భూటాన్ ప్ర‌ధాని, శ్రేష్ఠుడు డాక్ట‌ర్ లోటె శెరింగ్, నేశ‌న‌ల్ అసెంబ్లీ మరియు నేశ‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ భూటాన్ ల గౌర‌వనీయ స‌భ్యులు, విశిష్ట ఉప కుల‌ప‌తి తో పాటు రాయ‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ భూటాన్ ఫేకల్టీ స‌భ్యులారా,

నా యువ మిత్రులారా,

క్యూజో జాంగ్ పో లా. న‌మ‌స్కారాలు,

నేటి ఉద‌యం పూటల్లా మీతో పాటు ఇక్క‌డ ఉండ‌డం ఓ అద్భుత‌మైనటువంటి అనుభూతి. ఈ రోజు న ఆదివారం మ‌రి మీరు ఒక ఉప‌న్యాస కార్యక్రమాని కి హాజరు కావ‌ల‌సి వచ్చిందేమిటా అని అనుకొంటుంటార‌ని నేను భావిస్తున్నాను. అయితే, నేను దీని ని సంక్షిప్తం గా ఉంచడం తో పాటు మీరు అన్వయించుకొనేటటువంటి విష‌యాలనే ప్రస్తావిస్తాను.

మిత్రులారా,

భూటాన్ ను సంద‌ర్శిస్తున్న ఎవ‌రైనా దీని యొక్క ప్రాకృతిక శోభ కు ముగ్ధులైనట్లే ఇక్కడి ప్ర‌జ‌ల ఆప్యాయత‌ కు, క‌రుణ‌ కు మ‌రియు నిష్కాపట్యాని కి కూడాను ముగ్ధులు అవుతారు. నిన్న‌టి రోజు న నేను భూటాన్ యొక్క గత కాల‌పు సంప‌న్న‌త కు మ‌రియు ఆ దేశం యొక్క ఆధ్యాత్మిక వార‌స‌త్వ ఘ‌న‌త కు ప్రప్రథమ ఉదాహ‌ర‌ణ అయినటువంటి సింతోఖా జోంగ్ లో గ‌డిపాను. ఆ సందర్శన కాలం లో భూటాన్ యొక్క వ‌ర్త‌మాన నాయ‌క‌త్వం తో అతి ద‌గ్గ‌ర‌ గా మెలిగే అవ‌కాశం నాకు ద‌క్కింది. భార‌త‌దేశం-భూటాన్ సంబంధం పట్ల వారి మార్గ‌ద‌ర్శ‌క‌త్వాన్ని నేను మ‌రొక్క‌ మారు అందుకున్నాను. వారి యొక్క వ్య‌క్తిగ‌త శ్ర‌ద్ధ మ‌రియు నిశిత ప‌రిశీల‌న నుండి ఈ సంబంధం స‌దా లాభ‌ప‌డుతూ వ‌చ్చింది.

భూటాన్ యొక్క భవిష్య‌త్తు తో ఈ రోజు న ఇక్క‌డ నేను మ‌మేకం అయ్యాను. ఇక్క‌డి శక్తి ని, చురుకుత‌నాన్ని నేను గమనించగలుగుతున్నాను. ఇవి, ఈ గొప్ప దేశం యొక్క మ‌రియు ఈ దేశపు పౌరుల యొక్క భ‌విష్య‌త్తు ను మ‌ల‌చ‌గ‌లుగుతాయ‌ని నేను నమ్ముతున్నాను. నేను భూటాన్ యొక్క భూత కాలాన్ని, వ‌ర్తమానాన్ని లేదా భ‌విష్య‌త్తు ను ప‌రికించిన‌ప్పుడు, ఉమ్మ‌డి బంధాలు గాను, స్థిర‌మైన బంధాలుగాను తోచేవల్లా గాఢ‌మైన‌టువంటి ఆధ్యాత్మిక‌త, ఇంకా య‌వ్వ‌న‌భ‌రిత‌మైన ఉత్సాహం. ఇవి మ‌న ద్వైపాక్షిక సంబంధం లోని బ‌లాలు కూడాను.

