైన ప‌న్ను చెల్లింపుదారు చెల్లిస్తూ వ‌చ్చినట్లు ఆయ‌న పేర్కొన్నారు.  12 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ కు పైబ‌డి విలువైన ప్రాజెక్టుల పురోగ‌తిని ప్ర‌గ‌తి PRAGATI కార్య‌క్ర‌మం లో భాగం గా స్వ‌యం గా తాను స‌మీక్షించిన‌ట్లు ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  ఈ ప‌థ‌కాల లో చాలా వ‌ర‌కు భార‌త‌దేశ ఈశాన్య ప్రాంతం లో ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు.  భార‌త‌దేశం లోని తూర్పు ప్రాంతాలు ప్ర‌భుత్వానికి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ గల ప్రాంతాలుగా ఉన్నాయి అని ఆయ‌న చెప్పారు.  

ఉద్యోగ క‌ల్ప‌న పై ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, భార‌త‌దేశం ప్ర‌స్తుతం అత్యంత వేగం గా వ‌ర్ధిల్లుతున్న పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ గా ఉంద‌ని; ఎఫ్‌డిఐ ఇదివ‌ర‌కు ఎన్న‌డూ ఎరుగ‌నంత‌టి అధిక స్థాయి లో న‌మోదు అవుతోంద‌ని; పేద‌రికం అంత‌ర్జాతీయ నివేదిక‌ల‌ ను బ‌ట్టి చూస్తే  శ‌ర వేగం గా త‌గ్గుతోంద‌ని; మౌలిక స‌దుపాయాల అభివృద్ధి మునుప‌టి తో పోలిస్తే వేగాన్ని పుంజుకొంద‌ని; మ‌రి అలాగే ప‌ర్య‌ట‌న రంగం ఎదుగుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.  ఇవ‌న్నీ కూడాను ఉద్యోగ అవ‌కాశాలు పెర‌గ‌నిదే సాధ్య‌మ‌య్యేవి కావు అని ఆయ‌న అన్నారు.
 
వృత్తి నిపుణుల సంఖ్య, అలాగే వాణిజ్య వాహ‌నాల విక్రయ సంఖ్యలు పెరుగుతూ ఉండ‌టాన్ని గురించి ఆయ‌న మాట్లాడారు.  ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌నలో భాగం గా 15 కోట్ల మంది కి పైగా న‌వ పారిశ్రామికుల‌ కు 7 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ కు పైగా విలువైన రుణాల‌ ను మంజూరు చేయ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న తెలిపారు.  ఇది కూడా ఉద్యోగాల‌ ను సృష్టించేందుకు దోహ‌దం చేస్తుంద‌ని ఆయ‌న అన్నారు.  ఇపిఎఫ్ఒ చందాదారుల సంఖ్య పెరుగుతూ ఉండ‌టాన్ని కూడా ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు.

‘న్యూ ఇండియా’ను ఆవిష్క‌రించ‌డం లో, నిర్మాణాత్మ‌క‌మైన‌టువంటి వాతావ‌ర‌ణాన్ని ఏర్ప‌ర‌చ‌డం లో ప్ర‌సార మాధ్య‌మాల ది ముఖ్య‌మైన పాత్ర అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator

Media Coverage

India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 నవంబర్ 2024
November 22, 2024

PM Modi's Visionary Leadership: A Guiding Light for the Global South