ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘పరీక్షా పే చర్చా 2.0’’లో భాగం గా నేడు న్యూ ఢిల్లీ లోని తాల్‌కటోరా స్టేడియం లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల తో సంభాషించారు. తొంబై నిముషాల కు పైగా జరిగిన ఈ ముఖాముఖి లో విద్యార్థులు, టీచర్ల తో పాటు తల్లితండ్రులు మధ్య మధ్య సేదతీరారు; ఒకింత హాస్యం, ఒకింత చమత్కారం కలగలసినటువంటి ప్రధాన మంత్రి అభిప్రాయాల కు వారు పదే పదే హర్షధ్వానాలు చేశారు.
ఈ సంవత్సరం ఈ కార్యక్రమం లో దేశం అంతటి నుండి విద్యార్థులే కాకుండా విదేశాల లో ఉంటున్న భారతీయ విద్యార్థులు కూడా పాలుపంచుకొన్నారు.
ప్రధాన మంత్రి సంభాషణ కు తగిన వాతావరణాన్ని కల్సిస్తూ పరీక్షా పే చర్చ సాగే పుర మందిరం ఒక బుల్లి భారతదేశం లాగా ఉందని వర్ణించారు. ఇది భారతదేశం యొక్క భవిష్యత్తు కు ప్రతీక గా కూడా ఉందని ఆయన అన్నారు. తల్లితండ్రులు మరియు గురువులు సైతం ఈ కార్యక్రమం లో భాగం అయ్యారని చెప్తూ ఆయన ఆనందాన్ని వెలిబుచ్చారు.
తమ పిల్లలు వ్రాయాల్సిన పరీక్ష ల విషయం లో ఒత్తిడి ని ఎదుర్కొనే తల్లితండ్రుల కు మరియు వాస్తవానికి భిన్నమైన అంచనాల ను కలిగి వుండేటటువంటి తల్లిదండ్రుల కు గురువులు ఏమి చెప్పాలని ప్రధాన మంత్రి ని ఒక టీచరు అడిగారు. యుపిఎస్‌సి పరీక్ష కు సిద్ధమవుతున్న ఒక విద్యార్థి కూడా ఇటువంటి కోవ కే చెందిన ఒక ప్రశ్న ను అడిగారు. ప్రధాన మంత్రి సమాధానమిస్తూ, పరీక్ష ప్రభావాని కి ఎంత మాత్రం లోనవకుండా ఉండండనే సలహా ను తాను ఎవ్వరికీ ఇవ్వబోనని, పరీక్ష యొక్క సారాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమన్నారు. ఒక పరీక్ష అనేది జీవితాని కి సంబంధించిన పరీక్షా ? లేక, అది పదో తరగతో లేదా పన్నెండో తరగతో అనే ఒక ఫలానా గ్రేడ్ కు సంబంధించినటువంటి పరీక్షా ? అంటూ సభ లోని వారి కి ఆయన ఎదురుప్రశ్న ను వేశారు. ఒకసారి గనక ఈ సందర్భాన్ని గ్రహించామంటే, అప్పుడు ఒత్తిడి తగ్గిపోతుంది అని ఆయన చెప్పారు.
తల్లితండ్రులు వారు పండించుకోనటువంటి వారి సొంత కలల ను వారి యొక్క పిల్లలు నెరవేర్చాలని ఆశించకూడదని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఒక్క బాలుడి కి లేదా బాలిక కు వారిదైన సొంత సత్తా మరియు శక్తులు ఉంటాయని, ప్రతి చిన్నారి లోని ఈ సానుకూలమైనటువంటి అంశాల ను అర్థం చేసుకోవడం ముఖ్యమని ఆయన చెప్పారు.
అపేక్షలు పెట్టుకోవడం అవసరమే అని ప్రధాన మంత్రి చెప్పారు. మనం నిరాశాపూరితమైనటువంటి మరియు సంతోషానికి తావు లేనటువంటి వాతావరణం లో మనుగడ ను సాగించలేం అని ఆయన నొక్కి పలికారు.