మిత్రులారా,

భూటాన్ మ‌రియు భార‌త‌దేశ ప్ర‌జ‌లు ఒక‌రితో మ‌రొక‌రు గొప్ప బంధాన్ని పెన‌వేసుకోవ‌డనేది స్వాభావిక‌ం. ఏది ఏమయినా, మ‌నం కేవలం మ‌న భౌగోళిక సామీప్యం కార‌ణం గానే స‌న్నిహితులం కాలేదు. మ‌న చ‌రిత్ర‌, సంస్కృతి, ఇంకా ఆధ్యాత్మిక సంప్ర‌దాయాలు మ‌న దేశాల మధ్య మ‌రియు మ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య విల‌క్ష‌ణ‌మైన, ఇంకా ప్ర‌గాఢ‌మైన పాశాల‌ ను ఏర్ప‌ర‌చాయి. రాకుమారుడు సిద్ధార్థుడు గౌత‌మ బుద్ధుని గా మారిన భూమి కావడం భార‌త‌దేశం చేసుకున్న అదృష్టం. మ‌రి ఆయ‌న ఆధ్యాత్మిక సందేశం తాలూకు జ్యోతి.. అదే బౌద్ధం యొక్క వెలుగు.. ప్ర‌పంచం అంతటి కీ విస్త‌రించింది. మునులు, ఆధ్యాత్మిక నాయ‌కులు, పండితులు, ఇంకా అన్వేష‌కులు- త‌రాల త‌ర‌బ‌డి- భూటాన్ లో ఆ జ్యోతి ని ఉజ్వ‌లం గా వెలిగిస్తున్నారు. వారు భార‌త‌దేశాని కి, భూటాన్ కు మ‌ధ్య గల ప్ర‌త్యేక బంధాన్ని పెంచి పోషించారు కూడాను.

త‌త్ఫ‌లితం గా, మ‌న ఉమ్మ‌డి విలువ‌ లు ఒక సంయుక్త‌మైనటువంటి ప్రాపంచిక దృష్టి కోణాన్ని సంత‌రించుకొన్నాయి. ఇది వారాణ‌సీ లో, బోధ్ గ‌య లో దృగ్గోచ‌రం అవుతోంది. అలాగే జోంగ్ లో, చోర్టెన్ లో కూడాను ద‌ర్శ‌న‌మిస్తున్న‌ది. మ‌రి ప్ర‌జ‌లు గా మ‌నం, ఈ ఘ‌న వార‌స‌త్వం తాలూకు స‌జీవ వాహ‌కులం గా ఉండే అదృష్టాని కి నోచుకొన్నాము. ప్ర‌పంచం లోని మ‌రే రెండు దేశాలు కూడా ఒకదాని ని మ‌రొక‌టి ఇంత క్షుణ్ణం గా ఎరిగి ఉండ‌ట‌మూ, లేదా ఇంత‌ గా ఒక‌దాని తో మరొక‌టి వెల్ల‌డి చేసుకోవ‌డ‌మూ జ‌రుగ‌నే లేదు. అంతేకాదు, మ‌రే రెండు దేశాలు కూడాను వారి యొక్క ప్ర‌జ‌ల‌ కు స‌మృద్ధి ని స‌మ‌కూర్చ‌డం లో ఇంత స‌హ‌జ‌మైన‌టువంటి భాగ‌స్వామ్య దేశాలు గా లేనే లేవు.

మిత్రులారా,

ఈ రోజు న భార‌త‌దేశం అనేక రంగాల లో చ‌రిత్రాత్మ‌కమైనటువంటి ప‌రివ‌ర్త‌న ల‌కు సాక్షీభూతమవుతున్న‌ది.

భార‌త‌దేశం ఇదివ‌ర‌కు ఎన్న‌డూ లేనంత వేగం గా పేద‌రికాన్ని నిర్మూలిస్తున్న‌ది. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న యొక్క వేగం గ‌త అయిదు సంవ‌త్స‌రాల కాలం లో రెండింత‌లు అయింది. మేము ఈ మ‌ధ్య‌నే త‌దుప‌రి త‌రం మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కోసం దాదాపు గా 15 బిలియ‌న్ డాల‌ర్ల ను కేటాయించాము. న‌టువంటి 500 మిలియ‌న్ భార‌తీయుల కు ఆరోగ్య హామీ ని ఇవ్వ‌జూపే, ప్ర‌పంచం లోకెల్లా అత్యంత భారీ ఆరోగ్య సంర‌క్ష‌ణ కార్య‌క్ర‌మం అయినటువంటి ‘ఆయుష్మాన్ భార‌త్’ కు నిల‌యం గా భార‌త‌దేశం ఉన్న‌ది.

