We are working towards ensuring that income of our hardworking farmers double by 2022: PM Modi
For the first time we have decided that MSP will be 1.5 times the input cost of farmers: PM Modi
The country has seen record production of pulses, fruits, vegetables and milk: PM Modi
Due to blue revolution, pisciculture has seen a jump of 26%: PM Modi
We are focussing on 'Beej Se Bazar Tak'. We are creating a system which benefits farmers from the time of sowing the seeds till selling the produce in markets: PM
Neem coating of urea has benefitted the farmers immensely, says PM Modi
Through e-NAM, farmers can now directly sell their produce in the markets; this has eliminated middlemen: PM Modi
We are promoting organic farming across the country, especially the eastern region: PM Modi

దేశ‌వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల‌తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించారు. ఈ కార్యక్రమం లో 2 ల‌క్ష‌ల‌కు పైగా కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లు (సిఎస్‌సి) మ‌రియు 600 కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికె) సంధాన‌మ‌య్యాయి. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు చెందిన వివిధ ల‌బ్దిదారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌ధాన మంత్రి జ‌రిపిన సంభాష‌ణ‌ల ప‌రంప‌ర‌ లో ఇది ఏడో ముఖాముఖి స‌మావేశం.

600కు పైగా జిల్లా ల‌కు చెందిన రైతుల‌తో మ‌మేకం కావ‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ, రైతులు మ‌న దేశానికి ‘‘అన్న‌దాత‌లు’’ అని పేర్కొన్నారు. దేశం ఆహార భ‌ద్ర‌త‌ను సాధించిందంటే అందుకు పూర్తి ఘ‌న‌త రైతుల‌కే ద‌క్కాల‌ని ఆయ‌న అన్నారు.

రైతుల‌తో జ‌రిపిన సంభాష‌ణ క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి సేంద్రియ వ్య‌వ‌సాయం, నీలి విప్ల‌వం, ప‌శువుల పెంపకం, తోట పంట‌లు, పూల జాతుల మొక్క‌ల పెంప‌కం వంటి రంగాల‌తో పాటు వ్య‌వ‌సాయానికి సంబంధించిన విస్తృత శ్రేణి అంశాలు చోటుచేసుకొన్నాయి.

దేశంలో రైతుల స‌ర్వ‌తోముఖ అభివృద్ధి విష‌యంలో త‌న దార్శ‌నిక‌త‌ ను ప్ర‌ధాన మంత్రి వెల్ల‌డి చేస్తూ, 2022వ సంవ‌త్స‌రం కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయ‌డం కోసం మ‌రియు వారు పండించిన పంట‌కు గ‌రిష్ఠ ధ‌ర అంద‌డం కోసం ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని తెలిపారు. వ్య‌వ‌సాయం లో నాట్లు మొద‌లుకొని ఫ‌ల సాయం విక్ర‌యాల వ‌ర‌కు అన్ని ద‌శ‌ల‌లోను రైతులు స‌హాయాన్ని అందుకొనే విధంగా చూడాల‌న్న‌దే ధ్యేయ‌మ‌ని ఆయ‌న వివ‌రించారు. ముడి ప‌దార్థాలను క‌నీస ఖ‌ర్చు కే ల‌భించేటట్టు చూడడం, పంట దిగుబ‌డికి న్యాయ‌మైన విలువ‌ను అందించ‌డం, వృథా ను అరిక‌ట్ట‌డంతో పాటు రైతులకు ప్ర‌త్యామ్నాయ ఆదాయ వ‌న‌రుల క‌ల్ప‌న ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించడం ప్రభుత్వ ప్రయత్నాలలో భాగంగా ఉన్నాయని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

‘బీజ్ సే బాజార్’ (విత్త‌నం నుండి విప‌ణి వ‌ర‌కు) వ్య‌వ‌సాయ‌దారులు ల‌బ్ది పొందాల‌ని ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకొంద‌ని ఆయ‌న చెబుతూ, సాంప్ర‌దాయ‌క సేద్యాన్ని మెరుగు ప‌ర‌చుకోవ‌డంలో వివిధ కార్య‌క్ర‌మాలు రైతుల‌కు ఏవిధంగా తోడ్ప‌డిందీ చెప్పుకొచ్చారు.

వ్య‌వ‌సాయ రంగంలో మార్పును గురించి శ్రీ న‌రేంద్ర మోదీ వివ‌రిస్తూ, గ‌త 48 నెల‌ల్లో వ్య‌వ‌సాయ‌ రంగం శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందింద‌న్నారు. ఈ కాలంలో దేశంలో పాలు, ఫలాలు, ఇంకా కాయ‌గూర‌ల ఉత్ప‌త్తి రికార్డు స్థాయికి చేరుకొన్నట్లు ఆయన తెలిపారు.

ఇదివ‌ర‌క‌టి ప్ర‌భుత్వ హయాంలోని అయిదు సంవ‌త్స‌రాల‌లో వ్య‌వ‌సాయ రంగానికి జ‌రిగిన 1,21,000 కోట్ల రూపాయ‌ల‌ కేటాయింపులతో పోలిస్తే, వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ (2014-19 మ‌ధ్య కాలంలో) కేటాయింపులను 2,12,000 కోట్ల‌ రూపాయల మేర చేసి ప్రభుత్వం ఈ కేటాయింపును దాదాపు రెండింత‌లకు చేర్చింది. అదే విధంగా, ఆహార ధాన్యాల ఉత్ప‌త్తి 2010-2014 మ‌ధ్య కాలంలోని స‌రాస‌రి 255 మిలియ‌న్ ట‌న్నుల‌తో పోలిస్తే 2017-2018 లో 279 మిలియ‌న్ ట‌న్నుల‌కు పైగా స్థాయికి పెరిగింది. ఇదే కాలంలో చేప‌ల పెంప‌కం నీలి విప్ల‌వం కార‌ణంగా 26 శాతానికి ఎగబాకింది. ప‌శుగ‌ణాభివృద్ధి, ఇంకా పాల ఉత్ప‌త్తి లో సైతం 24 శాతం పెరుగుద‌ల న‌మోదు అయింది.