తల్లితండ్రుల యొక్క ఒత్తిడి, తల్లిదండ్రుల వద్ద నుండి వచ్చే ఒత్తిడి అనే అంశాల కు సంబంధించి కొన్ని ప్రశ్నల కు ప్రధాన మంత్రి జవాబిస్తూ, పిల్లల ప్రదర్శన వారి తల్లిదండ్రుల పరిచయ కార్డు కాకూడదని పేర్కొన్నారు. ఒకవేళ ఇదే లక్ష్యం అయినటువంటి పక్షం లో, అంచనాలు అనేవి అర్థం లేనివి గా మారిపోతాయి అని ఆయన అన్నారు. మోదీ ప్రధాన మంత్రి గా వచ్చి అంచనాల ను పెంచివేశారనేది కొద్ది మంది కి ఏర్పడిన అభిప్రాయం అని ఆయన చెప్పారు. 1.25 బిలియన్ మంది భారతీయులు 1.25 బిలియన్ ఆకాంక్షల ను కలిగివుండాలనేది తన అభిప్రాయమని ఆయన అన్నారు. ఆ ఆకాంక్ష లను సైతం వ్యక్తపరచాలని, మరి ఆ ఆకాంక్షల ను నెరవేర్చుకోవడం కోసం మనం అందరం మన యొక్క సామర్ధ్యాల ను ఉమ్మడి గా పెంచి పోషించుకోవాలని ఆయన చెప్పారు.
ఒక మాతృమూర్తి తన బాబు ఒకప్పుడు చక్క గా చదివే వాడని, అయితే ప్రస్తుతం ఆన్‌లైన్ క్రీడ లతో అతడి కి ధ్యాన భంగం అయిందంటూ భయాందోళన లను వ్యక్తం చేశారు. దీని కి ప్రధాన మంత్రి బదులిస్తూ, సాంకేతిక విజ్ఞానం పట్ల స్పృహ ను కలిగివుండటం అనేది విద్యార్థుల కు దానంతట అదే చెడు చేస్తుందని తాను నమ్మనన్నారు. విద్యార్థులు కొత్త సాంకేతిక విజ్ఞానం తో పరిచయాన్ని పొందడం మంచిదే అని తాను విశ్వసిస్తానని ఆయన చెప్పారు. అయితే, సాంకేతిక విజ్ఞానం బుద్ధి వికసించేందుకు దారి తీయాలని ఆయన అన్నారు. అది నూతన అంశాల కు ఒక సాధనం కావాలి అని ఆయన సూచించారు. ప్లేస్టేశన్ మంచిదే, అయితే ఎవరూ ఆటమైదానాన్ని మరచిపోకూడదు అని ఆయన అన్నారు.
సమయ నిర్వహణ ను గురించి మరియు నిస్సత్తువ కు లోనవడాన్ని గురించి అడిగిన ఒక ప్రశ్న కు ప్రధాన మంత్రి సమాధానం చెప్తూ, దేశం లోని యావత్తు 1.25 బిలియన్ మంది భారతీయులు తన కు కుటుంబ సభ్యులు అని చెప్పారు. ఎవరైనా ఒక వ్యక్తి తన పరివారం కోసం పనిచేస్తున్నప్పుడు, అతడు అలసట కు ఎలా లోనవగలడు ? అని ఆయన అన్నారు. ప్రతి ఒక్క కొత్త రోజు న తాను తన పనుల ను కొత్త శక్తి తో పున: ప్రారంభిస్తానని ఆయన తెలిపారు.
చదువుకోవడాన్ని ఏ విధం గా మరింత ఆనందదాయకం గా మార్చుకోవచ్చని , అలాగే పరీక్షలు అనేవి ఏ విధం గా ఒకరి వ్యక్తిత్వాన్ని మెరుగు పరచగలుగుతాయంటూ ప్రధాన మంత్రి ని విద్యార్థులు అడిగారు. సరైన భావన తో పరీక్ష లకు హాజరు కావడం ప్రధానం అని ప్రధాన మంత్రి జవాబిచ్చారు. పరీక్షల తో ఒక వ్యక్తి మరింత శక్తి గల వాడి గా మారుతాడని, మరి వాటిని ఎవ్వరూ యిష్టపడకుండా ఉండరాదని ఆయన అన్నారు.