భార‌త‌దేశం ప్ర‌పంచం లో కెల్లా అతి త‌క్కువ ఖ‌ర్చు తో డేటా క‌నెక్టివిటీ ని కలిగివున్నటువంటి దేశాల లో ఒక‌ దేశం గా ఉన్నది. ఇది ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల ను ప్ర‌త్య‌క్షం గా, ప‌రోక్షం గా సాధికారిత దిశ గా న‌డిపిస్తున్నది. భార‌తదేశం ప్ర‌పంచం లో కెల్లా అతిపెద్ద స్టార్ట్-అప్ ఇకో సిస్ట‌మ్స్ కు ఆల‌వాలం గా కూడా ఉంది. భార‌త‌దేశం లో నూత‌న ఆవిష్క‌ర‌ణ ల‌కు పూనుకోవ‌డానికి నిజాని కి గొప్ప త‌రుణం ఇది ! వీటి తో పాటు ఇంకా మ‌రెన్నో రూపాంతరీకరణం లకు కేంద్ర స్థానం లో ఉన్నవి భార‌త‌దేశ యువ‌త స్వ‌ప్నాలు, ఆకాంక్ష‌లూను.

మిత్రులారా,

ఈ రోజు న భూటాన్ యొక్క అత్యుత్త‌మ‌మైన‌టువంటి మ‌రియు మేధా సంప‌న్నులైన‌టువంటి యువ‌తీయువకుల న‌డుమ నేను నిల‌బ‌డి ఉన్నాను. మాన్య‌ శ్రీ రాజు గారు నిన్న‌నే నాతో చెప్పారు.. వారు మీతో క్ర‌మం త‌ప్ప‌క భేటీ అవుతూ ఉన్నట్లు, అంతేకాక క్రింద‌టి స్నాతకోత్స‌వం లో మిమ్మ‌ల్ని ఉద్దేశించి వారు ప్ర‌సంగం చేసినట్లు. భూటాన్ యొక్క భవిష్య‌త్తు నేత‌లు, నూత‌న ఆవిష్క‌ర్త‌లు, వ్యాపార రంగ ప్ర‌ముఖులు, క్రీడాకారులు, క‌ళాకారులు, మ‌రియు శాస్త్రవేత్త‌లు ఆవిర్భ‌వించేది మీ అందరిలో నుండే.

కొద్ది రోజుల క్రితం, నా మంచి మిత్రుడు, ప్ర‌ధాని డాక్ట‌ర్ శెరింగ్ ఫేస్ బుక్ లో వ్రాసిన‌టువంటి ఒక వ్యాఖ్య నా హృద‌యాన్ని స్ప‌ర్శించింది. ఆ వ్యాఖ్య లో ఆయ‌న ఎగ్జామ్ వారియ‌ర్స్ ను గురించి ప్ర‌స్తావించారు. అంతేకాదు, ఇప్పుడే ఒక విద్యార్థి కూడా ఆ పుస్త‌కాన్ని గురించి ప్ర‌స్తావించారు. ఎగ్జామ్ వారియ‌ర్స్, ప‌రీక్ష ల‌ను ఒత్తిడి లేకుండా ఏ విధం గా ఎదుర్కోవ‌చ్చో వివ‌రిస్తూ నేను వ్రాసిన‌టువంటి ఒక పుస్త‌కం. పాఠ‌శాల‌ల్లోను, క‌ళాశాలల్లోను, పెద్ద తరగతి గది వంటి జీవ‌నం లోను ప్రతి ఒక్కరు ప‌రీక్ష ల‌ను ఎదుర్కొంటూనే ఉన్నారు. మీకు ఒక‌ విషయాన్ని నేను చెప్ప‌నా? ఎగ్జామ్ వారియ‌ర్స్ లో నేను వ్రాసిన దాంట్లో చాలా భాగం బుద్ధ భ‌గ‌వానుని బోధ‌న‌ ల ద్వారా ప్ర‌భావితం అయిందే. మ‌రీ ముఖ్యం గా, సానుకూల దృక్ప‌థం యొక్క ప్రాముఖ్యం, భ‌యాన్ని అధిగమించడం, ఇంకా ఒక్కటి గా జీవించడం- అది ప్ర‌స్తుత ఘడియ తోనైనా, లేదా ప్ర‌కృతి మాత తో నైనా. మీరు ఈ గొప్ప నేల లో జ‌న్మించారు.