రైతుల‌తో ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, రైతు యొక్క స‌మ‌గ్ర సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్ర‌భుత్వం భూమి స్వ‌స్థ‌త కార్డుల‌ను అందించిందని, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ప‌ర‌ప‌తి సౌక‌ర్యాన్ని క‌ల్పించింద‌ని, వేప పూత పూసిన యూరియా ద్వారా నాణ్య‌మైన ఎరువుల‌ను సమకూర్చింద‌ని, ఫ‌స‌ల్ బీమా యోజ‌న ద్వారా పంట బీమా స‌దుపాయాన్ని క‌ల్పించింద‌ని, అలాగే ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన ద్వారా సేద్య‌పు నీటి పారుద‌ల సౌక‌ర్యాన్ని స‌మ‌కూర్చింద‌ని వివ‌రించారు. ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల‌లో దాదాపు 100 సేద్య‌పు నీటిపారుద‌ల ప‌థ‌కాలు ప్ర‌స్తుతం నిర్మాణం పూర్తి అయ్యే ద‌శ‌కు చేరుకొంటున్నాయి; త‌ద్వారా సుమారు 29 ల‌క్ష‌ల హెక్టార్ల భూమి సాగు యోగ్యంగా మారుతుంది.

రైతులు వారి పంట‌లను స‌రైన ధ‌ర‌కు విక్ర‌యించడానికి వీలుగా ఒక ఆన్‌లైన్ ప్లాట్ ఫార‌మ్ గా e-NAM ను కూడా ప్ర‌భుత్వం ప్రారంభించింది. గ‌త నాలుగు సంవ‌త్స‌రాల‌లో 585 కి పైగా నియంత్రిత టోకు విప‌ణుల‌ను e-NAM ప‌రిధి లోకి తీసుకు రావ‌డ‌మైంది. ప్ర‌భుత్వం దాదాపు 22 ల‌క్ష‌ల హెక్టార్ల భూమిని కూడా సేంద్రియ వ్య‌వ‌సాయం ప‌రిధి లోకి తీసుకు వ‌చ్చింది. 2013-2014 లో ఈ విధంగా తీసుకు వ‌చ్చిన‌టువంటి భూమి విస్తీర్ణం కేవ‌లం 7 ల‌క్ష‌ల హెక్టార్లుగా ఉంది. ప్ర‌భుత్వం ఈశాన్య ప్రాంత రాష్ట్రాల‌ను సేంద్రియ వ్య‌వ‌సాయానికి కేంద్రంగా ప్రోత్స‌హించే దిశగా ప్రణాళికలను రచిస్తోంది.

ఫార్మ‌ర్ ప్రొడ్యూస‌ర్ గ్రూపు ను మ‌రియు ఫార్మ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఆర్గ‌నైజేష‌న్ (ఎఫ్‌పిఒ)ను ఏర్పాటు చేయ‌డం ద్వారా రైతుల స‌మ‌ష్టి శ‌క్తిని చాటి చెప్ప‌డంలోను, వారికి వ్య‌వ‌సాయ సంబంధ ముడి ప‌దార్థాలు త‌క్కువ ఖ‌ర్చులో ల‌భ్యం అయ్యేలాడి, ఇంకా వారు పండించిన పంట‌కు చ‌క్క‌టి మార్కెటింగ్ స‌దుపాయం ల‌భించేట‌ట్లుగా చూడ‌డం త‌న‌కు సంతోషాన్ని ఇచ్చినట్లు ప్ర‌ధాన మంత్రి- త‌న సంభాష‌ణ క్ర‌మంలో- వెల్ల‌డించారు. గ‌డచిన 4 సంవ‌త్స‌రాల‌లోనూ 517 ఫార్మ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఆర్గ‌నైజేశన్ లను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. మ‌రి అలాగే, ఫార్మ‌ర్ ప్రొడ్యూస‌ర్ కంపెనీల‌కు ఆదాయ‌పు ప‌న్ను నుండి మిన‌హాయింపు ను మంజూరు చేసి, వ్య‌వ‌సాయ‌దారుల‌లో స‌హ‌కార సంఘాల‌ను ప్రోత్స‌హించ‌డ‌మైంది.

ప్ర‌భుత్వ వివిధ ప‌థ‌కాలు ఉత్ప‌త్తిని మెరుగు ప‌ర‌చ‌డంలో ఏ విధంగా తోడ్పాటును అందించాయో ల‌బ్దిదారులు ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి దృష్టికి తీసుకు వ‌చ్చారు. వారు భూమి స్వ‌స్థ‌త కార్డు యొక్క ప్రాముఖ్యాన్ని ప్ర‌స్తావిస్తూ, స‌హ‌కార ఉద్య‌మంలో త‌మ అనుభ‌వాల‌ను కూడా ప్ర‌ధాన మంత్రి స‌మ‌క్షంలో వెల్ల‌డి చేశారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"