విషయం పైన, వృత్తి జీవనం తాలూకు ఎంపిక పైన విద్యార్థులు ప్రధాన మంత్రి వద్ద నుండి సలహాల ను పొందగోరారు. ప్రతి ఒక్క విద్యార్థి కి వేరు వేరు బలాలు అంటూ ఉంటాయని, అందువల్ల ప్రతి ఒక్క విద్యార్థి గణితం లో, విజ్ఞాన శాస్త్రం లో చక్కగా రాణించే అవసరం ఏమీ లేదనే అభిప్రాయాన్ని వారు వెలిబుచ్చారు. దీని కి ప్రధాన మంత్రి సమాధానమిస్తూ, ఆలోచన లో స్పష్టత మరియు ఆత్మవిశ్వాసం ఉండి తీరాలని పేర్కొన్నారు. అవును, విజ్ఞాన శాస్త్రం, ఇంకా గణితం అవసరమే, కానీ అన్వేషించదగ్గ ఇతర విషయా లు సైతం ఉన్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం అవకాశాలు లభిస్తున్న రంగాలు అనేకం ఉన్నాయని ప్రధాన మంత్రి తెలిపారు.
ఇదే అంశం పై గత సంవత్సరం జరిగిన పుర మందిర సంభాషణ ను ఒక విద్యార్థి గుర్తు కు తెచ్చి, పరీక్షలు, ఇంకా వృత్తి జీవనం వంటి అంశాల కు వచ్చే సరికి ఇప్పుడు తన తల్లితండ్రులు ఇదివరకటి తో పోలిస్తే మరింత ఎక్కువ భరోసా తో ఉన్నట్లు కనిపిస్తున్నారని చెప్పారు. తల్లితండ్రుల యొక్క సానుకూల వైఖరి పిల్లల జీవితాల లో పెద్ద పాత్ర ను పోషిస్తుందని ఆయన అన్నారు.
బాలల ను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి దృష్టి కి విద్యార్థులు తీసుకువచ్చారు. దీనికి ఆయన ప్రతిస్పందిస్తూ, ఇతరుల తో పోటీ పడటం కాకుండా గతం లోని స్వీయ ప్రదర్శన ను మెరుగుపరచుకోవడం కోసం పోటీ పడాలన్నారు. ఒకవేళ ఒక వ్యక్తి తన గత ప్రదర్శన తో పోటీ ని పెట్టుకొంటే, అటువంటప్పుడు నిరాశావాదాన్ని మరియు నకారాత్మకత ను సులువుగా ఓడించవచ్చని చెప్పారు.
విద్యా వ్యవస్థ లకు మరింత గా మెరుగులు దిద్దవలసిన అవసరాన్ని గురించి, అలాగే బట్టీ పట్టడానికి పరీక్ష లు అనే విధం గా పరీక్షలు మిగిలాయని; అంత కన్నా విద్యార్థులు ఏమి ఆకళింపు చేసుకొన్నారనేది కూడా పరీక్ష లు రుజువు చేయాలంటూ విద్యార్థులు ప్రస్తావించారు.
ప్రధాన మంత్రి తన వంతు గా చెప్తూ, మన జ్ఞానార్జన ఒక్క పరీక్షల కే పరిమితం కాకూడదన్నారు. మన విద్య జీవితం లోని వేరు వేరు సవాళ్ళ ను ఎదుర్కొనేటటువంటి సత్తా ను మన కు ఇవ్వాలన్నారు.
విచారం అనే అంశం పై ప్రధాన మంత్రి మాట్లాడుతూ, మన దేశం వంటి దేశం లో ఈ అంశం ఆందోళనకరం అని పేర్కొన్నారు. దీని కి ఎదురొడ్డి నిలచేటటువంటి మరియు దీనిని దూరం చేసేటటువంటి ఉపాయాలు భారతీయ సంస్కృతి లో ఉన్నాయని ఆయన చెప్పారు. వ్యాకులత కు గురి కావడం మరియు మానసిక స్వస్థత కు సంబంధించిన వ్యవహారాల ను గురించి మనం ఎంత బాహాటం గా చర్చించుకొంటే అంత మంచి జరుగుతుందని ఆయన వివరించారు.