ఈ కార‌ణం గా ఈ ల‌క్ష‌ణాలు మీకు స్వాభావికం గా క‌న‌బ‌డుతాయి. అంతేకాదు, అవి మీ వ్య‌క్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. నేను య‌వ్వ‌నం లో ఉన్న‌ప్పుడు ఈ ల‌క్ష‌ణాల కోసం నేను చేసిన అన్వేష‌ణ న‌న్ను ఏకం గా హిమాల‌యాల కు తీసుకొని పోయింది. ఈ ఘ‌న‌మైన భూమి పుత్రుని గా నేను మీకు నమ్మకం గా ఒక విషయాన్ని చెప్ప‌గ‌లుగుతాను. అది- మ‌న ప్ర‌పంచం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల కు ప‌రిష్కార మార్గాల‌ ను వెత‌క‌డం లో మీరు తోడ్ప‌ాటును అందించగ‌ల‌రు- అనే విషయం.

అవును, మ‌న‌కు స‌వాళ్ళు ఉన్నాయి. అయితే, ప్ర‌తి ఒక్క స‌వాలు కు వాటిని అధిగ‌మించ‌డం కోసం క్రొత్త ర‌కాల లో ప‌రిష్కార మార్గాల‌ ను అన్వేషించ‌గ‌ల యువ మ‌స్తిష్కాలు మ‌న‌కు ఉన్నాయి. ఏ ప‌రిమితి అయినా సరే మిమ్మ‌ల్నిఅడ్డ‌గించ‌నీయ‌కండి.

మీ అంద‌రి కీ నేను చెప్ప‌ద‌ల‌చుకున్నా- ఇప్పుడు య‌వ్వ‌నం లో ఉండ‌డం క‌న్నా మెరుగైన కాలం అంటూ లేదు అన్న సంగతి ని. ఇప్పటి ప్ర‌పంచం ఇదివ‌ర‌క‌టి కాలం తో పోలిస్తే మ‌రిన్ని అవ‌కాశాల ను ఇవ్వ‌జూపుతోంది. అసాధార‌ణ‌మైన కార్యాల ను పూర్తి చేయ‌గ‌ల సామ‌ర్ధ్యం మ‌రియు శ‌క్తి మీకు ఉన్నాయి. ఇవి త‌రాల‌ త‌ర‌బ‌డి ప్ర‌భావాన్ని ప్ర‌స‌రించగలుగుతాయి. మీ మ‌న‌స్సు ఏం చెప్పేదీ తెలుసుకొని, మరి పూర్తి ఉద్వేగం తో దానిని అనుసరించండి.

మిత్రులారా,

భార‌త‌దేశం-భూటాన్ స‌హ‌కారం శ‌క్తి, ఇంకా జ‌ల విద్యుత్తు రంగాల లో మార్గ‌ద‌ర్శ ప్రాయం గా ఉంది. ఈ సంబంధం లోని వాస్త‌వ‌మైన శ‌క్తి మ‌న ప్ర‌జ‌లే. కాబ‌ట్టి, ప్ర‌జ‌ల కు ప్రాధాన్యాన్ని ఇవ్వ‌వ‌ల‌సి ఉంది. ఈ సంబంధాని కి కేంద్ర బిందువు గా ఎల్ల‌ప్ప‌టి కీ ప్ర‌జ‌లే ఉంటారు. ఈ సంద‌ర్శ‌న లో ఈ యొక్క స్ఫూర్తి తాలూకు ప‌రిణామాలు స్ప‌ష్టం గా క‌నిపిస్తున్నాయి. సంప్ర‌దాయక స‌హ‌కార రంగాల ను దాటి ముందుకు వెళ్ళి మ‌న‌ము స‌రిక్రొత్త సీమ‌ల లో స‌హ‌క‌రించుకోవాల‌ని త‌ల‌పోస్తున్నాము. అది ఏమిటంటే, పాఠ‌శాల‌ ల మొద‌లు అంత‌రిక్షం వ‌ర‌కు, డిజిట‌ల్ పేమెంట్స్ నుండి వైప‌రీత్యాల నిర్వ‌హ‌ణ వ‌ర‌కు. ఈ అన్ని రంగాల లో మ‌న స‌హ‌కారం మీ వంటి యువ మిత్రుల పై ఒక ప్ర‌త్య‌క్ష ప్ర‌భావాన్ని క‌ల‌గ‌జేస్తుంది. న‌న్ను కొన్ని ఉదాహ‌ర‌ణ ల‌ను చెప్ప‌నివ్వండి. నేటి యుగం లో పండితుల‌ ను మ‌రియు విద్యారంగ ప్ర‌ముఖుల ను స‌రిహ‌ద్దుల కు అతీతం గా సంధానించ‌డం ఎంతో కీల‌కం గా ఉంది. ఇలా చేయ‌డం ద్వారా మ‌న విద్యార్థుల లో ప్ర‌తిభ ను, సృజ‌నాత్మక‌త ను ప్ర‌పంచం లో మెరుగైన వాటి తో తుల‌తూగేట‌ట్లుగా చూడ‌వ‌చ్చును. భార‌త‌దేశాని కి చెందిన నేశ‌న‌ల్ నాలెడ్జ్ నెట్ వ‌ర్క్ కు మ‌రియు భూటాన్ కు చెందిన డ్రూక్ రెన్ కు మ‌ధ్య స‌హ‌కారం నిన్న‌టి రోజు న వాస్త‌వ రూపాన్ని దాల్చింది. అది ఈ ప్ర‌యోజ‌నాన్ని సాధించేందుకు తోడ్ప‌డ‌నుంది.

అది మ‌న విశ్వ‌విద్యాల‌యాలు, ప‌రిశోధ‌క సంస్థ‌లు, ప్ర‌యోగ‌శాల‌ లు, ఆరోగ్య సంర‌క్ష‌ణ సంస్థ‌ లు మ‌రియు వ్య‌వ‌సాయిక సంస్థ‌ల న‌డుమ ఒక భ‌ద్ర‌మైన మ‌రియు వేగ‌వంత‌మైన సంధానాన్ని స‌మ‌కూర్చ‌గ‌ల‌దు. ఈ సౌక‌ర్యాన్ని పూర్తి స్థాయి లో వినియోగించుకోవలసిందంటూ మీ అంద‌రి కి నేను విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.

మిత్రులారా,

మ‌రొక్క ఉదాహ‌ర‌ణ ఏమిటి అంటే, అది రోద‌సి లోని ఎల్ల‌లు. ఈ క్ష‌ణాన భార‌త‌దేశం యొక్క రెండ‌వ చంద్ర‌యాన్ చంద్ర‌గ‌హాని కి చేరే మార్గం లో ప‌య‌నిస్తోంది. 2022వ సంవ‌త్స‌రం క‌ల్లా మేము భార‌త‌దేశం లో ఒక‌రిని అంత‌రిక్షం లోకి, అది కూడాను ఒక భార‌తీయ అంత‌రిక్ష నౌక ద్వారా పంపించాల‌నుకొంటున్నాము. ఇవి అన్నీ కూడా భార‌త‌దేశం యొక్క స్వీయ కార్య సాధ‌న యొక్క ఫ‌లితాలే. మాకు అంత‌రిక్ష కార్య‌క్ర‌మం అనేది కేవ‌లం జాతీయ అతిశ‌యం తో ముడిప‌డిన అంశం కాదు. అది జాతీయ అభివృద్ధి కి మ‌రియు ప్ర‌పంచ స్థాయి స‌హ‌కారాని కి ఒక కీల‌క‌మైన‌టువంటి సాధ‌నం గా ఉంది.

మిత్రులారా,

నిన్న‌టి రోజు న ప్ర‌ధాని శ్రీ శెరింగ్ తో పాటు నేను కూడా క‌ల‌సి థింపూ గ్రౌండ్ స్టేశ‌న్ ను ప్రారంభించాం. అలాగే, మ‌న యొక్క రోద‌సి స‌హ‌కార ప‌రిధి ని విస్త‌రించాము. ఉప‌గ్ర‌హాల ద్వారా టెలి-మెడిసిన్‌, దూర విద్య‌, రిసోర్స్ మ్యాపింగ్‌, వాతావ‌ర‌ణ సంబంధి ముంద‌స్తు అంచ‌నా మ‌రియు ప్రాకృతిక విప‌త్తుల ప‌ట్ల హెచ్చ‌రిక‌ లు సుదూర ప్రాంతాల‌ కు సైతం చేరుకోగ‌లుగుతాయి. భూటాన్ యొక్క సొంత చిన్న ఉప‌గ్ర‌హాన్ని రూపొందించ‌డాని కి మరియు దాని ని ప్ర‌యోగించ‌డాని కి సంబంధించిన ప‌నుల‌ ను పూర్తి చేయ‌డం కోసం భూటాన్ కు చెందిన యువ శాస్త్రవేత్త‌లు భార‌త‌దేశాని కి వెళ్ళ‌నుండడం ఎంతో సంతోషదాయకం. ఏదో ఒకనాటికి మీలో చాలా మంది త్వరలోనే శాస్త్రవేత్త‌లు గా, ఇంజినీర్లు గా, ఇంకా నూత‌న ఆవిష్క‌ర్తలు గా అవుతార‌ని నేను ఆశ‌ప‌డుతున్నాను.