ఒక వ్యక్తి ఉన్నట్టుండి స్తబ్దత కు లోనవడం జరగదు అని ఆయన అన్నారు. ఒక మనిషి కుంగుబాటు దిశ గా సాగుతున్నట్టు తెలిపే కొన్ని సంకేతాలు స్పష్టంగా కనుపిస్తాయని, ఈ సంకేతాల ను ఉపేక్షించడం మంచి ఆలోచన కాదని చెప్పిరు. దీని కి భిన్నం గా మనం దీనిని గురించి పదే పదే మాట్లాడుకోవాలని ప్రధాన మంత్రి చెప్పారు. సలహాలు ఇవ్వడం సహాయకారి కాగలదని, ఎందుకంటే ఈ కౌన్సెలింగ్ వల్ల వ్యక్తి తన సమస్యల విషయమై ఎక్కువ సేపు మాట్లాడుతాడని ప్రధాన మంత్రి అన్నారు.
This #ParikshaPeCharcha2 Townhall is a mini-India. It is also a place where we have in our midst the future of India.
— PMO India (@PMOIndia) January 29, 2019
I am happy parents and teachers too are part of the programme: PM @narendramodi
A teacher from Kolkata, Rulee Dutta Ji asks PM @narendramodi what teachers should tell parents who are stressed about the exams of their children and have unreal expectations.
— PMO India (@PMOIndia) January 29, 2019
A student from Kerala who is in Delhi preparing for the UPSC exam also asks a similar question.
I can not say- do not be totally relaxed before an exam....
— PMO India (@PMOIndia) January 29, 2019
But, ask yourselves if this an exam of your life or is it just an exam for a particular grade like Class X or XII?
Once you know the answer to this, your pressure will reduce: PM @narendramodi #ParikshaPeCharcha2
I would request parents- do not expect your children to fulfil your unfulfilled dreams.
— PMO India (@PMOIndia) January 29, 2019
Every child has his or her own potential and strengths...it is important to understand these positives of every child: PM @narendramodi #ParikshaPeCharcha2
Expectations are essential....we can't be living in an atmosphere of despair and unhappiness.
— PMO India (@PMOIndia) January 29, 2019
When people have aspirations from a person, it is good: PM @narendramodi #ParikshaPeCharcha2
Krishna Kumar Sharma from Jammu is asking PM @narendramodi on parents being tension free during exams. Pebam Nila Kumari from Manipur also asks a similar question.
— PMO India (@PMOIndia) January 29, 2019
Lavanya, a viewer of @TimesNow asks PM- how can we overcome parental pressure during exam time. #ParikshaPeCharcha2
I hope parents do not make the report card of their children their own visiting cards...because if that is the aim then the expectations from children become unreal: PM @narendramodi #ParikshaPeCharcha2
— PMO India (@PMOIndia) January 29, 2019
लोग कहते हैं मोदी ने बहुत aspirations जगा दिए हैं, मैं तो चाहता हूं कि सवा सौ करोड़ देशवासियों के सवा सौ करोड़ aspirations होने चाहिए: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 29, 2019
हमें उन aspirations को उजागर करना चाहिए देश तभी चलता है। अपेक्षाओं के बोझ में दबना नहीं चाहिए। हमें अपेक्षाओं को पूरा करने के लिए अपने आपको सिद्ध करना चाहिए: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 29, 2019
Madhumita Sen Gupta from Assam (living in Delhi) says- my son is in Class IX...earlier he was good in studies but now he is too distracted by online games. #ParikshaPeCharcha2
— PMO India (@PMOIndia) January 29, 2019
I will not say exposure to technology is a bad thing for students.