మిత్రులారా,

శ‌తాబ్దాల త‌ర‌బ‌డి విద్య‌, ఇంకా జ్ఞాన స‌ముపార్జ‌న భార‌త‌దేశాని కి, భూటాన్ కు మ‌ధ్య సంబంధాల లో కేంద్ర బిందువు గా నిల‌చాయి. ప్రాచీన కాలం లో బౌద్ధ ఉపాధ్యాయులు మరియు పండితులు మ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య జ్ఞాన సేతువు ను నిర్మించారు. ఇది ఒక అమూల్య‌మైనటువంటి వార‌స‌త్వం. దీని ని ప‌రిర‌క్షించాల‌ని, ప్రోత్స‌హించాల‌ని మేము అభిల‌షిస్తున్నాము. అందువ‌ల్ల మేము భూటాన్ నుండి మ‌రింత మంది బౌద్ధ విద్యార్థుల ను నాలందా విశ్వ‌విద్యాల‌యం వంటి సంస్థ‌ల లోకి ఆహ్వానిస్తున్నాం. నాలందా విశ్వ‌విద్యాల‌యం ప్ర‌పంచం లో ఒక చ‌రిత్రాత్మ‌క బౌద్ధ జ్ఞాన కేంద్రం గా పేరు తెచ్చుకొంది. దీనిని 1500 సంవ‌త్స‌రాల క్రితం అది ఎక్క‌డ అయితే ఉండేదో అదే చోటు లో పున‌రుద్ధ‌రించ‌డం జ‌రిగింది. మ‌న మ‌ధ్య ఉన్న జ్ఞాన స‌ముపార్జ‌న బంధం పాత‌దే కాక న‌వీన‌మైంది కూడా. 20వ శ‌తాబ్దం లో ఎంతో మంది భార‌తీయులు భూటాన్ కు ఉపాధ్యాయులు గా వచ్చారు. భూటాన్ పౌరుల లో పాత త‌రాల‌ కు చెందిన‌ వారు ఎక్కువ మంది వారి యొక్క విద్యార్జ‌న కాలం లో క‌నీసం ఒక భార‌తీయ గురువు వ‌ద్ద పాఠాల ను నేర్చుకొన్నారు. వారి లో కొంద‌రి ని రాజు గారు కిందటి సంవ‌త్స‌రం స‌త్క‌రించారు. ఈ ఔదార్య‌ భ‌రిత‌మైన‌ మ‌రియు కృపా పూరిత‌మైన‌ చ‌ర్య‌ కు గాను మేము కృత‌జ్ఞులమై ఉన్నాము.

మిత్రులారా,

ఏ కాలాన్ని తీసుకొన్న‌ా, భూటాన్ కు చెందిన నాలుగు వేల‌మంది కి పైగా విద్యార్థులు భార‌త‌దేశం లో విద్య‌ ను అభ్య‌సించ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చును. ఈ సంఖ్య పెరగగలదు, ఈ సంఖ్య పెర‌గాలి కూడాను. మ‌నం మ‌న దేశాల ను అభివృద్ధి ప‌ర‌చుకోవ‌డం కోసం క‌దం తొక్కుతున్న కొద్దీ, ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులకు లోనయ్యే సాంకేతిక విజ్ఞాన సంబంధి ముఖ‌ చిత్రాని కి అనుగుణం గా వేగాన్ని అందుకోవల‌సిన అవ‌స‌రం మనకు కూడా ఉంది. మరి, ఈ కార‌ణం గా, మ‌నం క్రొత్త‌ గా ఆవిర్భ‌విస్తున్న‌టువంటి సాంకేతిక పరిజ్ఞానాల లోను, విద్య లోను స‌మ‌న్వ‌యాన్ని సాధించుకోవడం ముఖ్యం.

భార‌త‌దేశం లోని ప్ర‌తిష్టాత్మ‌క ఐఐటి ల‌కు మ‌రియు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌టువంటి ఈ విశ్వ‌విద్యాల‌యాని కి మ‌ధ్య అనుబంధం లో క్రొత్త అధ్యాయాల ను నిన్న‌టి రోజు న మేము మొద‌లు పెట్టడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఇవి స‌మ‌న్వ‌యభ‌రిత‌మైన‌ విద్యార్జ‌న , ప‌రిశోధ‌న లలో మ‌రిన్ని మైలురాళ్ళ కు దారి తీస్తాయ‌ని నేను ఆశిస్తున్నాను.