— PMO India (@PMOIndia) January 29, 2019
It is good students are getting acquainted with new technology: PM @narendramodi
Technology should lead to expansion of the mind and as a means to innovate: PM @narendramodi #ParikshaPeCharcha2
— PMO India (@PMOIndia) January 29, 2019
The PlayStation is good but never forget the playing field: PM @narendramodi #ParikshaPeCharcha2
— PMO India (@PMOIndia) January 29, 2019
Naren from Tamil Nadu asks PM @narendramodi on aspects relating to time management. #ParikshaPeCharcha2
— PMO India (@PMOIndia) January 29, 2019
मेरे लिए सवा सौ देशवासी मेरा परिवार है। जब सवा सौ करोड़ देशवासी मेरा परिवार है तो मैं थकान महसूस नहीं करता हूं।
— PMO India (@PMOIndia) January 29, 2019
हर पल मैं सोचता हूं, रात को जब सोने जाता हूं तो सुबह का सोच कर जाता हूं, और नई उमंग, नई ऊर्जा के साथ आता हूं: PM @narendramodi
Amit from Pathankot is asking PM @narendramodi during #ParikshaPeCharcha2 on how to make studies more fun.
— PMO India (@PMOIndia) January 29, 2019
A student from Kathmandu asks the PM on how exams help improve one's personality.
कसौटी बुरी नहीं होती, हम उसके साथ किस प्रकार के साथ deal करते है उसपर depend करता है। मेरा तो सिद्धांत है कि कसौटी कसती है, कसौटी कोसने के लिए नहीं होती है: PM @narendramodi #ParikshaPeCharcha2
— PMO India (@PMOIndia) January 29, 2019
Mohammed Salim, a student from the Aligarh Muslim University asks PM @narendramodi - what must be our considerations while picking subject choices and career choices.
— PMO India (@PMOIndia) January 29, 2019
Shambhavi from Banaras Hindu University asks- how can one pick a good career and prepare well for exams.
A viewer of @NewsNationTV comments that every child has different strengths. How can we expect that every student will be good in mathematics or science.
— PMO India (@PMOIndia) January 29, 2019
Clarity of thought and conviction are essential.
— PMO India (@PMOIndia) January 29, 2019
Yes, science and maths are essential but there are other subjects too worth exploring. There are opportunities in so many areas now: PM @narendramodi #ParikshaPeCharcha2
Zenith from Moscow tells PM @narendramodi that after last year's Townhall programme, her parents became a lot more relaxed when it came to subjects like exams and career. #ParikshaPeCharcha2
— PMO India (@PMOIndia) January 29, 2019
अभिभावकों का सकारात्मक रवैया बच्चे की जिंदगी की बहुत बड़ी ताकत बन जाता है: PM @narendramodi #ParikshaPeCharcha2
— PMO India (@PMOIndia) January 29, 2019
Jairpeet Singh is a student based in Tehran, Iran. He is asking PM on the need on encouraging our children constantly and how constant encouragement makes children very happy. #ParikshaPeCharcha2
— PMO India (@PMOIndia) January 29, 2019
आप अपनी तुलना अपने पुराने रिकॉर्ड से कीजिए, आप competition अपने रिकॉर्ड से कीजिए, आप अपने रिकॉर्ड ब्रेक कीजिए, आप अगर खुद के रिकॉर्ड ब्रेक करेंगे तो आपको कभी भी निराशा के गर्त में डूबने का मौका नहीं आयेगा: PM @narendramodi #ParikshaPeCharcha2
— PMO India (@PMOIndia) January 29, 2019
Sara Sadaf from Kuwait makes a few points on the need to further improve education systems and ensure that exams are not only reduced to rote learning but also showcase what students have learnt. #ParikshaPeCharcha2
— PMO India (@PMOIndia) January 29, 2019
Our learning cannot be reduced to exams only. Our education must equip us to face various challenges of life as well: PM @narendramodi #ParikshaPeCharcha2
— PMO India (@PMOIndia) January 29, 2019
In a nation like ours, the subject of depression is very worrying.
— PMO India (@PMOIndia) January 29, 2019
Our culture has mechanisms to cope with this.
The more we talk openly about aspects relating to depression and mental health, it is better.
We must always express, never suppress: PM @narendramodi
A person does not always get depressed all of a sudden. There are signs that show a person is heading into depression.
— PMO India (@PMOIndia) January 29, 2019
Ignoring these signs is not a good idea. On the contrary, we must talk about this: PM @narendramodi #ParikshaPeCharcha2
Counselling is not bad thing.
— PMO India (@PMOIndia) January 29, 2019
Talking about ones problems is very good: PM @narendramodi