మిత్రులారా,

ప్ర‌పంచం లోని ఏ మూల‌నైనా మ‌నం భూటాన్ తో మీరు జ‌త ప‌ర‌చేది ఏమిటి? అన్న ప్ర‌శ్న‌ ను అడిగామా అంటే గ‌నుక, వ‌చ్చే స‌మాధానం గ్రాస్ నేశ‌న‌ల్ హ్యాపీనెస్ అనే భావ‌నే. నేను ఏమీ ఆశ్చ‌ర్య‌చ‌కితుడిని కావ‌డం లేదు. భూటాన్ సంతోషం యొక్క సారాన్ని అర్థం చేసుకొన్న‌ది. సామ‌ర‌స్యం, క‌ల‌సి ఉండ‌డం, ఇంకా ద‌య ల యొక్క స్ఫూర్తి ని భూటాన్ గ్రహించింది. ఈ స్ఫూర్తి నిన్న‌టి రోజు న నాకు స్వాగ‌తం ప‌ల‌క‌డం కోసం వీధుల లో బారులు తీరిన ముద్దులు మూట‌గ‌ట్టే బాల‌ల వ‌ద‌నాల లో నుండి వెలుగుల‌ ను విర‌జిమ్మింది. వారి చిరు ద‌ర‌హాసాల ను నేను ఎప్ప‌టి కీ జ్ఞాప‌కం పెట్టుకొంటాను.

మిత్రులారా,

స్వామి వివేకానందుల వారు చెప్పారు. ఏమని అంటే ‘‘ప్ర‌తి దేశానికి అది ఇవ్వ‌వ‌ల‌సిన ఒక సందేశం, అది పూర్తి చేయ‌వ‌ల‌సిన‌టువంటి ఒక యాత్ర, అది చేరుకోవ‌ల‌సిన‌టువంటి ఒక గ‌మ్య స్థానం ఉంటాయి’’ అని. మాన‌వాళి కి భూటాన్ ఇచ్చే సందేశం ఏమిటి అంటే, అది సంతోషం. సంతోషం అనేది స‌ద్భావ‌న నుండి మొల‌కెత్తుతుంది. మ‌రింత సంతోషం ద్వారా ఈ ప్ర‌పంచం మ‌న‌గ‌లుగుతుంది. సంతోషం అనేది మ‌తిలేని ద్వేష‌ భావం పైన పైచేయి ని సాధించే తీరాలి. ప్ర‌జ‌లు గ‌నుక సంతోషం గా ఉన్నారంటే, అప్పుడు స‌మ‌ర‌స భావం నెల‌కొంటుంది. స‌మ‌ర‌స భావం ఎక్క‌డ ఉంటుందో, అక్క‌డ శాంతి విక‌సిస్తుంది. స‌మాజాలు స్థిర‌మైన అభివృద్ధి ని సాధించ‌డం ద్వారా పురోగ‌తి ని అందుకోవ‌డంలో స‌హాయ‌కారి గా నిల‌చేది శాంతి యే. అభివృద్ధి ని సంప్ర‌దాయాల‌ తోను, పర్యావరణం తోను సంఘ‌ర్ష‌ించేది గా చూడ‌టం తరచు గా జ‌రుగుతూవున్నటువంటి కాలం లో, భూటాన్ నుండి ప్రపంచం నేర్చుకోవ‌ల‌సింది ఎంతో ఉంది. ఇక్క‌డ అభివృద్ధి, ప‌ర్యావ‌ర‌ణం మ‌రియు సంస్కృతి ఒక‌దాని తో మ‌రొటి డీకొన‌డం లేదు. అవి స‌మ‌న్వ‌యం తో ఉంటున్నాయి. మీ యువ‌తీయువ‌కుల‌ కు సృజ‌నాత్మ‌క‌త‌, శ‌క్తి, ఇంకా నిబ‌ద్ధ‌త ఉన్న కార‌ణం గా మ‌న దేశాలు ఒక నిలుక‌డత‌నం క‌లిగిన భ‌విష్య‌త్తు కు అవ‌స‌ర‌మైన అన్నింటినీ చేజిక్కించుకోగ‌లుగుతాయి. అది నీటి ని ఆదా చేయ‌డం కావ‌చ్చు, లేదా మ‌నుగ‌డ క‌లిగిన వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తులు కావ‌చ్చు, లేదా మ‌న స‌మాజాల ను ఒక‌సారి మాత్ర‌మే వాడే ప్లాస్టిక్ నుండి విముక్తం చేయ‌డం కావ‌చ్చు.

మిత్రులారా,

క్రితం సారి నేను భూటాన్ ను సంద‌ర్శించిన‌ప్పుడు ప్ర‌జాస్వామ్య దేవాల‌య‌మైన భూటాన్ పార్ల‌మెంటు ను సంద‌ర్శించే ప్ర‌త్యేక అధికారం నాకు ద‌క్కింది. ఈ రోజు న ఈ విద్యార్జ‌న మందిరాన్ని సంద‌ర్శించే గౌర‌వం నాకు ల‌భించింది. ఈ రోజు న మ‌నం భూటాన్ పార్ల‌మెంటు యొక్క గౌర‌వనీయ స‌భ్యుల‌ ను శ్రోత‌లు గా క‌లిగి ఉన్నాము. వారి ప్ర‌సిద్ధమైనటువంటి హాజ‌రు ప‌ట్ల నేను ప్ర‌త్యేకించి వారి కి ధ‌న్య‌వాదాలు తెలియజేస్తున్నాను. ప్ర‌జాస్వామ్య‌ం, విద్య.. ఈ రెండూ కూడా మ‌న‌ల‌ ను స్వేచ్ఛ వైపున‌కు తీసుకు పోతాయి. ఒక‌టి లేకుండా మ‌రొక‌టి ఎన్న‌టికీ పూర‌కం కానేర‌దు. మ‌రి రెండూ కూడా మ‌న పూర్తి సత్తా ను సాధించుకోవ‌డం లో మ‌న‌కు తోడ్ప‌డుతాయి. ఈ విద్యా కేంద్రం మ‌న‌లోని పరిశీలన స్ఫూర్తి కి మ‌రొక్క‌మారు రెక్కలు తొడుగుతుంది. మ‌రి మ‌న లోప‌లి విద్యార్థి ని సజీవంగా ఉంచుతుంది కూడాను.

ఈ ప్ర‌య‌త్నాల లో భూటాన్ బ‌ల‌ప‌డుతున్న కొద్దీ మీ యొక్క 1.3 బిలయన్ భార‌తీయ స్నేహితులు ఊరికే చూస్తూ కూర్చోవడం కాకుండా మిమ్మ‌ల్ని సంతోషం గా ఉండేటట్టు, మీరు గర్వపడేటట్టు ఉల్లాస పరుస్తారు. అయితే, వారు మీతో జ‌ట్టు క‌డ‌తారు కూడాను. మీ కు నేర్పుతారు, మీ వద్ద నుండి నేర్చుకుంటారు కూడాను. ఈ మాట‌ల‌ తో, రాయ‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ భూటాన్ యొక్క కుల‌ప‌తి, మాన్య శ్రీ రాజు గారి కి, విశ్వ‌విద్యాల‌య ఉప కుల‌ప‌తి కి, ఇంకా విశ్వవిద్యాల‌య ఫేకల్టీ తో పాటు మీ అందరి కి- నా యువ మిత్ర లోకానికి- ధ‌న్య‌వాదాల ను తెలియ‌జేయదలుస్తున్నాను.

మీరు నాకు ఆహ్వానాన్ని పంపించడం ద్వారా న‌న్ను గౌర‌వించారు. మ‌రి మీరు నాకు చాలా కాలాన్ని వెచ్చించారు. ఇంకా నా పట్ల శ్ర‌ద్ధ ను చూపారు, అనురాగాన్ని పంచారు. మీ అంద‌రి వ‌ద్ద నుండి నేను చాలా సంతోషాన్ని, స‌కారాత్మ‌క‌మైన‌టువంటి శ‌క్తి ని పొంది వెనుదిరుగనున్నాను.

మీకంద‌రికీ అనేకానేక ధన్యవాదాలు.

తాశీ దెలక్!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to attend Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India
December 22, 2024
PM to interact with prominent leaders from the Christian community including Cardinals and Bishops
First such instance that a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India

Prime Minister Shri Narendra Modi will attend the Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India (CBCI) at the CBCI Centre premises, New Delhi at 6:30 PM on 23rd December.

Prime Minister will interact with key leaders from the Christian community, including Cardinals, Bishops and prominent lay leaders of the Church.

This is the first time a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India.

Catholic Bishops' Conference of India (CBCI) was established in 1944 and is the body which works closest with all the Catholics across India.